రాజేంద్రనగర్‌లో దారుణం.. స్నేహితుడిని వదిలి వస్తుండగా | Hyderabad Rajendra Nagar Car Hit Divider Four Injured | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్‌లో దారుణం.. స్నేహితుడిని వదిలి వస్తుండగా

Published Wed, Nov 10 2021 10:12 AM | Last Updated on Wed, Nov 10 2021 10:53 AM

Hyderabad Rajendra Nagar Car Hit Divider Four Injured - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. పొగ మంచు కారణంగా రోడ్డు సరిగా కనబడకపోవడంతో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ వివరాలు.. బహదూర్ పూరా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్‌లు బుధవారం తమ స్నేహితుడు జైద్‌ ఖాన్‌ను సిటీ వద్ద వదిలి తిరుగు ప్రయాణం అయ్యారు.
(చదవండి: వేగంగా వెళ్తూ.. చెట్టును ఢీకొట్టి..)

ఉదయం పూట పొగమంచు కురవడంతో రోడ్డు సరిగా కనపడలేదు. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్ధానికులు వెంటనే నార్సింగీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

చదవండి: తిరుపతిలో బీభత్సం: టూవీలర్స్‌పైకి దూసుకెళ్లిన కొత్త కారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement