అనంతపురం : అనంతపురం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థిని నమ్మించి... వంచించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన కార్తీక్ అనే యువకుడు ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఆ క్రమంలో ఆమెకు తెలియకుండా సెల్ ఫోన్తో నగ్నంగా ఫొటోలు తీసి వాటిని తన స్నేహితుడు అమర్నాథ్కి చూపించాడు.
ఆ క్రమంలో ఇద్దరు కలసి సదరు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. గత కొంత కాలంగా ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం సాగిస్తున్నారు. వాళ్ల వేధింపులు తాళలేక సదరు విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.