విశాఖపట్నం: వారాంతంలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఇద్దరు యువకులు అనూహ్యంగా గల్లంతయ్యారు. విశాఖపట్నం భీమిలిలోని ఆనందనగర్‌కు చెందిన వాసు(23), నరేష్‌కుమార్(21)లు ఈత కొట్టడానికి చాపరాయి వాగుకు వెళ్లారు.
ఈతకు దిగిన ఇద్దరు యువకులు నీటిలో మునిగిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు యువకుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గతం కొంతకాలంగా ఇదే ప్రాంతంలో 25 మంది గల్లంతయ్యారని స్థానికులు చెప్పారు.