ప్రియుడి కళ్లెదుటే ప్రియురాలిపై అత్యాచారం | Woman gang raped in Tamilnadu | Sakshi
Sakshi News home page

ప్రియుడి కళ్లెదుటే ప్రియురాలిపై అత్యాచారం

Published Tue, Aug 5 2014 9:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

ప్రియుడి కళ్లెదుటే ప్రియురాలిపై  అత్యాచారం

ప్రియుడి కళ్లెదుటే ప్రియురాలిపై అత్యాచారం

 టీనగర్ : ధర్మపురి సమీపంలో ప్రియుడితో కలిసి వెళుతున్న ప్రియురాలిపై నలుగురు దుండగులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే తిరునల్వేలిలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ప్రియుడి కళ్లెదుటే కామాంధులు ప్రియురాలిపై తమ ఘాతుకాన్ని ప్రదర్శించారు. కన్యాకుమారి జిల్లా తిట్టువిలై ప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఇంజినీర్ అరివాల్ తిరునల్వేలి జిల్లాలో కంప్యూటర్ సేల్స్, సర్వీస్ చేస్తుంటారు. ఈయన నాగర్‌కోయిల్ ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆ యువకుడు తన ప్రియురాలితో కలిసి బైక్‌పై వివిధ ప్రాంతాలను సందర్శించి సాయంత్రం తమ ఊరికి బయలుదేరారు.

ఈ జంట ఒంటరిగా వెళ్లడం గమనించిన ముగ్గురు వ్యక్తులు వారిని వెంబడించి నాంగునేరి కళక్కాడు రోడ్డులో జీయ్యర్ కుళం సమీపాన వారిని అటకాయించారు. తర్వాత ప్రేమికుడిని ఒక చెట్టుకు కట్టివేసి ప్రియురాలిని వారు ముగ్గురూ కలిసి లాక్కెళ్లారు. అక్కడున్న పొదల్లోకి ఆమెను తీసుకు వెళ్లి ఒకరి తర్వాత మరొకరు ఆమెపై లైంగిక దాడి జరిపారు. ఆ సమయంలో ప్రేమికుడు అరివాల్‌ను బెదిరించి అతని వద్ద ఉన్న ల్యాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్‌లను అపహరించి పరారయ్యారు. దీనిపై అరివాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువతిని పోలీసులు నాగర్‌కోయిల్‌లో ఆమె బంధువుల ఇంటిలో చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement