devider
-
తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
తిరుపతి, సాక్షి: చంద్రగిరిలో ఈ వేకువ ఝామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారిపల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులు నెల్లూరువాసులుగా పోలీసులు చెబుతున్నప్పటికీ.. వాళ్ల వివరాలను మాత్రం వెల్లడించలేదు. కారు కల్వర్ట్‌లో ఇరుక్కున్న స్థితిని బట్టి అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. గడ్డపార సాయంతో ఇరుక్కున్న కారు డోర్లను బద్ధలుకొట్టి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ AP 26 BH 3435 కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
బైక్‌పై దూసుకెళ్తూ మొబైల్ దొంగ దుర్మరణం!
సాక్షి, శివాజీనగర: ప్రజల నుంచి మొబైల్ఫోన్లు లాక్కెళ్తూ వేగంగా దూసుకెళ్లిన బైకర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోడ్డు డివైడర్‌కు బైక్ ఢీకొనడంతో ఒకరు అక్కడే మృతి చెందగా అతని వద్ద 8 మొబైల్ఫోన్లు చిక్కడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి సిటీ మార్కెట్ పై వంతెన మీద ఈ ఘటన జరిగింది. మృతుడు కబీర్ పాషా. అతి వేగంగా పై వంతెన మీద వెళుతుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పడడంతో తలకు గాయాలై చనిపోయాడు. ద్విచక్ర వాహనంలో ఎనిమిది మొబైల్‌లు లభించడం పలు అనుమానాలకు కారణమైంది. కేపీసీసీ కార్యాలయం వద్ద ఓ మహిళ మొబైల్ ఫోన్‌ను లాక్కొని పరారైంది ఇతడేనని అనుమానం ఉంది. సెల్ చోరీలకు పాల్పడి ఉడాయించాలనే తొందరలో ప్రమాదానికి గురైనట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరో వ్యక్తి గాయపడగా ఆస్పత్రికి తరలించారు. (చదవండి: భార్యకు బీమా పత్రాలు, డెత్‌నోట్ వాట్సాప్ చేసి..) -
టైర్ పేలి దూసుకెళ్లిన ఇన్నోవా ..ఐదుగురు మృతి
సాక్షి, మండ్య: వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు టైర్ పేలడంతో డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారును గుద్దింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలోని ముగ్గురు, స్విఫ్ట్‌లోని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆదివారం రాత్రి మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని ఎ.నాగతిహళ్ళి వద్ద బెంగళూరు– మంగళూరు హైవే పై జరిగింది. బెంగళూరు నుంచి హాసన్‌వైపు వెళుతున్న ఇన్నోవా కారు టైర్ పేలి అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్ మీదకు దూసుకెళ్లింది. అదే సమయంలో హాసన్ నుంచి బెంగళూరు వైపు వస్తున్న స్విఫ్ట్ కారు మీద ఇన్నోవా పడడంతో రెండు వాహనాలూ తుక్కుతుక్కయ్యాయి. స్విఫ్ట్‌లో ప్రయాణిస్తున్న హాసన్‌కు చెందిన జయంతి (60), శ్రీనివాస్ మూర్తి (60), ఇన్నోవాలోని చెన్నైకి చెందిన కిశోర్ (25), ప్రభాకర్ (75), మరొక 40 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదిచుంచనగిరి ఆస్పత్రికి తరలించారు. బిండిగనవిలె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. (చదవండి: పండ్లరసంలో మద్యం కలిపి తాగించి.వృద్ధుడు అఘాయిత్యం) -
ట్రాఫిక్ని బట్టి సెట్ చేసుకునే డివైడర్: వీడియో వైరల్
మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాలు గురించి అందరికి తెలిసిందే. ఏదైన పండుగలకు లేదా ప్రత్యేకమైన రోజుల్లో సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లామా! అంతే ట్రాఫిక్‌లో చిక్కుకుపోతాం. అసలు ఆ ట్రాఫిక్ నుంచి బయటపడితే ఏదో సాధించనంత ఫీలింగ్ వస్తుంది. ఐతే ఆ సమస్యలన్నింటికి చెక్‌పెడుతూ చైనా ఒక కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. చైనీయులు ఈ ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఒక సరికొత్త విధానాన్ని కూడా అనుసరిస్తున్నారు. ఈ విషయాలన్నింటిని వినియోగదారులతో పంచుకుంటూ... ఒక వీడియోను పోస్ట్ చేశారు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువాచున్యింగ్. ఆ వీడియోలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడూ క్లియర్ చేసేందుకు ఒక రివర్సబుల్ లేన్ పని తీరు చూపిస్తుంది. ఇది ఏంటంటే...రోడ్డు మధ్యలో ఉండే డివైడర్ వెడల్పును కావల్సినట్లుగా ఎడ్జెస్ట్ చేసుకుంటూ ట్రాఫిక్ని తగ్గించడం. చైనా వాసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఉదయం ఒక దిశలోనూ సాయంత్రం సమయాల్లో వ్యతిరేక దిశలో వెళ్తారు. అందుకోసం ఆయా దిశల్లో వెళ్లేలా డివైడర్ లైన్‌ని సెట్ చేసేకునే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ మేరకు ఆ వీడియోలో ఆ డివైడర్ లైన్‌ని ట్రాఫిక్ కోసం జిప్ మాదిరిగా రెండు వాహనాల సాయంతో దగ్గరగా చేయడం కనిపిస్తుంది. వీటిని రివర్సబుల్ ట్రాఫిక్ లైన్లు అంటారు. ఇవి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపకరిస్తాయి. ఐతే నెటిజన్లు దీన్ని సరికొత్త సాంకేతిక ఆవిష్కరణగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇదేమీ కొత్త ఆవిష్కరణ కాదని అమెరికా 1960లలోనే ఈ మౌలిక సదుపాయాల ఆవిష్కరణను ప్రవేశపెట్టినట్లు సమాచారం. #ChinaInfrastructure: How does Beijing relieve traffic jams? By changing the direction of traffic. Here's how they do it. The traffic authority selects a lane to go one direction in the morning and the opposite direction in the evening to release peak pressure. pic.twitter.com/OaaxycwDJQ — Hua Chunying 华春莹 (@SpokespersonCHN) August 31, 2022 (చదవండి: స్నేహితుడి కోసం ఎంతలా తపించిందో ఆ కంగారు: వీడియో వైరల్) -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై ఐతేపల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు.మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని.. తిరుపతి లోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంటలార్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రాజేంద్రనగర్‌లో దారుణం.. స్నేహితుడిని వదిలి వస్తుండగా
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. పొగ మంచు కారణంగా రోడ్డు సరిగా కనబడకపోవడంతో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ వివరాలు.. బహదూర్ పూరా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్‌లు బుధవారం తమ స్నేహితుడు జైద్ ఖాన్‌ను సిటీ వద్ద వదిలి తిరుగు ప్రయాణం అయ్యారు. (చదవండి: వేగంగా వెళ్తూ.. చెట్టును ఢీకొట్టి..) ఉదయం పూట పొగమంచు కురవడంతో రోడ్డు సరిగా కనపడలేదు. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్ధానికులు వెంటనే నార్సింగీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: తిరుపతిలో బీభత్సం: టూవీలర్స్‌పైకి దూసుకెళ్లిన కొత్త కారు -
డ్రైవింగ్ నేర్చుకొంటూ యువతి దుర్మరణం
ఆరిలోవ(విశాఖ తూర్పు): డ్రైవింగ్ నేర్చుకొంటూ డివైడర్ని ఢీకొని ఓ యువతి మృతి చెందిన సంఘటన ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చినవాల్తేరు ప్రాంతానికి చెందిన పావని(16) నగరంలోని రామాటాకీస్ దరి మహవీర్ బుక్ షాపులో పనిచేస్తుండేది. ఆమెకు ఆరిలోవ ప్రాంతం జైభీమ్ నగర్‌కు చెందిన కిరణ్‌తో పరిచయమైంది. కిరణ్ ఆమెకు బైక్ డ్రైవింగ్ నేర్పడానికి ఆదివారం ఉదయం బీచ్‌రోడ్డులో రుషికొండ తీసుకెళ్లాడు. బీచ్ రోడ్డులో డ్రైవింగ్ నేర్చుకొనే క్రమంలో బేపార్కు వద్ద మలుపులో ఆమె నడుపుతున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆమెకు పొట్టలో బలమైన గాయమైంది. అదే సమయంలో నడకకోసం వెళ్లిన వారు 108కి సమాచారం అందించి కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. పావని పెదనాన్న పీలా రమణ ఫిర్యాదు మేరకు ఆరిలోవ ఏఎస్ఐ బ్రహ్మాజీ కేసు నమోదు చేశారు. -
డివైడర్‌ను ఢీ కొన్న బైక్: ఇద్దరి మృతి
మిర్యాలగూడ(నల్లగొండ జిల్లా): వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం క్రిష్టాపురం గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఇరియాస్ (26), రాము (27) , మరో వ్యక్తిల కలిసి గురువారం అర్ధరాత్రి క్రిష్టాపురంలో జరిగిన ఒక వేడుకకు వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ నుంచి తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్ డివైడర్‌ను ఢీ కొట్టింది. అయితే, ఈ ఘటనలో ఇరియాస్, రాములిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని వెంటనే హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. -
డివైడర్ ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
మరూర్: అనంతపురం జిల్లా మరూర్ టోల్గేట్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
డివైడర్‌ను ఢీకొట్టిన ఎస్ఐ వాహనం
హైదరాబాద్ సిటీ: వికారాబాద్ ఎస్ఐ నగేష్ వోక్స్వాగన్ వాహనం లక్డావాలా రాజీవ్ రహదారిపై జయశంకర్ చౌరస్తా వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. బందోబస్తు కోసం కీసర నుంచి సికింద్రాబాద్‌లోని బంధువుల ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై నగేష్‌కు స్వల్పగాయాలయ్యాయి. నగేష్‌ను స్థానికంగా ఉన్న అల్వాల్ ఆక్సిజన్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదం కారణంగా కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
డీవైడర్‌ను ఢీకొట్టిన పల్సర్... వ్యక్తి మృతి
గుంటూరు రూరల్: గుంటూరు నగరం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎ.విజయభాస్కర్(48) గుంటూరులోని నవభారత్ కాలనీలో ఓ ఫర్నిచర్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇతడు మరో ఇద్దరితో కలసి పల్సర్ బైక్‌పై నవభారత్ కాలనీ నుంచి గుంటూరు వైపు వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాకుండా, రాసుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో విజయభాస్కర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు విజయభాస్కర్‌కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.