Tier Bursting
-
టైర్ పేలి దూసుకెళ్లిన ఇన్నోవా ..ఐదుగురు మృతి
సాక్షి, మండ్య: వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు టైర్ పేలడంతో డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారును గుద్దింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలోని ముగ్గురు, స్విఫ్ట్‌లోని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆదివారం రాత్రి మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని ఎ.నాగతిహళ్ళి వద్ద బెంగళూరు– మంగళూరు హైవే పై జరిగింది. బెంగళూరు నుంచి హాసన్‌వైపు వెళుతున్న ఇన్నోవా కారు టైర్ పేలి అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్ మీదకు దూసుకెళ్లింది. అదే సమయంలో హాసన్ నుంచి బెంగళూరు వైపు వస్తున్న స్విఫ్ట్ కారు మీద ఇన్నోవా పడడంతో రెండు వాహనాలూ తుక్కుతుక్కయ్యాయి. స్విఫ్ట్‌లో ప్రయాణిస్తున్న హాసన్‌కు చెందిన జయంతి (60), శ్రీనివాస్ మూర్తి (60), ఇన్నోవాలోని చెన్నైకి చెందిన కిశోర్ (25), ప్రభాకర్ (75), మరొక 40 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదిచుంచనగిరి ఆస్పత్రికి తరలించారు. బిండిగనవిలె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. (చదవండి: పండ్లరసంలో మద్యం కలిపి తాగించి.వృద్ధుడు అఘాయిత్యం) -
పగిలిన టైర్.. కారు బోల్తా
- ఇద్దరికి గాయాలు - నుజ్జునుజ్జయిన వాహనం మహేశ్వరం: ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న కారు ముందు టైర్ పగిలిపోవడంతో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయి ఇద్దరికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిపై ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, క్షతగాత్రుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన అరుణ్‌రెడ్డి తన సోదరి సుష్మారెడ్డి కలిసి అంబర్పేట్ నుంచి గచ్చిబౌలికి ఔటర్‌రింగ్ రోడ్డుపైన కారులో వెళ్తున్నాడు. ఉదయం 10 గంటలకు తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జి దగ్గరకు రాగానే కారు ముందు టైరు పేలడంతో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న అరుణ్‌రెడ్డితో పాటు ముందు సీట్లో కూర్చున్న అతడి సోదరి సుష్మారెడ్డి తల, ముఖానికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ఔటర్ రింగ్ రోడ్డుపైన టోల్గేట్ సిబ్బంది గమనించి దగ్గరలో ఉన్న తుక్కుగూడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వారిని తరలించారు. ప్రమాద విషయాన్ని వారి బంధువులకు తెలియజేశారు. అనంతరం క్షతగాత్రులను హైదరాబాద్ తీసుకెళ్లారు. కాగా, సుష్మారెడ్డి గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది.