చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం | Five Dead: Car Accident Tragedy In Chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

Published Sun, Dec 5 2021 3:44 PM | Last Updated on Sun, Dec 5 2021 6:46 PM

Five Dead: Car Accident Tragedy In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై ఐతేపల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా.. మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు.మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని.. తిరుపతి లోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంటలార్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement