Infosys Narayana Murthy: Gambia kids death due to Indian cough syrup an 'unimaginable shame'
Sakshi News home page

భారత్‌కు అది ఘోరమైన అవమానం: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి

Nov 16 2022 11:18 AM | Updated on Nov 16 2022 11:50 AM

Death Of Gambia Kids Due To Indian Cough Syrup An Unimaginable Shame: Infosys Narayana Murthy - Sakshi

భారతదేశంలో తయారైన  మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు  చెందిన దగ్గు మందు తాగి  పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.  ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఆరుగురు ప్రముఖులకు మంగళవారం ఇన్ఫోసిస్‌ అవార్డులు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌. ఆర్‌ నారాయణమూర్తి గాంబియా ఘటనపై స్పందించారు. భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్ కారణంగా 66 మంది చిన్నారులు మృతి చెందడం దేశానికి ఘోరమైన అవమానాన్ని తెచ్చిపెట్టిందని, దేశ ఔషధ నియంత్రణ సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు.

ఇది ఘోరమైన అవమానం
ఇటీవల కరోనా టీకాలను అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసిన ప్రశంసలు పొందిన భారత్‌కు ఈ ఘటన అపవాదు తీసుకొచ్చిందని అవేదన వ్యక్తం చేశారు.  గత 20 ఏళ్లలో దేశం శాస్త్ర, సాంకేతిక పురోగతిలో ఆరోగ్యంగా దూసుకుపోతున్నప్పటికీ, ఇంకా కొన్ని సవాళ్లు అలానే మిగిలి ఉన్నాయన్నారు. ప్రస్తుత విద్యా విధానం గురించి మాట్లాడుతూ.. ‘సామాజిక అంశాలను పాఠ్యాంశాలుగా నేడు ఐఐటీలు అనుసరించడం లేదు. 2022లో ప్రకటించిన ప్రపంచ గ్లోబల్ ర్యాంకింగ్‌లో టాప్ 250లో ఇప్పటికీ ఒక్క భారతీయ ఉన్నత విద్యా సంస్థ కూడా లేదు.

మనము తయారు చేసిన వ్యాక్సిన్‌లు కూడా ఇతర అభివృద్ధి చెందిన దేశాల సాంకేతికతలపై ఆధారపడి ఉంటున్నాయి లేదా అభివృద్ధి చెందిన దేశాల పరిశోధనల ఆధారంగా ఉంటోందని’ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 70 ఏళ్లుగా  భారతీయ సమాజం ఎదుర్కొనే చికెన్ గున్యా, డెంగీ వంటి వ్యాధులకు ఇంకా టీకాలు కనుగొనలేకపోవడం మన పరిశోధన రంగం వైఫల్యమేనని తెలిపారు.  

ఆరుగురికి అవార్డులు..
కాగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారాలను ఆరుగురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. వీరిలో సుమన్ చక్రవర్తి (ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్), సుధీర్ కృష్ణస్వామి (హ్యుమానిటీస్), విధిత వైద్య (లైఫ్ సైన్సెస్), మహేశ్ కాక్డే (గణితం), నిస్సీమ్ కనేకర్ (భౌతిక శాస్త్రం), రోహిణి పాండే (సోషల్ సైన్స్)లకు పురస్కారాలు ప్రకటించారు. వీరికి జనవరిలో పురస్కారాలతో పాటు స్వర్ణ పతకం, లక్ష అమెరికన్ డాలర్లు అందిస్తారు.

చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement