
తిరుపతి, సాక్షి: చంద్రగిరిలో ఈ వేకువ ఝామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారిపల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులు నెల్లూరువాసులుగా పోలీసులు చెబుతున్నప్పటికీ.. వాళ్ల వివరాలను మాత్రం వెల్లడించలేదు. కారు కల్వర్ట్‌లో ఇరుక్కున్న స్థితిని బట్టి అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు.
గడ్డపార సాయంతో ఇరుక్కున్న కారు డోర్లను బద్ధలుకొట్టి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ AP 26 BH 3435 కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment