గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు | Two youth went missing in Godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు

Published Sun, Aug 30 2015 11:21 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

Two youth went missing in Godavari

దేవీపట్నం (తూర్పుగోదావరి జిల్లా) : గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పోచమ్మగండి దేవాలయం వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దేవాలయం వద్ద స్నానం చేసేందుకు ఇద్దరు యువకులు గోదావరిలో దిగారు.

కాగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహ ఉధృతిలో కొట్టుకొనిపోయి గల్లంతయ్యారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్లు  సమాచారం. యువకులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement