హైదరాబాద్: ఓ లారీ డ్రై వర్ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. హోండా యాక్టివా వాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన సిలిండర్ల లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన వెంటనే వాహనాన్ని నిలపకుండా డ్రై వర్ అలాగే నడిపించడంతో ఇద్దరు యువకుల మతదేహాలు ఎక్కడికక్కడ చిందర వందరగా మారి కడుపులోని అవయవాలు బయట పడ్డాయి.
వివరాలు... నాగోలు జైపురి కాలనీకి చెందిన ముప్పిడి వేణుగోపాల్ గౌడ్ (26), షాయిన్‌నగర్‌కు చెందిన అతని స్నేహితుడు మహ్మద్ అబ్దుల్ రవూఫ్(24)లు విప్రో సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పని చేస్తున్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చాంద్రాయణగుట్ట నుంచి ఐ.ఎస్.సదన్ వైపు వేణుగోపాల్ తన హోండా యాక్టివా ద్విచక్ర వాహనం (టి.ఎస్.08 ఈజీ 4742) నడుపుతుండగా, వెనుక సీట్లో రవూఫ్ కూర్చున్నాడు.
సరిగ్గా డీఆర్‌డీఎల్ ఎదురుగా ఉన్న మిత్రా వైన్స్ ప్రాంతానికి రాగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన హెచ్.పి.గ్యాస్ సిలిండర్ల లారీ (ఏపి 28 యు 7587) యాక్టివా వాహనాన్ని ఢీ కొట్టింది. ఢీ కొట్టిన అనంతరం కూడా లారీని ఆపకుండా డ్రై వర్ అలాగే ముందుకు తీసుకొని వెళ్లాడు. దీంతో ఇద్దరు యువకులు, యాక్టివా వాహనం లారీ చక్రాల కింద నలిగి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
Published Fri, Jun 19 2015 11:26 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement