ముజఫర్‌పూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చిన్నారులు
ముజఫర్‌పూర్/ పట్నా / న్యూఢిల్లీ: బిహార్‌ను మెదడువాపు వ్యాధి వణికిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారులను ఈ మహమ్మారి బలి తీసుకుంటోంది. సోమవారం ఈ వ్యాధితో ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు ఈ వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 103కు చేరినట్లు శ్రీ కృష్ణ వైద్య కళాశాల, ఆస్పత్రి (ఎస్‌కేఎంసీహెచ్) సూపరింటెండెంట్ సునీల్ కుమార్ షాహి సోమవారం తెలిపారు. ఇలావుండగా ఎస్‌కేఎంసీహెచ్ ఆస్పత్రిలో రాత్రివేళ వైద్యులు అందుబాటులో ఉండటం లేదని రోగుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.
ఎస్‌కేఎంసీహెచ్‌లో సౌకర్యాలే లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బిహార్‌లో సైతం సోమవారం డాక్టర్లు సమ్మె చేయడంతో వైద్య సేవలు స్తంభించాయి. మరణాలపై సీఎం నితీశ్‌కుమార్ స్పందించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బిహార్‌లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment