నెలరోజులుగా సికింద్రాబాద్ బాలికపై విజయవాడలో అత్యాచారం | Secunderabad girl raped in vijayawada | Sakshi
Sakshi News home page

నెలరోజులుగా సికింద్రాబాద్ బాలికపై విజయవాడలో అత్యాచారం

Published Mon, Dec 2 2013 2:34 PM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM

నెలరోజులుగా సికింద్రాబాద్ బాలికపై విజయవాడలో అత్యాచారం

నెలరోజులుగా సికింద్రాబాద్ బాలికపై విజయవాడలో అత్యాచారం

విజయవాడ వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికను గదిలో బంధించి నెల రోజులుగా  అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన బాలికగా  గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

సికింద్రాబాద్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇంట్లో కొట్టారని ఆమె విజయవాడకు పారిపోయింది. గతంలో ఇక్కడికి వచ్చినపుడు పరిచయమైన మాధవ్ అనే యువకుడిని కలుసుకుంది. అతను ఆ అమ్మాయిని ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాధవ్ తన స్నేహితుల్ని బాధితురాలికి పరిచయం చేశాడు. వీరందరూ అమ్మాయిని ఓ గదిలో బంధించి నెల రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. దుర్గ ఘాట్ వద్ద బాధితురాలు ఓ యువకుడితో కలసి అనుమానస్పదంగా కనిపించింది. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగుచూసింది. తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక వెల్లడించింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు  ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులను సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై నిర్బయ చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement