Man Missing After His Lover Pressured Him For Marriage In Vizag - Sakshi
Sakshi News home page

భార్య ఉండగానే 56 ఏళ్ల వయసులో మరో మహిళతో లవ్‌ ఎఫైర్‌.. చివరికి బిగ్‌ ట్విస్ట్‌

Published Thu, Aug 25 2022 8:37 PM | Last Updated on Sat, Aug 27 2022 9:21 AM

Man Missing After His Lover Pressured Him For Marriage In Vizag - Sakshi

సన్యాసిరావు (ఫైల్‌) 

గాజువాక (విశాఖపట్నం): భార్య ఉండగానే మరో మహిళతో ప్రేమలో పడిన ఒక ప్రబుద్ధుడు పెళ్లి ఒత్తిడితో ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన ఇండుగుబిల్లి సన్యాసిరావు (56) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
చదవండి: డేటింగ్‌సైట్లు.. హైటెక్‌ వ్యభిచారం.. సిటీ యువతుల ఫొటోలు వాట్సాప్‌కు పంపి..

అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. భార్య ఉండగానే మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె ఒత్తిడి చేస్తోంది. 56 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకుంటే కుటుంబం పరువు పోతుందని భావించిన సన్యాసిరావు ఈ నెల 21న ఇంటి నుంచి అదృశ్యమైనట్టు అతడి భార్య పద్మ గాజువాక పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గాజువాక ఎస్‌ఐ కె.సతీష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement