తెలిసిన మహిళను లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి.. | Woman gang-raped in Meerut after she was offered lift | Sakshi
Sakshi News home page

తెలిసిన మహిళను లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి..

Published Mon, Oct 3 2016 4:07 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

తెలిసిన మహిళను లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి..

తెలిసిన మహిళను లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి..

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఇద్దరు దుండగులు ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. మీరట్ జిల్లా సార్దన ప్రాంతంలో శనివారం రాత్రి ఈ దారుణం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

40 ఏళ్ల బాధితురాలకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. వీళ్లలో ఒకడు ఆమెకు తెలిసినవాడు కావడంతో వెంట వెళ్లింది. కాస్త దూరం వెళ్లాక ఆమెకు తెలియకుండా మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చారు. ఆమె డ్రింక్ తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇద్దరూ ఆమెను సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులు బాధితురాలిని అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితురాలు స్పృహలోకి వచ్చాక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement