బైక్‌పై దూసుకెళ్తూ మొబైల్‌ దొంగ దుర్మరణం!  | Thief Who Stole Mobile Phone Died In Bike Accident | Sakshi
Sakshi News home page

బైక్‌పై దూసుకెళ్తూ మొబైల్‌ దొంగ దుర్మరణం! 

Published Sun, Feb 12 2023 8:04 AM | Last Updated on Sun, Feb 12 2023 8:15 AM

Thief Who Stole Mobile Phone Died In Bike Accident - Sakshi

సాక్షి, శివాజీనగర: ప్రజల నుంచి మొబైల్‌ఫోన్లు లాక్కెళ్తూ వేగంగా దూసుకెళ్లిన బైకర్‌ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోడ్డు డివైడర్‌కు బైక్‌ ఢీకొనడంతో ఒకరు అక్కడే మృతి చెందగా అతని వద్ద 8 మొబైల్‌ఫోన్లు చిక్కడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి సిటీ మార్కెట్‌ పై వంతెన మీద ఈ ఘటన జరిగింది. మృతుడు కబీర్‌ పాషా. అతి వేగంగా పై వంతెన మీద వెళుతుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పడడంతో తలకు గాయాలై చనిపోయాడు.

ద్విచక్ర వాహనంలో ఎనిమిది మొబైల్‌లు లభించడం పలు అనుమానాలకు కారణమైంది. కేపీసీసీ కార్యాలయం వద్ద ఓ మహిళ మొబైల్‌ ఫోన్‌ను లాక్కొని పరారైంది ఇతడేనని అనుమానం ఉంది. సెల్‌ చోరీలకు పాల్పడి ఉడాయించాలనే తొందరలో ప్రమాదానికి గురైనట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరో వ్యక్తి గాయపడగా ఆస్పత్రికి తరలించారు.     

(చదవండి: భార్యకు బీమా పత్రాలు, డెత్‌నోట్‌ వాట్సాప్‌ చేసి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement