childrens death
-
Delhi: 20 రోజుల్లో 13 మంది చిన్నారుల అనుమానాస్పద మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ షెల్టర్ హోహ్లో చిన్నారుల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్‌లో నెల రోజుల వ్యవధిలోనే 13 మంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక వికలాంగుల షెల్టర్‌హోమ్‌లో 13 మంది చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు సబ్ డివిజనల్ కార్యాలయం జరిపిన విచారణలో తేలింది. రోహిణిలో ప్రాంతంలోని ఆశాకిరణ్ షెల్టర్ హోమ్‌లో జనవరి నుంచి ఇప్పటి వరకు 27 మరణాలు నమోదయైనట్లు వెల్లడైంది. అయితే షెల్టర్ హోమ్‌లో చిన్నారుల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.దివ్యాంగ చిన్నారులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారని, నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా చనిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గత ఏడాది కంటే మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, పోస్ట్‌మార్టం నివేదికల తర్వాత మరణాలకు అసలు కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. పిల్లలకు అందిస్తున్న తాగునీటి శుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆప్ ప్రభుత్వంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. షెల్టర్‌హోమ్‌కు నిజానిజాలు తేల్చేందుకు ఓ బృందాన్ని పంపింది.‘అనేక సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ షెల్టర్ హోమ్ ఆశను కోల్పోయింది. ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. వాటిని భరించలేక ప్రాణాలు విడుస్తున్నారు. అయినా ఆప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.దీనిపై విచారణకు మేము బృందాన్ని పంపాము. వివరాలు తెలుసుకుంటాం’ అని కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. అదే విధంగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నైట్ షెల్టర్లపై కూడా ఎన్సీడబ్ల్యూ ఆడిట్ చేస్తోందని చెప్పారు.అయితే మృతుల సంఖ్యపై ఢిల్లీ మంత్రి అతిషి అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపి 48 గంటల్లో నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిని కోరారు. 2024 జనవరి నుంచి షెల్టర్ హోమ్‌లో 14 మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. ఈ మరణాలకు కారణమైన వారిపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.మరోవైపు షెల్టర్ హోమ్‌లో మరణాల నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. అక్కడి పిల్లలకు స్వచ్ఛమైన నీళ్లు, ఆహారం, వైద్యం అందించడం లేదని ఆరోపిస్తోంది. ఈ మరణాలకు కారణమైన అధికారులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మరణాలను సమీక్షించేందుకు ఢిల్లీ బీజేపీకి చెందిన బృందం కూడా ఆశాకిరణ్ షెల్టర్ హోమ్‌కు చేరుకుంది. -
భారత్‌కు అది ఘోరమైన అవమానం: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
భారతదేశంలో తయారైన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆరుగురు ప్రముఖులకు మంగళవారం ఇన్ఫోసిస్ అవార్డులు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్. ఆర్ నారాయణమూర్తి గాంబియా ఘటనపై స్పందించారు. భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్ కారణంగా 66 మంది చిన్నారులు మృతి చెందడం దేశానికి ఘోరమైన అవమానాన్ని తెచ్చిపెట్టిందని, దేశ ఔషధ నియంత్రణ సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు. ఇది ఘోరమైన అవమానం ఇటీవల కరోనా టీకాలను అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసిన ప్రశంసలు పొందిన భారత్‌కు ఈ ఘటన అపవాదు తీసుకొచ్చిందని అవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లలో దేశం శాస్త్ర, సాంకేతిక పురోగతిలో ఆరోగ్యంగా దూసుకుపోతున్నప్పటికీ, ఇంకా కొన్ని సవాళ్లు అలానే మిగిలి ఉన్నాయన్నారు. ప్రస్తుత విద్యా విధానం గురించి మాట్లాడుతూ.. ‘సామాజిక అంశాలను పాఠ్యాంశాలుగా నేడు ఐఐటీలు అనుసరించడం లేదు. 2022లో ప్రకటించిన ప్రపంచ గ్లోబల్ ర్యాంకింగ్‌లో టాప్ 250లో ఇప్పటికీ ఒక్క భారతీయ ఉన్నత విద్యా సంస్థ కూడా లేదు. మనము తయారు చేసిన వ్యాక్సిన్లు కూడా ఇతర అభివృద్ధి చెందిన దేశాల సాంకేతికతలపై ఆధారపడి ఉంటున్నాయి లేదా అభివృద్ధి చెందిన దేశాల పరిశోధనల ఆధారంగా ఉంటోందని’ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 70 ఏళ్లుగా భారతీయ సమాజం ఎదుర్కొనే చికెన్ గున్యా, డెంగీ వంటి వ్యాధులకు ఇంకా టీకాలు కనుగొనలేకపోవడం మన పరిశోధన రంగం వైఫల్యమేనని తెలిపారు. ఆరుగురికి అవార్డులు.. కాగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారాలను ఆరుగురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. వీరిలో సుమన్ చక్రవర్తి (ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్), సుధీర్ కృష్ణస్వామి (హ్యుమానిటీస్), విధిత వైద్య (లైఫ్ సైన్సెస్), మహేశ్ కాక్డే (గణితం), నిస్సీమ్ కనేకర్ (భౌతిక శాస్త్రం), రోహిణి పాండే (సోషల్ సైన్స్)లకు పురస్కారాలు ప్రకటించారు. వీరికి జనవరిలో పురస్కారాలతో పాటు స్వర్ణ పతకం, లక్ష అమెరికన్ డాలర్లు అందిస్తారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి -
జింబాబ్వేలో 'మీజిల్స్' విలయం.. 700 మంది చిన్నారులు మృత్యువాత
హరారే: జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. సెప్టెంబర్ 4 నాటికి దేశంలో మొత్తం 6,291 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అయితే రెండు వారాల క్రితం మీజిల్స్ వల్ల 157మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. మీజిల్స్ వ్యాధి బాధితుల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోని, పోషకాహార లోపం ఉన్న చిన్నారులే ఉంటున్నారు. మతపరమైన నమ్మకాలతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించకపోవడమూ ఈ పరిస్థితికి కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాక్సిన్ తప్పనిసరిచేసేలా కొత్త చట్టం తీసుకురావాలని జింబాబ్వే భావిస్తోంది. 6 నెలల నుంచి 15ఏళ్ల పిల్లలకు పెద్దఎత్తున మాస్ వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మతపెద్దలు దీనికి సహకరించాలని కోరుతోంది. డేంజర్.. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో మీజిల్స్ కూడా ఒకటి. గాలి ద్వారా, తమ్ముడం, దగ్గడం వల్ల ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లలలో దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కన్పిస్తాయి. వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు ఈ వ్యాధి సోకితే తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించాలంటే 90శాతం మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందుల వల్ల సేవలు నిలిచిపోయి పేద దేశాల్లో మీజిల్స్ విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్‌లోనే హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5కోట్ల మంది పిల్లలు సాధారణ వ్యాక్సిన్లు తీసుకోలేకపోయారని యూనిసెఫ్ జులైలో చెప్పింది. దీనివల్ల పిల్లలకు ప్రమాదమని అప్పుడే హెచ్చరించింది. చదవండి: చైనాలో తీవ్ర భూకంపం.. 46 మంది దుర్మరణం -
ఆడుకుంటూ అగ్నికి ఆహుతియ్యారు!
మహబూబ్‌నగర్: ఆట సరదా విషాదం మిగిల్చింది. కేజీవీల్ నుంచి బయటికి రప్పించేందుకు గడ్డికి నిప్పు పెట్టడంతో అందులో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఇప్పటూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విఘ్నేష్ (9), ప్రశాంత్ (13), శివ ముగ్గురు స్నేహితులు. గురువారం మధ్యాహ్నం గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టి వాటిని కాల్చుకొని తినాలనుకున్నారు. వెంట ఓ అగ్గి పెట్టెను సైతం తీసుకెళ్లారు. ఎంతకూ చేపలు పడకపోవడంతో సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో ఆడుకునేందుకు వరి కల్లం వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న కేజీవీల్ ఎక్కి దిగుతూ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్, విఘ్నేష్ కేజీవీల్‌లోకి దిగి బయటికి రాలేదు. దీంతో శివ వారిని బయటికి రప్పించేందుకు అక్కడ ఉన్న గడ్డికి నిప్పుపెట్టాడు. గడ్డి వేగంగా అంటుకుని కేజీ వీల్ చుట్టూ పొగ, మంటలు వ్యాపించాయి. దీంతో కేజీవీల్లో ఉన్న ప్రశాంత్, విఘ్నేష్ అందులో నుంచి బయటికి రాలేక మంటల్లో చిక్కుకున్నారు. దీంతో భయపడిన శివ పక్కనే వరి పొలంలో దోసిళ్లతో నీళ్లు తెచ్చి పోసినా మంటలు అదుపులోకి రాకపోవడంతో గట్టిగా కేకలు వేస్తూ గ్రామంలోకి వెళ్లి చెప్పాడు. వారు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, శుక్రవారం ప్రశాంత్ జన్మదినం ఉండటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పీల్చే గాలి విషం
న్యూఢిల్లీ: గత ఏడాది భారత్‌లో వాయుకాలుష్యానికి 16 లక్షల 67 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (ఎన్ఓజీఏ) నివేదిక 2020 వెల్లడించింది. వారిలో నెలలోపు వయసున్న పసిమొగ్గలే లక్షా 16 వేల మంది ఉన్నారు. అమెరికాకి చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అండ్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ఈ నివేదిక రూపొందించింది. ప్రధానంగా పసిపిల్లలపై ఈ కాలుష్యం ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో అధ్యయనం చేసింది. చిన్న పిల్లల మీద ఈ స్థాయిలో వాయుకాలుష్యం ప్రభావం చూపించడం అత్యంత దారుణమైన అంశమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ కల్పన బాలకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ అరికట్టగలిగే మరణాలేనన్న కల్పన ప్రభుత్వాలు వీటిపై దృష్టి సారించాలన్నారు. పీఎం 2.5లోనూ భారత్‌దే మొదటి స్థానం గాలిలో కాలుష్యకారకమైన సూక్షా్మతి సూక్ష్మమైన ధూళి కణాలు పీఎం 2.5 అంశంలో కూడా భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. గాలిలో పీఎం 2.5 75 నుంచి 85 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు లెక్క. గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం భారత్‌లో 83 వరకు ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గాలిలో పీఎం 2.5 ► భారత్ 83.2 ► నేపాల్ 83.1 ► రిపబ్లిక్ ఆఫ్ నైజర్ 80.1 ► ఖతార్ 76.0 ► నైజీరియా 70.4 వాయు కాలుష్యంతో వస్తున్న వ్యాధులు వాయు కాలుష్యంతో భారత్‌లో 87 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో అత్యధికంగా శ్వాసకోశకి సంబంధించిన వ్యాధులే ఉన్నాయి. ► ఊపిరితిత్తుల వ్యాధులు ► న్యుమోనియా ► హార్ట్ ఎటాక్ ► కేన్సర్ ► మధుమేహం ► నవజాత శిశువులకు సోకే వ్యాధులు ► గాలి కలుషితమై పసిపిల్లల ఉసురు తీయడం భారత్‌లోనే అత్యధికం. 2019లో 1,16,000 మంది చిన్నారులు భూమ్మీదకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ► భారత్ తర్వాత స్థానంలో నైజీరియా (67,900 మంది పిల్లల మృతి), పాకిస్తాన్ (56,500), ఇథియోపియా (22,900), డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (1,200) ఉన్నాయి. ► గర్భిణీ స్త్రీలు కలుషితమైన గాలిని పీల్చడంతో గర్భంలో ఉన్న పిండంపై తీవ్ర ప్రబావాన్ని చూపిస్తోంది. దీనివల్ల ప్రీమెచ్యూర్ డెలివరీ, తక్కువ బరువు, ఊపిరితిత్తులు బలంగా లేకపోవడం, రక్తంలో గడ్డలు ఏర్పడడం వంటి సమస్యలు పిల్లల్లో కనిపిస్తున్నాయి. -
కోట ఆసుపత్రి మృత్యుగీతం
రాజస్తాన్‌లోని కోట నగరంలోవున్న జేకే లోన్ ప్రభుత్వాసుపత్రిలో నెల రోజుల వ్యవధిలో వంద మంది శిశువులు మరణించారన్న వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ వరస మరణాలపై మీడియాలో కథనాలు వెలువడ్డాక నాయకులు మేల్కొన్న దాఖలా కనబడింది. కోట స్థానం నుంచి గెలుపొందిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మరణాలపై చేసిన ట్వీట్ చూశాక ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ స్పందించి ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్ ఎల్ మీనాను తొలగించి, దాని పర్యవేక్షణ బాధ్యతల్ని వైద్య విద్యా శాఖ కార్యదర్శికి అప్పగించారు. కానీ అంతకు మినహా ప్రత్యేకించి తీసుకున్న దిద్దుబాటు చర్యలేవీ లేవని ఆ తర్వాత కూడా కొనసాగిన శిశు మరణాలు వెల్లడించాయి. డిసెంబర్లో మొదటి 24 రోజుల్లో 77మంది పిల్లలు చనిపోగా 23–24 మధ్య మరో పదిమంది మరణించారు. ఈ అయిదారు రోజుల్లో మరో 13మంది చనిపోయారు. న్యూమోనియా మొదలుకొని విషజ్వరాల వరకూ అనేక కారణాలతో ఇవి సంభవించాయి. కోటలోని ప్రభుత్వాసుపత్రి అతి పెద్దది. 2014 మొదలుకొని అక్కడ సగటున ఏటా వేయిమంది పిల్లలు మృతి చెందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు ఆ సైతం ఆ సంఖ్య 900 దాటింది. రెండేళ్లక్రితం 63మంది శిశువుల ప్రాణాలు హరించిన గోరఖ్‌పూర్ ఆసుపత్రిగానీ, ఇప్పుడు కోట ఆసుపత్రిగానీ మన దేశంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ప్రత్యక్ష ఆనవాళ్లు. నిరుపేద రోగులు జబ్బుపడితే దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే తప్ప తగుమాత్రం వైద్య సౌకర్యాలు లభ్యమయ్యే ప్రభుత్వాసుపత్రికి చేరుకోవడం అసాధ్యమవుతోంది. గ్రామీణ ప్రాంతాలకు వైద్య సౌకర్యాలు ఇప్పటికీ సక్రమంగా అందటం లేదు. ప్రాథమిక వైద్య కేంద్రాలు పెద్ద సంఖ్యలోనేవున్నా అక్కడ అవసరమైన మందులు లభ్యం కావడం లేదు. వైద్యులు అందుబాటులో వుండటం లేదు. కనుకనే రోగంబారిన పడినవారు ఇరుగు పొరుగు ఇచ్చే సలహాతో ఏదో ఒకటివాడి, అది ముదిరాక పెద్దాసుపత్రులకు వెళ్తున్నారు. కానీ అక్కడ సైతం అరకొర సౌకర్యాలే లభ్యమవుతున్నాయి. ఇప్పుడు కోట ప్రభుత్వాసుపత్రిలోనూ అదే సమస్య. ఒకపక్క ఆ రాష్ట్రంలో ఎముకలు కొరికే చలివుండగా ఆ ఆసుపత్రికి తలుపులు, కిటికీలు కూడా సక్రమంగా లేవని దాన్ని సందర్శించిన జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ తెలిపింది. ఆ ఆసుపత్రి ఆవరణలో పందులు తిరుగాడుతున్నాయని వివరించింది. ఒక శిశువును ఉంచాల్సిన మంచంపై ఇద్దరు ముగ్గుర్ని వుంచి వైద్యం చేస్తున్నారని ఆరోపించింది. కోట ఆసుపత్రిలో ఇంకా వైపరీత్యాలున్నాయి. శిశువుకు తగినంత వెచ్చదనాన్ని అందించడానికి వినియోగించే రేడియెంట్ వార్మర్లు 70 శాతం పనికిమాలినవేనని కమిషన్ తెలిపింది. అలాగే నలుగురు శిశువుల సంరక్షణకు ఒక నర్సు వుండాలని నిబంధనలు చెబుతుంటే కోట ఆసుపత్రిలో 13మందికి ఒక నర్సు పని చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్సకు వినియోగించే ఉపకరణాలు మొత్తం 533 వుండగా సరైన నిర్వహణ కొరవడిన కారణంగా అందులో 320 పనిచేయడం లేదని కమిషన్ ఎత్తిచూపింది. ఆపదలోవున్న నవజాత శిశువులకు కావలసిన ఆక్సిజెన్‌ను సిలెండర్ల ద్వారా కాక పైప్లైన్ల ద్వారా అందించాల్సివుండగా ఆ సదుపాయమే లేదని పేర్కొంది. ఇన్ని లోపాలున్నప్పుడు కోట ప్రభుత్వాసుపత్రిలో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకోవడంలో వింతేమీ లేదు. అటువంటివి జరగకపోతే ఆశ్చర్యపోవాలి. ప్రసూతి మరణాలు, శిశు మరణాలు అరికట్టడంలో మన దేశం కొంత మేర ప్రగతి సాధించింది. 2006లో ప్రతి వేయిమంది శిశు జననాల్లో 57 మరణాలుంటే 2013నాటికి ఆ మరణాల సంఖ్య 33కి తగ్గింది. అలాగే ప్రసూతి మరణాలు కూడా 26.9 శాతం తగ్గాయి. అయితే ఇప్పటికీ ఇంక్యుబేటర్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు సక్రమంగా లేక ప్రభుత్వాసుపత్రుల్లో నెలలు నిండని శిశువుల మరణాలు, బలహీన శిశువుల మరణాలు ఇంకా అధికంగానే వుంటున్నాయి. రాజస్తాన్‌లోని పెద్ద నగరంలోని పెద్దాసుపత్రిలో పిల్లలకు చికిత్స చేయడానికి అవసరమైన సదుపాయాలు లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ఆసుపత్రికి ఎక్కువమంది శిశువులు ఎలాంటి అనారోగ్య సమస్యలతో వస్తారో, వారికి ఎటువంటి వైద్య సదుపాయాలు అవసరమవుతాయో ఆసుపత్రి నిర్వహణకు బాధ్యతవహించే అధికారులకు తెలియదనుకోలేం. ఆ రాష్ట్రంలోని ఆరోగ్యమంత్రిత్వ శాఖకు అవగాహన లేదనుకోలేం. ఏటా అదే ఆసుపత్రిలో వేయిమంది పిల్లలు మరణిస్తుంటే కారణమేమిటని ఆరా తీసేంత తీరిక కూడా వీరెవరికీ లేకపోయింది. పైగా చికిత్సపరంగా ఎలాంటి లోపాలూ లేవని ముఖ్యమంత్రి గెహ్లోత్ చెప్పుకుంటున్నారు. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 2019లో మరణాలు తగ్గాయంటున్నారు. కానీ తాను అధికారంలోకొచ్చి ఏడాదైనా కోట ఆసుపత్రిలో ఉపకరణాలు అంత అధ్వాన్న స్థితిలో ఎందుకున్నాయో, తగినంతమంది సిబ్బంది ఎందుకు లేరో...ఇలాంటì ఆసుపత్రులు మరెన్ని వున్నాయో గెహ్లోత్ ఆత్మ విమర్శ చేసుకునివుంటే బాగుండేది. ఇప్పుడు కోట ఆసుపత్రిలో సంభవించిన వరస మరణాలు చూశాకైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. ఆసుపత్రుల్లో వున్న లోటుపాట్లేమిటో సమీక్షించుకుని సరిదిద్దుకోవాలి. 2030కల్లా ప్రపంచ దేశాలన్నీ సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పదిహేడింటిలో పేదరిక నిర్మూలన, ఆహారభద్రత, నాణ్యత గల విద్య వగైరాలతోపాటు ఆరోగ్యం కూడా వుంది. ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలను మెరుగుపరచవలసివుంది. అయిదేళ్ల లోపు శిశు మరణాల నియంత్రణలో, ప్రసూతి మరణాల నియంత్రణలో మన దేశం మెరుగైన స్థితిలో వున్నదని అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ తెలిపింది. ఆరోగ్యరంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచి ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పిస్తే తప్ప వ్యాధుల్ని అరికట్టడంలో, పసిపిల్లల మరణాలు నియంత్రించడంలో పూర్తి విజయం సాధించలేం. -
బాలభారతాన్ని కబళిస్తున్న కేన్సర్
భావిభారత విధాతలైన నేటి బాలలను కేన్సర్ మహమ్మారి కబళిస్తోంది. కేన్సర్ వ్యాధి సోకిన చిన్నారులను కాపాడుకోలేని పరిస్థితి ఆందోళన కరంగా తయారయ్యింది. కేన్సర్ వ్యాధిగ్రస్తులైన ప్రతి ఐదుగురు చిన్నారుల్లో నలుగురు మరణిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సరైన సమయంలో కేన్సర్‌ని గుర్తించకపోవడం, చికిత్సకోసం సుదూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడం, వైద్యం ఖరీదవడం వల్ల కేన్సర్ వ్యాధిగ్రస్తులైన చిన్నపిల్లలు చికిత్సకు దూరమౌతున్నారు. ఉదాహరణకు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ముంబై టాటా మెమోరియల్ కేన్సర్ ఆసుపత్రిలో కేన్సర్ చికిత్సకోసం చేరుతోన్న చిన్నారుల్లో 43.6 శాతం మంది 1,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని తాజా రికార్డులు వెల్లడిస్తున్నాయి. పది శాతం మంది 2,200 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆసుపత్రిలో చేరుతున్నారు. మరో 20 శాతం మంది మాత్రం ఈ ఆసుపత్రిలో చేరడానికి ముందే అసంపూర్తిగా చికిత్స చేయించుకొని వస్తున్నారు. ఆ దేశాల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం, మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లోని కేన్సర్ బాధిత చిన్నారుల్లో ఎక్కువ మంది చనిపోతున్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. దేశంలో కేన్సర్ సోకిన అత్యధిక మంది బాలలు ఐదేళ్ళకు మించి బతక్కపోవడానికి, కేన్సర్‌ని సరైన సమయంలో గుర్తించకపోవడం, వైద్యం ఖర్చు భరించలేనంతగా ఉండడం, సగంలోనే (అసంపూర్ణం) చికిత్సను ఆపివేయడం కారణాలని ఇండియా స్పెండ్ సంస్థ వెల్లడించింది. సరైన సమయంలో గుర్తిస్తే.. ప్రతియేటా దేశంలో దాదాపు 50,000 మంది 19 ఏళ్ళలోపు వయస్సువారు కేన్సర్‡ బారిన పడుతున్నట్టు ద లాన్సెంట్ అధ్యయనం గుర్తించింది. అయితే ఈ సంఖ్య వాస్తవంలో 75,000కు పైచిలుకే అంటున్నారు టీఎంహెచ్ ఆంకాలజిస్ట్ గిరీష్ చిన్నస్వామి. దాదాపు 20,000 మంది చిన్నారుల్లో కేన్సర్‌ని గుర్తించడం గానీ, దానికి చికిత్స చేయించడం గానీ జరగడంలేదు. కేన్సర్సోకిన 55,000 మందిలో కేవలం 15000 మందికే నైపుణ్యం, అనుభవం కలిగిన వైద్యుల ద్వారా నాణ్యమైన, మంచి చికిత్స లభిస్తోంది. అలాగే వారికి మంచి ఆహారం, వైద్యానికి ఆర్థిక సహకారం లభిస్తోంది. వీరిలో 70 శాతం మంది కేన్సర్‌ని జయిస్తున్నారు. మూడోవంతు మంది మధ్యలోనే.. ► కేన్సర్‌బారిన పడిన చిన్నారుల్లో 3వవంతు మంది అసంపూర్ణ చికిత్సకారణం గా బతికే అవకాశాన్ని కోల్పోతున్నారు. ► దిగువ, మధ్య తరగతి ఆదాయం కలిగిన దేశాల్లో 90 శాతం మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తున్నారు. ► మరింత పేదరికంలో మగ్గుతోన్న దేశాల్లో 99 శాతం మంది చికిత్స చేయించుకోకపోవడమో, లేక చికిత్సను మధ్యలోనే వదిలేయడమో జరుగుతోంది. ఓ అధ్యయనం ప్రకారం ► ప్రత్యామ్నాయ, సాంప్రదాయ చికిత్సావిధానాన్ని అనుసరిస్తున్నవారు 31 శాతం ► ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చికిత్సను మానుకుంటున్న వారు 28 శాతం ► కేన్సర్‌కి చికిత్సలేదనీ, అది నయం కాని వ్యాధి అని భావిస్తున్నవారు 26 శాతం ఇండియా స్పెండ్ ప్రకారం ప్రతి పదిలక్షల మంది జనాభాకి ఆంకాలజిస్ట్‌లు ► ఫిలిప్పైన్స్‌లో 25.63 మంది ► చైనాలో 15.39 ∙ఇరాన్లో 1.14 ► భారత్‌లో 0.98 -
హాస్టల్లో ఉన్నారనుకుంటే.. మూసీలో తేలారు!
పొదిలిరూరల్: పాపం ఆ నిరుపేద తల్లిదండ్రుల కష్టం ఎవరికీ రాకూడదు.. తమ పిల్లలు హాస్టల్లోనే ఉన్నారనుకున్నారు.. రోజూ స్కూల్‌కు వెళుతూ చక్కగా చదువుకుంటున్నారనుకున్నారు.. కానీ వారికి తెలియదు.. వారం కిందటే వారు మృత్యుఒడికి చేరారని.. తీరా విషయం తెలిశాక ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు బాదుకుంటూ రోదించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పొదిలి మండలం ఏలూరు పంచాయతీలోని నల్లారెడ్డిపాలేనికి చెందిన చిన్నపురెడ్డి బ్రహ్మారెడ్డి (13), పొరుగూరు టి.సళ్లూరుకు చెందిన ఇండ్లా సూర్య (12) స్నేహితులు. వీరిద్దరు చీమకుర్తిలోని గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. ఈ నెల 19న తాము ఆధార్‌కార్డు తీసుకోవాలని పాఠశాల ఇన్చార్జికి లెటర్ రాసిచ్చి ఇంటికొచ్చారు. ఆ సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో మూసీ నదికి ఈతకెళ్లారు. పిల్లలు ఇంటికొచ్చిన విషయం రెండు కుటుంబాలకూ తెలియదు. సూర్య తండ్రి ఒంగోలులో ట్రాక్టరు నడుపుతూ ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు. ఆయన తన కుమారుడు సూర్యను దీపావళి పండుగకు ఇంటికి తీసుకెళదామని శుక్రవారం సాయంత్రం పాఠశాలకెళ్లాడు. 19వ తేదీనే సూర్యతో పాటు బ్రహ్మరెడ్డి కూడా పాఠశాల నుంచి వెళ్లారని అక్కడి సిబ్బంది చెప్పారు. ఎంత వెతికినా పిల్లల ఆచూకీ దొరక్కపోవడంతో చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూసీనది ఒడ్డున ఇద్దరు పిల్లల దుస్తులున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ పరిసరాలకు వెళ్లి గ్రామస్తులు వెతకగా దుస్తులున్న ప్రదేశం నుంచి 300 మీటర్లు దూరంలో ఒక మృతదేహం, అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో మరో మృతదేహం కనిపించింది. మృతదేహం చేతికి ఉన్న దారం ఆధారంగా ఒకరిని సూర్యగా తల్లిదండ్రులు గుర్తించారు. పొదిలి సీఐ శ్రీరాం ఆధ్వర్యంలో ఎస్ఐ కె.సురేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుడు జల్సాలు.. ఇప్పుడు కన్నీళ్లు
న్యూఢిల్లీ: బీహార్‌లో పెద్ద సంఖ్యలో చిన్నపిల్లలు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఆ రాష్ట్ర ఎంపీ, ఎల్పీజీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఆవేదన చెందారు. మంగళవారం పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. మనం చేసే ప్రతీ తప్పుకు ప్రకృతి బదులిచ్చి తీరుతుందని ప్రభుత్వ వైఫల్యాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. చనిపోయిన వారిపట్ల తన సానుభూతిని వ్యక్తపరుస్తూ ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు చిరాగ్ పాశ్వాన్ గోవాలో తన బాలీవుడ్ స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నారు. ఆ ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పుడు విందులో మునిగితేలి, ఇప్పుడు మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిరాగ్ తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ ప్రస్తుత మోదీ క్యాబినెట్లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలకు మంత్రిగా ఉన్నారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ 2011లో ఓ బాలీవుడ్ సినిమాలో నటించగా, అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత ఆయన సినిమాలను వదిలేసి రాజకీయాల్లో చేరారు. -
చిన్నారుల మృత్యువాతపై సుప్రీం దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధి కారణంగా 150కి పైగా చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతూ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని బిహార్ ప్రభుత్వంతోపాటు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బిహార్‌లో మెదడువాపు వ్యాధి కారణంగా పెద్ద సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం వంటి వాటిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. తక్షణమే ఈ సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు బిహార్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ ఇద్దరు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వాదనల సందర్భంగా.. గతంలోనూ ఇలాంటి మరణాలే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయని పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది మనోహర్ తెలపగా.. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మరణాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఇలాంటి మరణాలు ప్రతి ఏటా సంభవిస్తున్నా.. పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. బిహార్‌లో మరణించిన చిన్నారులకు రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని కోరారు. చిన్నారులు మరణించిన ముజఫర్‌పూర్ సహా ఇతర ప్రాంతాలకు వైద్య నిపుణులతో కూడిన ప్యానల్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాలకు 100 మొబైల్ ఐసీయూ యూనిట్లను పంపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వారంలోగా సమాధానమివ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను 10 రోజులపాటు వాయిదా వేసింది. -
చిన్నారుల ప్రాణాలు పోతుంటే.. స్కోర్ కావాలా?
పట్నా: బిహార్‌లో మెదడువాపు వ్యాధి ముక్కుపచ్చలారని చిన్నారులను బలి తీసుకుంటోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి 103 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్, బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండేతో కలిసి ఆదివారం మీడియాతో ముచ్చటించారు. మెదడువాపు వ్యాది ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అయితే ఈ సందర్భంగా మంగల్ పాండే మీడియా మిత్రులను భారత్-పాక్ మ్యాచ్ స్కోర్ ఎంత? ఇప్పటి వరకు ఎన్ని వికెట్లు పడ్డాయని అడగడం వివాదస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ఏఎన్ఐ ట్వీట్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకవైపు చిన్నారులు పిట్టల్లా రాలుతుంటే నీకు స్కోర్ కావాల్సి వచ్చిందా? అని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక సోమవారం ఈ వ్యాధితో ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకృష్ణ వైద్య కళాశాల, ఆస్పత్రి (ఎస్‌కేఎంసీహెచ్)లో సౌకర్యాలే లేవని రోగుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బిహార్‌లో సైతం సోమవారం డాక్టర్లు సమ్మె చేయడంతో వైద్య సేవలు స్తంభించాయి. మరణాలపై సీఎం నితీశ్‌కుమార్ స్పందించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బిహార్‌లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. #WATCH Bihar Health Minister Mangal Pandey asks for latest cricket score during State Health Department meeting over Muzaffarpur Acute Encephalitis Syndrome (AES) deaths. (16.6.19) pic.twitter.com/EVenx5CB6G — ANI (@ANI) June 17, 2019 -
బిహార్‌లో హాహాకారాలు
ముజఫర్‌పూర్/ పట్నా / న్యూఢిల్లీ: బిహార్‌ను మెదడువాపు వ్యాధి వణికిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారులను ఈ మహమ్మారి బలి తీసుకుంటోంది. సోమవారం ఈ వ్యాధితో ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు ఈ వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 103కు చేరినట్లు శ్రీ కృష్ణ వైద్య కళాశాల, ఆస్పత్రి (ఎస్‌కేఎంసీహెచ్) సూపరింటెండెంట్ సునీల్ కుమార్ షాహి సోమవారం తెలిపారు. ఇలావుండగా ఎస్‌కేఎంసీహెచ్ ఆస్పత్రిలో రాత్రివేళ వైద్యులు అందుబాటులో ఉండటం లేదని రోగుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్‌కేఎంసీహెచ్‌లో సౌకర్యాలే లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బిహార్‌లో సైతం సోమవారం డాక్టర్లు సమ్మె చేయడంతో వైద్య సేవలు స్తంభించాయి. మరణాలపై సీఎం నితీశ్‌కుమార్ స్పందించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బిహార్‌లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. -
97 మంది మృతి: కేంద్రమంత్రిపై కేసు నమోదు
పట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధితో చిన్నారులు మృతిచెందుతున్న విషయం తెలిసిందే. వ్యాధికి కారణమైన అక్యూట్ ఎన్సిఫలైటిస్ సిండ్రోమ్‌పై అవగహన కల్పించడంలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్థన్ విఫలమయ్యారని బిహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రితో సహా, రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి మంగల్ పాండే పేరును కూడా ఫిర్యాదులో పొందుపరిచారు. ఆమె ఫిర్యాదు మేరకు ముజఫర్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 323, 308, 504 ప్రకారం కేసు ఫైల్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పెద్ద సంఖ్యలో పిల్లలు మృతి చెందుతున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఆ నెల 24న పిటిషన్‌పై ముజాఫర్పూర్ కోర్టు విచారణ చేపట్టనుంది. ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారులు బలవుతున్నారు. ఇప్పటి వరకు 97 మంది చిన్నారులు మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో శ్రీకృష్ణ, కేజ్రీవాల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారే అధికం. అంతే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కాగా బిహార్‌లోని ఓ ఆసుపత్రిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమీక్షించిన విషయంతెలిసిందే. మరోవైపు సీఎం నితీష్ కుమార్ కూడా వైద్యులతో సమావేశమై.. ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కాగా, కేంద్రమంత్రి కళ్లెదురే ఓ చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది. ఓ వైపు పిల్లలు చనిపోయిన బాధ, మరోవైపు తమ పిల్లల్ని కాపాడంటి అంటూ ఆవేదనతో ఆసుపత్రుల వద్ద తల్లిదండ్రలు చేస్తున్న అర్థనాదాలు ఆకాశాన్నంటాయి. మెదడు వాపు వ్యాధి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని డాక్టర్లు తెలిపారు. అక్యూట్ ఎన్సిఫలైటిస్ సిండ్రోమ్‌కు అధిక ఉష్ణోగ్రతలు, గాల్లో తేమశాతం ఎక్కువగా ఉండడమే కారణమని వెల్లడించారు. వర్షాలు పడితే పరిస్థితిలో మార్పు వస్తుందని, మరణాలు కూడా తగ్గే అవకాశముందని చెప్పారు. -
లిచీ పండ్లకు.. పిల్లల ప్రాణాలు హరీ!
ముజఫర్ పూర్: బీహార్‌లోని ముజఫర్ నగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన బాలల మరణాలకు లిచీ పండ్లు కారణమా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు. మెదడువాపును పోలిన వ్యాధి కారణంగా ఈ ప్రాంతంలో గత 12 రోజుల్లో దాదాపు 50 మంది పదేళ్ల వయసులోపు పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ పిల్లలు అక్యూట్ ఎన్సెఫలైటీస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరినా.. చాలామంది రక్తంలో చక్కర మోతాదులు అకస్మాత్తుగా తగ్గిపోయాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారి అశోక్ కుమార్ సింగ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో తాము ఇప్పటికే తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశామని.. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పామని అశోక్ కుమార్ వివరించారు. ప్రస్తుతం శ్రీక్రిష్ణ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో 40 మంది పిల్లలు ఇదే రకమైన లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. లిచీ పంటకు పేరు.. బీహార్‌లోని ముజఫర్‌పూర్ ప్రాంతం లిచీ పండ్లకు పెట్టింది పేరు. గతంలోనూ ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించిన సంఘటనలు ఉన్నాయి. వేసవిలో పిల్లలు తోటల్లో ఆడుకుంటూ ఈ పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారని.. ఈ క్రమంలో రాత్రి భోజనం మానేస్తూంటారు. అయితే లిచీ పండ్లలో ఉండే హైపోగ్లైసిన్ సైక్రోప్రొపైల్ అసిటిక్ ఆసిడ్ రాత్రి పూట రక్తంలోని చక్కెర మోతాదులను గణనీయంగా తగ్గించి వేస్తుందని లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది. పదేళ్ల లోపు పిల్లలు ఉదయాన్నే ఇతర ఆహారం ఏదీ తీసుకోక ముందు లిచీ పండ్లు తినకూడదని బీహార్ ఆరోగ్యశాఖ సూచించింది. ఒకవేళ పిల్లలు ఉదయం అల్పాహారం తీసుకోకుండా లిచీ పండ్లు తిని ఉంటే రాత్రి వేళలో వీలైనంత తొందరగా ఆహారం తీసుకోవాలని సూచించింది. -
ఆ ఆస్పత్రిలో 1000 మంది చిన్నారుల మృతి!
గాంధీనగర్: ఆదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఓ ఆస్పత్రిలో గత ఐదేళ్ల కాలంలో వెయ్యి మందికిపైగా చిన్నారులు మరణించారు. కఛ్ జిల్లా బూజ్ పట్టణంలోని జీకే ఆస్పత్రిలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని గుజరాత్ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ బుధవారం శాసనసభలో వెల్లడించారు. క్వశ్చన్ అవర్ సయమంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు నితిన్ పటేల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. జీకే ఆస్పత్రిలో గడిచిన ఐదేళ్ల కాలంలో 1,018 మంది చిన్నారులు చనిపోయినట్టు తెలిపారు. 2014-15లో 188 మంది, 2015-16లో 187 మంది, 2016-17లో 208 మంది, 2017-18లో 276 మంది, 2018-19(ఇప్పటివరకు) 159 మంది చిన్నారులు చనిపోయినట్టు వెల్లడించారు. జీకే ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై దర్యాప్తు చేపట్టడానికి గత ఏడాది మే నెలలో కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కమిటీ తన నివేదికలో పిల్లల మరణాలకు వేర్వేరు కారణాలను పేర్కొందన్నారు. చనిపోయినవారిలో ఆ ఆస్పత్రిలో జన్మించిన శిశువులతోపాటు, అక్కడికి రిఫర్ చేయబడిన చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. -
కాలుష్యానికి 6 లక్షల చిన్నారుల బలి
జెనీవా: ఇంటాబయటా పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఆరోగ్యం–వాయు కాలుష్యం ప్రభావం’పై త్వరలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో రూపొందించిన ఈ నివేదికను డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టీఏ ఘెబ్రెయ్‌సస్ వెల్లడించారు. ఆ వివరాలు. నిత్యం 15 ఏళ్లలోపు పిల్లలలో 93 శాతం మంది 180 కోట్ల మంది, వీరిలో 63 కోట్ల మంది ఐదేళ్లలోపు బాలలు కలుషిత గాలిని పీలుస్తున్నారు. ఫలితంగా శ్వాసకోశ వ్యాధులకు గురై 2016లో దాదాపు 6 లక్షల మంది చిన్నారులు చనిపోయారు. ప్రతి పది మందిలో 9 మంది కలుషిత గాలినే పీలుస్తున్నారు. దీని కారణంగా ఏటా 70 లక్షల గర్భస్థ శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఐదేళ్లలోపు చనిపోయే ప్రతి పది మంది శిశువుల్లో ఒకరు వాయు కాలుష్యం కారణంగానే చనిపోతున్నారు. -
గోరఖ్‌పూర్ ఘటన : కఫీల్‌ఖాన్‌కు బెయిల్
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్‌పూర్ 63 మంది చిన్నారుల మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ కఫీల్‌ఖాన్‌కు అలాహాబాద్ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బీఆర్డీ మెడికల్ కాలేజిలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత కారణంగానే పిల్లలు మృతి చెందారన్న ఆరోపణలతో మెదడు వాపు వ్యాధి నివారణ (ఏఈఎస్) విభాగానికి అధిపతిగా ఉన్న కఫీల్‌ఖాన్ జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా విషమించడంతో ఏప్రిల్ 19న కఫీల్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు. కఫీల్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా తన భర్తకు బెయిల్ మంజూరైన సందర్భంగా కఫీల్‌ఖాన్ భార్య డాక్టర్ షబీస్తాన్ఖాన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తన భర్తకు జైల్లో ఉండగా గుండెపోటు వచ్చినా కూడా జైలు అధికారుల సరైన వైద్యం అందించలేకపోయారని, తన భర్త పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం తగిన సమయంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్లనే ఆసుపత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుందని, ప్రభుత్వ తప్పిదాన్ని తనపై మోపారని డాక్టర్ కఫీల్‌ఖాన్ కూడా ఆరోపించారు. గోరఖ్‌పూర్‌లో ఘటనను ప్రధాన ఆయుధంగా చేసుకున్న ప్రతిపక్షాలు సీఎం యోగిపై తీవ్ర విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. -
ఎవరి కోసం బతకాలి?
చీమకుర్తి రూరల్: ‘పోయినేడు పెద్ద కొడుకును పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు రెండో వాడిని రాక్షసంగా చంపేసింది. ఉన్న కొడుకులిద్దరూ పోతే మేము ఇంకెవరి కోసం బతకాలి’ అంటూ విషాహారానికి గురై మృతి చెందిన 4 ఏళ్ల బాలుడు ధనుంజయ్ తల్లిదండ్రులు పిన్నిక సుధాకర్, సంధ్య భోరున విలపిస్తున్నారు. ఓదారుస్తున్నా సుధాకర్, సంధ్య ఇప్పట్లో కోలుకునేలా కనిపించటం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిడతలపూడి గ్రామానికి చెందిన పిన్నిక ధనుంజయ్(4)ను అదే గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త వేల్పుల జ్యోతి కుర్కురే ప్యాకెట్లో ఎలుకల మందు పెట్టి చంపిన విషయం తెలిసిందే. బాలుడి తల్లిదండ్రులు రెండు రోజుల నుంచి విషాద ఛాయల నుంచి బయటపడ లేదు. ఏడాది క్రితం పెద్ద కొడుకు తరుణ్ కూడా ఇలాగే విషాహారానికి గురై ఒంగోలులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండో కొడుకు కూడా ఇలాగే విషాహారానికి గురై చనిపోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లి సంధ్యకు సిజేరియన్ ద్వారా పిల్లలు పుట్టారు. ఇక ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఉన్న పిల్లలు ఇద్దరూ అందనంత దూరాలకు పోయారు. ఇంక బతికేమీ సాధించాలంటూ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు గ్రామస్తులను ఆవేదనకు గురి చేస్తోంది. సుధాకర్‌కు అన్నీ కష్టాలే సుధాకర్ తండ్రి మూత్ర పిండాల వ్యాధితో కొన్ని నెలలుగా బాధపడుతున్నాడు. సుధాకర్‌కు తమ్ముడు ఉంటే గతంలో జరిగిన ఒక ప్రమాదంలో మృతి చెందాడు. ఇంట్లో ఒకదాని వెంట ఒకటి దురదృష్ట సంఘటనలు వెంటాడుతుంటే ఇక ఈ ఊరిలో ఏమి ఉంటామంటూ వాపోతున్నారు. పిడతలపూడి గ్రామం తప్ప పట్టణాల వైపు తొంగిచూడని సుధాకర్ గ్రామాన్ని నమ్ముకొని గొర్రెలు మేపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అల్లారుముద్దుగా ఉండే ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్నాడు. అంగన్వాడీ కేంద్రంలో ధనుంజయ్ మృతి చెందినందున ప్రభుత్వం నుంచి ఐసీడీఎస్ ద్వారా ఆర్థిక సాయం వస్తే దాని ఆసరాతో కుటుంబానికి కాస్త ఊరట లభిస్తుందని బంధువులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యం చెప్పిన పిల్లలకు అదురు జ్వరం బాలుడు ధనుంజయ్‌కు కుర్కురేను ఆశా కార్యకర్త జ్యోతి తినిపించిందని సాక్ష్యం చెప్పిన చిన్న పిల్లలు అదురు జ్వరంతో భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధనుంజయ్‌ను విషాహారానికి గురిచేసి చంపినట్లుగానే సాక్ష్యం చెప్పిన పిల్లలను జ్యోతి ఏమైనా చేస్తుందేమోనని భయపడటంతో పిల్లలు అదురుపోయి జ్వరంతో బాధపడుతున్నారు. సీఐ విచారణ ఒంగోలు రూరల్ సీఐ మాకినేని మురళీకృష్ణ సోమవారం పిడతలపూడి వచ్చి కేసు దర్యాప్తు కొనసాగించారు. గ్రామంలో మృతుడి ధనుంజయ్ తల్లిదండ్రులను పరామర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో జరిగిన సంఘటనను విచారించినట్లు సీఐ తెలిపారు. -
గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య కేంద్రం
మృతుల సంఖ్యపై తప్పుడు కథనాలు: యోగి గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ ఆసుపత్రిలో చిన్నారుల మృతి ఘటనపై కేంద్రం ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. బీఆర్డీ ఆసుపత్రి ఘటనతో గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆదివారం బీఆర్డీ ఆసుపత్రిని సంద ర్శించిన కేంద్ర వైద్య మంత్రి జేపీ నడ్డా.. రూ. 85 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్రం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సాయం చేస్తామని నడ్డా వెల్లడించారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో దోమల ద్వారా వ్యాప్తి చెందు తున్న వ్యాధులపై యుద్ధం చేయాలంటే ప్రత్యేకమైన పరిశోధన కేంద్రం అవసరమని యోగి తెలిపారు. మృతిచెందిన చిన్నారుల సంఖ్య విషయంలో మీడియా తప్పుడు వార్తలను ప్రసారం చేసి ఆందోళన సృష్టించిందని యోగి మండిపడ్డారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
ఇద్దరు చిన్నారులను బావిలో పారేసిన తండ్రి
ప్రకాశం: జిల్లాలోని పొదిలి మండలం కంబాలపాడులో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. పోషణ చూడాల్సిన కన్నతండ్రే తన ఇద్దరు చిన్నారులపాలిట కాలయముడైయ్యాడు. ఆ పిల్లలిద్దరినీ బావిలో పడేసిన ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. భార్యభర్తలు గొడవల కారణంగానే తన పిల్లలను చంపినట్టు తెలుస్తోంది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పశ్చిమ బెంగాల్లో మృత్యుఘోష
మూడు రోజుల్లో 20 మంది పసికందుల మృతి కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో చిన్నారుల మృత్యుఘోష వినిపిస్తోంది. మాల్దా ఆస్పత్రిలో గత 72 గంటల్లో 20 మంది పసిపాపలు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లోనే 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని బాధితులు తెలిపారు. ఈ ఆస్పత్రిలో చిన్నారులు చనిపోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో 16 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన నిపుణుల బృందం పౌష్టికాహార లోపం, తక్కువ బరువుతో పుట్టడం వల్లే పసిబిడ్డలు చనిపోయారని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు ఆస్పత్రులలో చిన్నారులు చనిపోతున్నారు. కోల్‌కతాలోని బీసీ రాయ్ ఆస్పత్రిలో గత నెలలో దాదాపు 65 మంది పసిపాపలు ప్రాణాలు కోల్పోయారు. మాల్దా ఆస్పత్రిలో జరిగిన తాజా ఘటనతో వైద్యుల వైఖరిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మాల్దా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారని బాధితులు మండిపడుతున్నారు. కొందరు డాక్టర్లు సరిగా విధులు నిర్వహించడం లేదని, ఆస్పత్రిలో వైద్య పరికరాలు కూడా సరిగా పనిచేయడం లేదని ఆరోపిస్తున్నారు. -
చెరువులో పడి ఐదుగురి చిన్నారుల మృతి
ప్రకాశం: ఐదుగురు చిన్నారులు చెరువులోపడి మృతి చెందిన ఘటన కురంచెడు మండలం గంగాదన కొండలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడిన చిన్నారులు మృత్యవాత పడ్డారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటంబీకులు, బంధువుల రోదన పలువుర్ని కంట తడిపెట్టిస్తోంది. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్‌లోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతైయ్యారు.