computer engineer
-
Texas: భారత సంతతి కంప్యూటర్ ఇంజినీర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
టెక్సాస్: భారత సంతతికి చెందిన రీసెర్చర్ కంప్యూటర్ ఇంజినీర్‌ను అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. టెక్సాస్‌లో అత్యున్నత అకడమిక్ అవార్డుగా పేరొందిన ఎడిత్ అండ్ పీటర్ ఓ డన్నెల్ అవార్డును ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్‌కు అందజేశారు. ఈ అవార్డును ద టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ(టామ్‌సెట్)ఏటా అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారికి ప్రతి ఏటా అందిస్తుంది. అశోక్ వీర రాఘవన్ హూస్టన్‌లోని రైస్ యూనివర్సిటీకి చెందిన జార్జ్ ఆర్.బ్రౌన్ స్కూల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇమేజింగ్ టెక్నాలజీలో చేసిన పరిశోధనలకుగాను వీరరాఘవన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా వీరరాఘవన్ మాట్లాడుతూ ‘అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుత ఇమేజింగ్ టెక్నాలజీలో చాలా సమస్యలున్నాయి. కాంతి ప్రసరించకుండా అడ్డంకులున్నచోట మనకు కావాల్సిన వాటిని చూడలేకపోతున్నాం. దీనిని అధిగమించేందుకు మేం చేసిన పరిశోధనలు చాలా వరకు పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఉదాహరణకు కారు నడుపుతుంటే పొగమంచు వల్ల కాంతి పడకపోవడంతో ఎక్కువ దూరం రోడ్డును చూడలేకపోతున్నాం. విజిబిలిటీకి సంబంధించి ఇలాంటి సమస్యలు ఇక ముందు ఉండకపోవచ్చు’అని తెలిపారు. అశోక్ వీరరాఘవన్ తన బాల్యాన్ని తమిళనాడులోని చెన్నైలో గడిపారు. ఇదీ చదవండి.. సౌర రేడియేషన్‌తో పెను ముప్పు -
ప్రియుడి కళ్లెదుటే ప్రియురాలిపై అత్యాచారం
టీనగర్ : ధర్మపురి సమీపంలో ప్రియుడితో కలిసి వెళుతున్న ప్రియురాలిపై నలుగురు దుండగులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే తిరునల్వేలిలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ప్రియుడి కళ్లెదుటే కామాంధులు ప్రియురాలిపై తమ ఘాతుకాన్ని ప్రదర్శించారు. కన్యాకుమారి జిల్లా తిట్టువిలై ప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఇంజినీర్ అరివాల్ తిరునల్వేలి జిల్లాలో కంప్యూటర్ సేల్స్, సర్వీస్ చేస్తుంటారు. ఈయన నాగర్‌కోయిల్ ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆ యువకుడు తన ప్రియురాలితో కలిసి బైక్‌పై వివిధ ప్రాంతాలను సందర్శించి సాయంత్రం తమ ఊరికి బయలుదేరారు. ఈ జంట ఒంటరిగా వెళ్లడం గమనించిన ముగ్గురు వ్యక్తులు వారిని వెంబడించి నాంగునేరి కళక్కాడు రోడ్డులో జీయ్యర్ కుళం సమీపాన వారిని అటకాయించారు. తర్వాత ప్రేమికుడిని ఒక చెట్టుకు కట్టివేసి ప్రియురాలిని వారు ముగ్గురూ కలిసి లాక్కెళ్లారు. అక్కడున్న పొదల్లోకి ఆమెను తీసుకు వెళ్లి ఒకరి తర్వాత మరొకరు ఆమెపై లైంగిక దాడి జరిపారు. ఆ సమయంలో ప్రేమికుడు అరివాల్ను బెదిరించి అతని వద్ద ఉన్న ల్యాప్‌టాప్, రెండు సెల్ఫోన్లను అపహరించి పరారయ్యారు. దీనిపై అరివాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువతిని పోలీసులు నాగర్‌కోయిల్‌లో ఆమె బంధువుల ఇంటిలో చేర్చారు.