Two Youth
-
కృష్ణానదిలో ఇద్దరు యువకుల గల్లంతు
నాగాయలంక(అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం ఘాట్ వద్ద సోమవారం కృష్ణానదిలో మునిగి ఓ యువకుడు మృతి చెందగా మరొకరు గల్లంతు అయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం ఇద్దరు యువకులు రెడ్ మారుతీ వ్యాగనార్ కారులో వచ్చి స్నానానికి దిగారు. లోతు ఎక్కువగా ఉంటుందని లోపలకు వెళ్లవద్దని అక్కడున్న వారు హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా నదిలో దిగిన ఆ ఇద్దరూ కొద్ది సేపటికే గల్లంతయ్యారు. ఇరువురిలో పవన్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు పడవపై ఘాట్ వద్దకు చేర్చారు. దుర్గాప్రసాద్ ఆచూకీ తెలియరాలేదు. మిత్రులైన వీరిరువురూ ప్రముఖ మెడికల్ సంస్థ జీఎస్కే (గ్లాక్సో) కంపెనీ సేల్స్ విభాగంలో పని చేస్తున్నారని, అందులో భాగంగానే మెడికల్ షాపులకు వచ్చి.. సరదాగా కాసేపు సేదదీరేందుకు కృష్ణానదిలో దిగి ఉంటారని భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన పరాచి పవన్‌కుమార్(26)గా, గల్లంతైన యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మావూరి దుర్గాప్రసాద్(24)గా గుర్తించారు. -
మైనర్లపై అత్యాచారం, ఇద్దరు యువకుల అరెస్టు
చంచల్‌గూడ: మాయమాటలు చెప్పి అక్కచెల్లెళ్లపై(మైనర్లు) అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకుల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సోమవారం మాదన్నపేట పోలసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం కుర్మగూడ డివిజన్ వికాస్‌నగర్‌కు చెందిన తన కుమార్తెలపై అదే విధీలో నివసించే హన్నన్(20), అఫ్జల్ (22)లు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితుల తల్లి మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఇరువురు బాలికలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
డ్యాంలో ఈతకెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
సంగారెడ్డి: సింగూరు డ్యాంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు గురువారం ఈత కొట్టడానికి సింగూరు డ్యాంకు వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
యువతిని వేధిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
హైదరాబాద్: మద్యం మత్తులో యువతిని వేధిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... నేరేడ్మెట్ క్రాస్‌రోడ్డులో సిగ్నల్ క్రాస్ వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఓ యువతి (18)ని ఇద్దరు వ్యక్తులు వేధించటం అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు గమనించాడు. దీంతో సదరు ఇద్దరు వ్యక్తులను పట్టుకుని స్థానికుల సహాయంతో పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రేమ పేరుతో విద్యార్థిని నమ్మించి...
అనంతపురం : అనంతపురం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థిని నమ్మించి... వంచించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన కార్తీక్ అనే యువకుడు ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఆ క్రమంలో ఆమెకు తెలియకుండా సెల్ ఫోన్‌తో నగ్నంగా ఫొటోలు తీసి వాటిని తన స్నేహితుడు అమర్నాథ్కి చూపించాడు. ఆ క్రమంలో ఇద్దరు కలసి సదరు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. గత కొంత కాలంగా ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం సాగిస్తున్నారు. వాళ్ల వేధింపులు తాళలేక సదరు విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
మడికొండ (వరంగల్ జిల్లా) : మడికొండలోని ఎస్బీహెచ్ బ్యాంక్ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. కె.సముద్రం గ్రామానికి చెందిన బోదాన్ నరేష్(20), సీతాని శీను(21) ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వైపు వెళుతుండగా వేగంగా వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి లారీ కింద పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. -
చంపేస్తామని బెదిరించి గ్యాంగ్‌రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 14 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను తుపాకీతో బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కుత్సెరా గ్రామంలో ఈ దారుణం చేసుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు యువకులు బలవంతంగా ఇంట్లోకి చొరబడి దారుణానికి పాల్పడ్డారు. జరిగిన సంఘటనను ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడనుంచి పారిపోయారని సీనియన్ పోలీస్ అధికారి శనివారం వెల్లడించారు. సకీబ్, రకీబ్ లను నిందితులుగా గుర్తించామన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. -
మద్యం మత్తులో స్నేహితుడిని చంపేశారు..
అడ్డగుట్ట (హైదరాబాద్) : వీకెండ్లో మద్యం పార్టీ నిర్వహించుకున్న నలుగురు స్నేహితులు.. ఆ మత్తులో మాటా మాటా అనుకోవడంతో ఇద్దరు యువకులు కలిసి మరో స్నేహితుడిని బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు. ఇది చూసి తీవ్ర భయాందోళనకు గురైన మరో స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటిరోజు తాపీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ స్నేహితుడిని హతమార్చామని లొంగిపోయారు. ఈ సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ కరణ్‌కుమార్ సింగ్ తెలిపిన కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా దాసిరెడ్డి గూడెంకు చెందిన కొమిరెళ్లి ప్రదీప్‌రెడ్డి (24) ఆగస్టులో నగరానికి వచ్చి శాంతినగర్‌లోని అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. 'మా ఊరి అమ్మాయినే ప్రేమిస్తావా..' శాంతినగర్‌లో నివసించే ప్రదీప్‌రెడ్డి ఇంటికి శనివారం తన స్నేహితులు ఉదయ్, నాగేశ్వర్రావు, లింగస్వామిలు రావడంతో రాత్రి సుమారు 8.30 గంటలకు విందు ఏర్పాటు చేసి, మద్యం పార్టీ చేసుకున్నారు. తాగిన మత్తులో ఉన్న ఉదయ్‌కిరణ్ తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తను మీ గ్రామంలోనే ఉంటుందని, ఎలాగైనా ఆ అమ్మాయిని నువ్వే ఒప్పించాలని ప్రదీప్‌రెడ్డితో ఆవేశంగా చెప్పాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రదీప్‌రెడ్డి క్షణికావేశంలో మా ఊరి అమ్మాయినే ప్రేమిస్తావా అని అంటూ పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్‌లో ఉదయ్‌కిరణ్ తలపై కొట్టాడు. ఆ వెంటనే మరో స్నేహితుడు నాగేశ్వర్రావు ఒక చిన్న కత్తితో ఉదయ్ ఛాతిలో, కడుపులో పొడిచాడు. లింగస్వామి ఎంత ఆపడానికి ప్రయత్నించినా వినకుండా ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర్‌రావులు తీవ్రంగా కొట్టి, కత్తితో పొడిచి ఉదయ్‌ను హతమార్చారు. ఒక్కసారిగా రక్తపు మడుగులో ఉన్న వీరిని చూసి లింగస్వామి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శనివారం ఉదయ్‌కిరణ్‌ను హత్య చేసిన ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర్‌రావులు ఇద్దరు అతని మృతదేహాన్ని రూమ్‌లోనే ఉంచి బయటి నుంచి ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఆదివారం రాత్రి సుమారు 11 గంటలకు స్థానిక లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో జరిగిన సంఘటన గురించి వివరించి హత్య చేసింది తామేనని చెప్పి లొంగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రూమ్‌లో ఉన్న పది బీరు బాటిళ్లు, బేస్‌బాల్ బ్యాట్, చిన్న కత్తి, వికెట్లను లాలాగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాల్పడిన ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర్‌రావులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న లింగస్వామి కోసం గాలిస్తున్నామన్నారు. -
పెన్నానదిలో ఈతకెళ్లి ఇద్దరి గల్లంతు
కోవూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కోవూరు మండలం వేగూరు కండ్రిగ గ్రామం సమీపంలో ఉన్న పెన్నానదిలో ఈతకెళ్లి చక్రపాణి(21), జైపాల్(21) అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
విశాఖలో ఇద్దరి యువకుల గల్లంతు
విశాఖపట్నం: వారాంతంలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఇద్దరు యువకులు అనూహ్యంగా గల్లంతయ్యారు. విశాఖపట్నం భీమిలిలోని ఆనందనగర్‌కు చెందిన వాసు(23), నరేష్కుమార్(21)లు ఈత కొట్టడానికి చాపరాయి వాగుకు వెళ్లారు. ఈతకు దిగిన ఇద్దరు యువకులు నీటిలో మునిగిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు యువకుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గతం కొంతకాలంగా ఇదే ప్రాంతంలో 25 మంది గల్లంతయ్యారని స్థానికులు చెప్పారు. -
కాణిపాకంలో టవరెక్కిన ఆలయ మాజీ సిబ్బంది
కాణిపాకం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన నియమించిన సిబ్బంది గడువు ముగియడంతో సోమవారం వారిని విధుల నుంచి తొలగించారు. దాంతో మనస్థాపానికి గురైన వసంత్, అరుణ్ అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆలయంలో పనిచేసేందుకు 126 మంది సిబ్బందిని ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించుకున్నారు. వారి కాంట్రాక్టు గడువు మూడేళ్లు నిన్నటితో ముగియడంతో ఆలయ ఈవో పాత ఏజెన్సీని రద్దు చేసి కొత్త ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే తొలగించిన 126 మందిలో ఇద్దరు మంగళవారం ఉద్యోగాలు పోవడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ ఎక్కారు. ఆందోళనకారులు ఆలయ ఈవోను ఘెరావ్ చేశారు. దీంతో ఆలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కొత్త ఏజెన్సీకి ఆలయ ఉభయదార్లు మద్దతు ప్రకటిస్తుండగా, కొత్త ఏజెన్సీవారికి బోర్డు సభ్యుల మద్దతు ఉంది. దాంతో సమస్య జటిలంగా మారింది. కాణిపాకం పోలీసులు సంఘటనా స్థలానికి చేరి సెల్ టవర్ ఎక్కినవారిని దిగమని విన్నవిస్తున్నారు. ఆందోళనకారులు దిగకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. -
గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు
దేవీపట్నం (తూర్పుగోదావరి జిల్లా) : గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పోచమ్మగండి దేవాలయం వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దేవాలయం వద్ద స్నానం చేసేందుకు ఇద్దరు యువకులు గోదావరిలో దిగారు. కాగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహ ఉధృతిలో కొట్టుకొనిపోయి గల్లంతయ్యారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. యువకులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. -
పోలీసులు వేధింపులు : యువకులు ఆత్మహత్యాయత్నం
వైఎస్సార్ : ఎవరైన వేధిస్తే... సదరు బాధితులు పోలీసుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకంటారు. మరి అలాంటిది.. పోలీసులే వేధిస్తే.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కడప టూటౌన్‌పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక సాయిపేటకు చెందిన సురేష్ (27), శ్రీనివాస్ (28)లు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం సురేష్, శ్రీనివాస్‌ల ఇంటికి పోలీసులు వెళ్లి మీరు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు... మా వద్ద పక్కా సమాచారం ఉందని బెదిరించారు. మీ మీద కేసు నమోదు చేయకుండా ఉండాలంటే మా ఉన్నతాధికారులతో బేరసారాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇద్దరు యువకులు తమకు బెట్టింగ్‌కు ఎలాంటి సంబంధంలేదని మొరపెట్టుకున్నారు. దాంతో పోలీసులు వెళ్లి పోయారు. మళ్లీ సాయంత్రం వాళ్ల ఇంటి వద్దకు వచ్చి పోలీసులు ఇదే తీరుగా వ్యవహారించడంతో వారిద్దరు తీవ్ర మనస్తాపం చెందారు. దాంతో సదరు యువకులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసుల ఆగడాలపై స్థానికులు మండిపడుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
హైదరాబాద్: ఓ లారీ డ్రై వర్ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. హోండా యాక్టివా వాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన సిలిండర్ల లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన వెంటనే వాహనాన్ని నిలపకుండా డ్రై వర్ అలాగే నడిపించడంతో ఇద్దరు యువకుల మతదేహాలు ఎక్కడికక్కడ చిందర వందరగా మారి కడుపులోని అవయవాలు బయట పడ్డాయి. వివరాలు... నాగోలు జైపురి కాలనీకి చెందిన ముప్పిడి వేణుగోపాల్ గౌడ్ (26), షాయిన్‌నగర్‌కు చెందిన అతని స్నేహితుడు మహ్మద్ అబ్దుల్ రవూఫ్(24)లు విప్రో సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పని చేస్తున్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చాంద్రాయణగుట్ట నుంచి ఐ.ఎస్.సదన్ వైపు వేణుగోపాల్ తన హోండా యాక్టివా ద్విచక్ర వాహనం (టి.ఎస్.08 ఈజీ 4742) నడుపుతుండగా, వెనుక సీట్లో రవూఫ్ కూర్చున్నాడు. సరిగ్గా డీఆర్డీఎల్ ఎదురుగా ఉన్న మిత్రా వైన్స్ ప్రాంతానికి రాగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన హెచ్.పి.గ్యాస్ సిలిండర్ల లారీ (ఏపి 28 యు 7587) యాక్టివా వాహనాన్ని ఢీ కొట్టింది. ఢీ కొట్టిన అనంతరం కూడా లారీని ఆపకుండా డ్రై వర్ అలాగే ముందుకు తీసుకొని వెళ్లాడు. దీంతో ఇద్దరు యువకులు, యాక్టివా వాహనం లారీ చక్రాల కింద నలిగి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లగొండ జిల్లాలో మళ్లీ ఉగ్రవాదుల కలకలం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. గత నెల 26న నకిరేకల్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినవారు ఉగ్రవాదులుగా నిర్థారించినట్లు తెలుస్తోంది. పానగల్లో తప్పించుకున్న ఇద్దరు యువకులు.. ఉగ్రవాదులేనని ఇంటెలిజెన్స్ అధికారులు ధ్రువీకరించినట్లు సమాచారం. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు నిందితుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. వారి ఆచూకీ తెలిపినవారికి బహుమానం కూడా ప్రకటించారు. కాగా మే 26వ తేదీన నకిరేకల్ పట్టణంలో ఇద్దరు దుండగులు పిస్టల్‌తో హల్చల్ సృష్టించారు. వారి సమాచారం అందుకున్న నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు కేశవరెడ్డి, సతీష్‌లు బైక్‌పై సివిల్‌డ్రెస్‌లో మూసీ, హైవే రోడ్డు వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఆఫీసర్స్ కాలనీలో ఇద్దరు యువకులు వైట్‌కలర్ అపాచీపై సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో కానిస్టేబుళ్లు ఆ కాలనీ వైపు వెళ్లారు. ఆఫీసర్స్ క్లబ్ వెనుక సందులో నుంచి ఏపీ 13 ఆర్యూ 4379 నంబరు గల వైట్ కలర్ అపాచీపై వస్తున్న దుండగులను కానిస్టేబుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాలనీలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొడంతో కిందపడిపోయారు. అపాచీ బైక్ నడుపుతున్న ఓ దుండగుడి కాలు బైక్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే సివిల్ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుళ్లు లేచి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు, దుండగుల మధ్య పెనుగులాట కూడా జరిగింది. ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చొని వచ్చిన దుండగుడు తన జేబులో నుంచి పిస్టల్‌ను తీసి కానిస్టేబుళ్లకు ఎక్కుపెట్టాడు. ప్రాణభయంతో భీతిల్లిపోయిన కానిస్టేబుళ్లు కాలనీలోని గృహాల వైపు పరుగుతీశారు. అనంతరం సదరు దుండగులు బైక్ తీసుకుని సూర్యాపేట వైపు పారిపోయారు. దాంతో ఇటీవల నల్లగొండలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ ఇద్దరు యువకులు... దొంగలా.. ఉగ్రవాదులా అన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
తుపాకీతో ఇద్దరు యువకుల హల్ చల్
నల్లగొండ: ఇద్దరు యువకులు తుపాకీతో హల్ చల్ సృష్టించిన ఘటన జిల్లాలోని నకిరేకల్ లో మంగళవారం మధ్యాహ్న ప్రాంతంలో కలకలం రేపింది. బైక్ పై వచ్చిన ఆ యువకులు స్థానికులను తుపాకీతో బెదిరించి పరారయ్యారు. దీంతో సమాచారం అందుకున్న ఐడీపార్టీ అధికారులు సంఘటాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఇద్దరు యువకులు అపాచి బైక్( నెం ఏపీ 13, ఆర్ యూ 4379 )పై వచ్చినట్లు స్థానికులు అధికారులకు తెలిపారు. వారు హిందీలో మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ యువకులకు ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు అనేకోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఐడీపార్టీ అధికారులను హైదరాబాద్ కు పిలిపించిన ఐజీ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల నల్లగొండలో జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద దారిదోపిడీ
కంపెనీకి సంబంధించిన డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న ఉద్యోగి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 6 లక్షల రూపాయలు దోచుకున్నారు. గుంటూరు లక్ష్మీపురం ప్రాంతంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎదురుగా ఈ సంఘటన జరిగింది. గుంటూరు ఎస్వీఎన్ కాలనీ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు ఓ మిర్చి కంపెనీలో ఉద్యోగి. అతడు కంపెనీకి సంబంధించిన చెక్కు తీసుకుని ఉదయం 11.30 గంటల ప్రాంతంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ 6 లక్షల రూపాయలు డ్రా చేసుకుని బయటకు వచ్చి, డబ్బులున్న బ్యాగును బైకు ముందు భాగంలో పెట్టుకుని బయల్దేరుతుండగా, పక్కనే నల్లటి పల్సర్ వాహనం మీద ఇద్దరు యువకులు వచ్చారు. వారిద్దరూ హెల్మెట్లు పెట్టుకునే ఉన్నారు. వెంకటేశ్వరరావు తన వాహనం స్టార్ట్ చేసుకుని వెళ్లబోతుండగా వెనక ఉన్న యువకుడు బ్యాగ్ లాక్కున్నాడు. వెంటనే ఇద్దరూ తమ వాహనంపై దూసుకెళ్లిపోయారు. వారిని పట్టుకోడానికి వెంకటేశ్వరరావు కొంతదూరం వెళ్లినా, వాళ్లను అందుకోలేకపోయాడు. తిరిగి బ్యాంకుకు వచ్చి అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజి పరిశీలించినా, అక్కడ బ్యాంకు వద్ద పార్కు చేసిన వాహనాలు కనిపించాయే తప్ప.. రోడ్డుమీద ఉన్నవేవీ కనిపించలేదు. మూడు నెలల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఇలాగే రెండు మూడు దొంగతనాలు జరిగాయి. పట్టాభిపురం పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రేప్ చేసి ... డబ్బు కోసం బెదిరిస్తున్నారు!
తాము కోరినంత డబ్బులు ఇవ్వకుంటే నగ్నంగా ఉన్న ఫొటోలు బహిర్గతం చేస్తామంటూ తనను బెదిరిస్తున్నారంటూ అత్యాచారానికి గురైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాణసవాడి సమీపంలోని సెమినరీ (నన్స్ ట్రైనింగ్ సెంటర్)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి(16) శిక్షణకు వచ్చింది. బైరసంద్ర లే ఔట్లోని మూడవ క్రాస్‌లో ఉన్న సిస్టర్స్ హోలీ క్యాంపస్‌లో ఉంటున్న ఆమెపై ఈ నెల 16న గుర్తు తెలియని ఇద్దరు అత్యాచారం చేసి ఉడాయించారు. ఆ రోజు కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీశానని, ఆ సమయంలో నల్ల డబ్బాలోని ద్రావకాన్ని తనపై స్ప్రే చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. రాత్రి స్నేహితులు వస్తున్న సమయంలో మెలుకవ వచ్చి చూసుకున్నప్పుడు తాను నగ్నంగా కాంపౌండ్ ఆవరణంలో పడి ఉన్నానని వివరించింది. తన కాలిపై ‘అడిగిన సొమ్ము ఇవ్వకుంటే నగ్నంగా ఉన్న ఫొటోలను మీడియాకు ఇవ్వడంతో పాటు ఇంటర్నెట్లో కూడా పెడతామంటూ రాసి ఉందని తెలిపింది. అత్యాచారం చేసిన దుండగులను గుర్తు పట్టగలనని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు హెణ్ణూరు పోలీసులు తెలిపారు. -
నెలరోజులుగా సికింద్రాబాద్ బాలికపై విజయవాడలో అత్యాచారం
విజయవాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికను గదిలో బంధించి నెల రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన బాలికగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇంట్లో కొట్టారని ఆమె విజయవాడకు పారిపోయింది. గతంలో ఇక్కడికి వచ్చినపుడు పరిచయమైన మాధవ్ అనే యువకుడిని కలుసుకుంది. అతను ఆ అమ్మాయిని ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాధవ్ తన స్నేహితుల్ని బాధితురాలికి పరిచయం చేశాడు. వీరందరూ అమ్మాయిని ఓ గదిలో బంధించి నెల రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. దుర్గ ఘాట్ వద్ద బాధితురాలు ఓ యువకుడితో కలసి అనుమానస్పదంగా కనిపించింది. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగుచూసింది. తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక వెల్లడించింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులను సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై నిర్బయ చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
నెలరోజులుగా బాలికపై అత్యాచారం
-
విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి
-
విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఈ రోజు తెల్లవారుజామున మహబూబ్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని యూబీ గార్డెన్ ఫంక్షన్హాల్లో విద్యుత్ మరమతులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఇనుప నుచ్చెనపై నిల్చుని ఇద్దరు యువకులు మరమతులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆ ఇనుప నుచ్చెన హైటెన్షన్ వైర్లకు తగిలింది. దాంతో ఆ యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని సీఐటీయూ ఆధ్వరంలో యూబీ ఫంక్షన్ హాల్ ఎదుట ధర్నా నిర్వహించారు.