సాక్షి, మండ్య: వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు టైర్ పేలడంతో డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారును గుద్దింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలోని ముగ్గురు, స్విఫ్ట్‌లోని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆదివారం రాత్రి మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని ఎ.నాగతిహళ్ళి వద్ద బెంగళూరు– మంగళూరు హైవే పై జరిగింది. బెంగళూరు నుంచి హాసన్‌వైపు వెళుతున్న ఇన్నోవా కారు టైర్ పేలి అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్ మీదకు దూసుకెళ్లింది.
అదే సమయంలో హాసన్ నుంచి బెంగళూరు వైపు వస్తున్న స్విఫ్ట్ కారు మీద ఇన్నోవా పడడంతో రెండు వాహనాలూ తుక్కుతుక్కయ్యాయి. స్విఫ్ట్‌లో ప్రయాణిస్తున్న హాసన్‌కు చెందిన జయంతి (60), శ్రీనివాస్ మూర్తి (60), ఇన్నోవాలోని చెన్నైకి చెందిన కిశోర్ (25), ప్రభాకర్ (75), మరొక 40 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదిచుంచనగిరి ఆస్పత్రికి తరలించారు. బిండిగనవిలె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment