తుపాకీతో ఇద్దరు యువకుల హల్ చల్ | two youth suspected to have links with terrorists, seen with guns in nalgonda | Sakshi
Sakshi News home page

తుపాకీతో ఇద్దరు యువకుల హల్ చల్

Published Tue, May 26 2015 3:54 PM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

తుపాకీతో ఇద్దరు యువకుల హల్ చల్

తుపాకీతో ఇద్దరు యువకుల హల్ చల్

నల్లగొండ: ఇద్దరు యువకులు తుపాకీతో హల్ చల్ సృష్టించిన ఘటన జిల్లాలోని నకిరేకల్ లో మంగళవారం మధ్యాహ్న ప్రాంతంలో కలకలం రేపింది. బైక్ పై వచ్చిన ఆ యువకులు స్థానికులను తుపాకీతో బెదిరించి పరారయ్యారు.  దీంతో సమాచారం అందుకున్న ఐడీపార్టీ అధికారులు సంఘటాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఇద్దరు యువకులు అపాచి బైక్( నెం ఏపీ 13, ఆర్ యూ 4379 )పై వచ్చినట్లు స్థానికులు అధికారులకు తెలిపారు. వారు హిందీలో మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు.

 

ఆ యువకులకు ఉగ్రవాదులతో  ఏమైనా సంబంధాలు అనేకోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఐడీపార్టీ అధికారులను హైదరాబాద్ కు పిలిపించిన ఐజీ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల నల్లగొండలో జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement