రేప్ చేసి ... డబ్బు కోసం బెదిరిస్తున్నారు! | Woman gang raped by two youth in karnataka | Sakshi
Sakshi News home page

రేప్ చేసి ... డబ్బు కోసం బెదిరిస్తున్నారు!

Published Sat, Jul 19 2014 10:03 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

రేప్ చేసి ... డబ్బు కోసం బెదిరిస్తున్నారు! - Sakshi

రేప్ చేసి ... డబ్బు కోసం బెదిరిస్తున్నారు!

తాము కోరినంత డబ్బులు ఇవ్వకుంటే నగ్నంగా ఉన్న ఫొటోలు బహిర్గతం చేస్తామంటూ తనను బెదిరిస్తున్నారంటూ అత్యాచారానికి గురైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాణసవాడి సమీపంలోని సెమినరీ (నన్స్ ట్రైనింగ్ సెంటర్)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి(16) శిక్షణకు వచ్చింది. బైరసంద్ర లే ఔట్‌లోని మూడవ క్రాస్‌లో ఉన్న సిస్టర్స్ హోలీ క్యాంపస్‌లో ఉంటున్న ఆమెపై ఈ నెల 16న గుర్తు తెలియని ఇద్దరు అత్యాచారం చేసి ఉడాయించారు.
 
 ఆ రోజు కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీశానని, ఆ సమయంలో నల్ల డబ్బాలోని ద్రావకాన్ని తనపై స్ప్రే చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. రాత్రి స్నేహితులు వస్తున్న సమయంలో మెలుకవ వచ్చి చూసుకున్నప్పుడు తాను నగ్నంగా కాంపౌండ్ ఆవరణంలో పడి ఉన్నానని వివరించింది. తన కాలిపై ‘అడిగిన సొమ్ము ఇవ్వకుంటే నగ్నంగా ఉన్న ఫొటోలను మీడియాకు ఇవ్వడంతో పాటు ఇంటర్నెట్‌లో కూడా పెడతామంటూ రాసి ఉందని తెలిపింది. అత్యాచారం చేసిన దుండగులను గుర్తు పట్టగలనని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు హెణ్ణూరు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement