పీల్చే గాలి విషం | Air pollution biggest health risk in India | Sakshi
Sakshi News home page

పీల్చే గాలి విషం

Published Thu, Oct 22 2020 4:13 AM | Last Updated on Thu, Oct 22 2020 4:51 AM

Air pollution biggest health risk in India - Sakshi

న్యూఢిల్లీ: గత ఏడాది భారత్‌లో వాయుకాలుష్యానికి 16 లక్షల 67 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ (ఎన్‌ఓజీఏ) నివేదిక 2020 వెల్లడించింది. వారిలో నెలలోపు వయసున్న పసిమొగ్గలే లక్షా 16 వేల మంది ఉన్నారు. అమెరికాకి చెందిన హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ ఈ నివేదిక రూపొందించింది. ప్రధానంగా పసిపిల్లలపై ఈ కాలుష్యం ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో అధ్యయనం చేసింది. చిన్న పిల్లల మీద ఈ స్థాయిలో వాయుకాలుష్యం ప్రభావం చూపించడం అత్యంత దారుణమైన అంశమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ కల్పన బాలకృష్ణన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ అరికట్టగలిగే మరణాలేనన్న కల్పన ప్రభుత్వాలు వీటిపై దృష్టి సారించాలన్నారు.  

పీఎం 2.5లోనూ భారత్‌దే మొదటి స్థానం
గాలిలో కాలుష్యకారకమైన సూక్షా్మతి సూక్ష్మమైన ధూళి కణాలు పీఎం 2.5 అంశంలో కూడా భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. గాలిలో పీఎం 2.5 75 నుంచి 85 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు లెక్క. గ్లోబల్‌ ఎయిర్‌ నివేదిక ప్రకారం భారత్‌లో 83 వరకు ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

గాలిలో పీఎం 2.5
► భారత్‌    83.2
► నేపాల్‌    83.1
► రిపబ్లిక్‌ ఆఫ్‌ నైజర్‌    80.1
► ఖతార్‌    76.0
► నైజీరియా    70.4


వాయు కాలుష్యంతో వస్తున్న వ్యాధులు
వాయు కాలుష్యంతో భారత్‌లో 87 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో అత్యధికంగా శ్వాసకోశకి సంబంధించిన వ్యాధులే ఉన్నాయి.  
► ఊపిరితిత్తుల వ్యాధులు
► న్యుమోనియా  
► హార్ట్‌ ఎటాక్‌
► కేన్సర్‌
► మధుమేహం
► నవజాత శిశువులకు సోకే వ్యాధులు

► గాలి కలుషితమై పసిపిల్లల ఉసురు తీయడం భారత్‌లోనే అత్యధికం. 2019లో 1,16,000 మంది చిన్నారులు భూమ్మీదకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు.  
► భారత్‌ తర్వాత స్థానంలో నైజీరియా (67,900 మంది పిల్లల మృతి), పాకిస్తాన్‌ (56,500), ఇథియోపియా (22,900), డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (1,200) ఉన్నాయి.  
► గర్భిణీ స్త్రీలు కలుషితమైన గాలిని పీల్చడంతో గర్భంలో ఉన్న పిండంపై తీవ్ర ప్రబావాన్ని చూపిస్తోంది. దీనివల్ల ప్రీమెచ్యూర్‌ డెలివరీ, తక్కువ బరువు, ఊపిరితిత్తులు బలంగా లేకపోవడం, రక్తంలో గడ్డలు ఏర్పడడం వంటి సమస్యలు పిల్లల్లో కనిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement