infants death
-
బాలింతల మృతి ఆందోళనకరం: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సిజేరియన్ వికటించి ఇద్దరు బాలింతలు మృతిచెందడం పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు సర్కారీ ఆస్పత్రులే ఆఖరి ఆశ అని ఆమె వ్యాఖ్యానించారు. గైనకాలజిస్టుగా తనకు ఈ ఘటనపై ఎన్నో ప్రశ్నలున్నాయని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని అనుకున్నానని, కానీ సంక్రాంతి పండుగని ఆగానని అన్నారు. గతంలో సైతం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో నలుగురు మహిళలు మరణించారని గుర్తు చేశారు. జనాభా అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపడాలని ఆమె అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొని మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులు తన పరిశీలనలో ఉన్నాయనీ పెండింగ్‌లో లేవని తెలిపారు. యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లులోని అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీ నియామకాల బిల్లుపై న్యాయ వివాదాలు వచ్చే అవకాశం ఉందని, దీంతో నియామకాల్లో జాప్యం జరగరాదని తన భావనని చెప్పారు. ఈ తరహా విధానాలకు గతంలో న్యాయ స్థానాలు అభ్యంతరం తెలిపాయన్నారు. బిల్లుపై యూజీసీ కొన్ని అంశాలను లేవనెత్తిందని గవర్నర్ వెల్లడించారు. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కావాలని తన అభిమతమన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై స్వయంగా తయారు చేసిన పొంగళిని సూర్యుడికి సమర్పించిన అనంతరం ఉత్సవాల్లో పాల్గొన్న వారికి వడ్డించారు. -
దారుణం: విద్యుత్ నిలిచిపోవడంతో నలుగురు నవజాత శిశువులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదంచోటుచేసుకుంది. సర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అసుపత్రిలో నలుగురు నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఆక్సిజన్ అందక నలుగురు పసికందులు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో అర్థరాత్రి మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే శిశువుల మృతికి కారణమని మండిపడ్డారు. అయితే విద్యుత్ అంతరాయం కారణంగా పిల్లలు చనిపోయారనే విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది బయటపెట్టలేదు. ఆసుపత్రిలో శిశువులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ స్పందించారు. దీనిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు. త్వరితగతిన విచారణ జరిపి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయ యుకే శిశువుల మరణాలపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చనిపోయిన శిశువు ఒకరోజు నుంచి నలుగురు రోజుల వయసున్న వారని కలెక్టర్ కుందన్ కుమార్ పేర్కొన్నారు. ఆ నలుగురు శిశువుల ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉండడంతో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో ఉంచారని, వారిలో ఇద్దరినీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 5:30 నుంచి 8:30 గంటల మధ్య నలుగురు చిన్నారులు చనిపోయారని ఆయన వెల్లండిచారు. అయితే కరెంట్ లోపంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పలేమని అన్నారు. వెంటిలేటర్లు కూడా ఆగిపోలేదని, పూర్తి వివరాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. వెంటిలేటర్ ఆగిపోయిందా లేదా అనే విషయం విచారణలో తెలుస్తుందని పేర్కొన్నారు. చదవండి: బెంగళూరులో దారుణం...ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు -
మొదటి పుట్టినరోజు జరక్కుండానే
న్యూఢిల్లీ: దేశంలో శిశు మరణాల రేట్(ఐఎంఆర్) గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నా..మొత్తమ్మీద పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. ఇప్పటికీ దేశంలో పుట్టే ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు మొదటి పుట్టిన రోజు జరుపుకోకుండానే కన్నుమూస్తున్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదికలోని విషయాలు ఈ కఠోర సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక సమయంలో (ఏడాది నిండకుండానే) మరణించే శిశువుల సంఖ్యను ఐఎంఆర్‌గా పేర్కొంటారు. 1971లో ఐఎంఆర్ 129 కాగా, 2020 సంవత్సరం నాటికి ఇది 28కు..అంటే సుమారు నాలుగో వంతుకు తగ్గింది. గత దశాబ్ద కాలంలో ఐఎంఆర్‌లో 36% తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో దేశవ్యాప్త ఐఎంఆర్ 44 నుంచి 28కి తగ్గిపోయింది. ఈ సమయంలో ఐఎంఆర్ పట్టణప్రాంతాల్లో 29 నుంచి 19కి, గ్రామీణ ప్రాంతాల్లో 48 నుంచి 31కి దిగివచ్చింది. అంటే వరుసగా 35%, 34% తగ్గుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. ఇంతగా ఐఎంఆర్ పడిపోయినా ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు ఏడాది నిండకుండానే కన్నుమూస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. 2020లో మధ్యప్రదేశ్‌లో ఐఎంఆర్ అత్యధికంగా 43 కాగా, మిజోరంలో 3 మాత్రమేనని తెలిపింది. దేశవ్యాప్తంగా గత 5 దశాబ్దాలుగా జననాల రేటులో కూడా తగ్గుదల వేగంగా నమోదైందని నివేదిక పేర్కొంది. 1971లో 36.9% ఉన్న జననాల రేటు 2020కి 19.5%కి తగ్గింది. 2011–2020 సంవత్సరాల మధ్య జననాల రేటు 11% తగ్గిందని నివేదిక వెల్లడించింది. ఒక ప్రాంతంలో ఏడాది సమ యంలో నమోదైన జననాల రేటు ప్రాతిపదికగానే జనాభా పెరుగుదల రేటును అంచనా వేస్తారు. -
10 నెలల్లో 185 మంది శిశువులు గర్భంలోనే కన్నుమూత.. ఆ రెండు ఆస్పత్రుల్లోనే!
ఆడ పిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందన్న రోజుల నుంచి ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసిన రోజులకు మానవ సమాజం దిగజారింది. మానవ శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి ఇందుకేనా.. అన్నట్టు తలదించుకునేలా చోటు చేసుకుంటున్న సంఘటనలు నివ్వెరపరుస్తున్నాయి. మరోవైపు వివాహేతర సంబంధాల నేపథ్యంలో గర్భంలోనే ఆడ.. మగ అనే తేడా లేకుండా జరుగుతున్న శిశు హత్యలు గుండెలను పిండేస్తున్నాయి. కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇదేనా మన విజ్ఞానాభివృద్ధి అనేలా ప్రశ్నిస్తున్నాయి. సాక్షి, విజయనగరం ఫోర్ట్: వైద్య రంగం అభివృద్ధి చెందక ముందు పుట్టే బిడ్డ ఆడ.. మగ అని మాత్రమే చూసేవారు. ఒక్కో మహిళ పది మంది పిల్లలకు జన్మనిచ్చేది. ఏ బిడ్డయినా సమానంగానే పెంచేవారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇలా సంతోషాలు వెల్లివిరిసేవి. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పుట్టే బిడ్డ ఆడ.. మగ అనేది అమ్మ గర్భంలోనే స్కానింగ్ చేసి గుర్తిస్తున్నారు. అంగ వైకల్యాలను సైతం గర్భంలోనే పసిగట్టేస్తున్నారు. ఇంకేముంది ఆడ బిడ్డయితే గర్భంలోనే చిదిమేస్తున్న సంఘటనలు వైద్య రంగాన్ని సవాల్ చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు కూడా ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి. వివాహేతర సంబంధాల విషయంలో అది ఆడ.. మగ.. అని చూడకుండా భ్రూణహత్యలకు దిగజారుతున్నారు. వైద్య రంగ విప్లవం మానవ అభివృద్ధికి దోహదపడేలా తప్ప ఇలా తల్లి గర్భంలోనే భ్రూణ హత్యలకు దారితీయడం దారుణం. నింగిలో సగం.. నేలపై సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో నేడు రాణిస్తున్నారు. అవకాశాలు దక్కితే తమ సత్తా చూపుతున్నారు. అయినా ఆడ పిల్లల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడ పిల్లను ఎంతగా చదివించినా... వారు ఎంతగా రాణించినా పెళ్లి సమయంలో వరకట్న దురాచారం ఇంకా పీడిస్తూనే ఉంది. దీని ఫలితం ఆడ పిల్లలను వద్దనుకునే వారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఆడ పిల్లలను కోరుకునే వారు ఉన్నారు. చదవండి: చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పది నెలల్లోనే... 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి నెల వరకు 185 మంది గర్భంలోనే చనిపోయారు. వీరిలో 12 వారాల్లోపు చనిపోయిన వారు 135 మంది కాగా, 12 నుంచి 20 వారాల్లోపు చనిపోయిన వారు 50 మంది ఉన్నారు. ఈ మరణాల్లో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని కొందరు తల్లిదండ్రులు అబార్షన్లు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కానింగ్ సెంటర్లపై కొరవడిన పర్యవేక్షణ స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కొరవడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం భ్రూణ హత్యల నివారణకు ప్రత్యేక చట్టం తెచ్చి అమలు చేస్తున్నా... కొందరు నిర్వాహకులు అమ్యామ్యాలకు అలవాటుపడి లింగ నిర్ధారణ వెల్లడిస్తున్నారనే విమర్శలున్నాయి. కొన్నేళ్లుగా స్కానింగ్ కేంద్రాలపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఈ ఆరోపణలకు ఊతమిస్తుంది. ఆ రెండు ఆస్పత్రుల్లోనే... జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి అబార్షన్లు చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఈ విషయం సంబంధిత ఆస్పత్రులపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని తెలిసింది. ఇదే సమయంలో అబార్షన్ కోసం తీసుకువచ్చే ఆర్ఎంపీ, ఆశ వర్కర్లకు ఆయా ఆస్పత్రులు భారీగా ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: Health Tips: బరువు తగ్గాలని బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే.. కష్టమే! తగ్గుతున్న ఆడ పిల్లల సంఖ్య జిల్లాలో ఆడ పిల్లల సంఖ్య నెలనెలా తగ్గిపోతుంది. వెయ్యి మంది బాలురుకు 940 మంది బాలికలే ఉన్నారు. 2021 డిసెంబరులో వెయ్యి మంది బాలురుకు 942 మంది బాలికలు ఉన్నారు. 2022 జనవరి నెల వచ్చేసరికి ఆ సంఖ్య 940కి తగ్గింది. స్కానింగ్ చేయాల్సిన పరిస్థితులు ► జన్యు సంబంధమైన జీవ కణాల్లో కలిగే అసాధ«రణ మార్పు గుర్తించినప్పుడు ► ఎర్ర రక్తకణాల్లో అసాధారణ స్థితి ఉన్నప్పుడు. ► లింగ సంబంధిత వ్యాధులు గుర్తించినప్పుడు. ► స్కానింగ్‌కు చట్టం ఆమోదించే పరిస్థితులు. ► గర్భదారణ జన్యు సంబంధమైన పిండానికి వ్యాధులు కనుగొనేందుకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తారు. ► గర్భిణికి రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు గర్భస్రావం, పిండ నష్టం జరిగినప్పుడు. ► గర్భిణులు హానికారక మందులు, అణుధార్మిక శక్తి, రసాయనాల బారిన పడినప్పుడు, దాని ప్రభావం కలిగినప్పుడు స్కానింగ్ చేయవచ్చు. సమాచారమిస్తే చర్యలు జిల్లాలో ఏ స్కానింగ్ సెంటర్‌లోనైనా లింగ నిర్ధారణ చేస్తున్నట్టు సమాచారం ఇస్తే తనిఖీలు చేసి తీవ్రమైన చర్యలు చేపడతాం. అటువంటి స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు పెడతాం. లింగ నిర్ధారణ వెల్లడి చట్టరీత్యా నేరమనే విషయమై అవగాహన కల్పిస్తున్నాం. అదే సమయంలో వివాహం కాకుండా గర్భం దాలుస్తున్న వారు అబార్షన్లు చేయించుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. – డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్ఓ -
పీల్చే గాలి విషం
న్యూఢిల్లీ: గత ఏడాది భారత్‌లో వాయుకాలుష్యానికి 16 లక్షల 67 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (ఎన్ఓజీఏ) నివేదిక 2020 వెల్లడించింది. వారిలో నెలలోపు వయసున్న పసిమొగ్గలే లక్షా 16 వేల మంది ఉన్నారు. అమెరికాకి చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అండ్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ఈ నివేదిక రూపొందించింది. ప్రధానంగా పసిపిల్లలపై ఈ కాలుష్యం ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో అధ్యయనం చేసింది. చిన్న పిల్లల మీద ఈ స్థాయిలో వాయుకాలుష్యం ప్రభావం చూపించడం అత్యంత దారుణమైన అంశమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ కల్పన బాలకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ అరికట్టగలిగే మరణాలేనన్న కల్పన ప్రభుత్వాలు వీటిపై దృష్టి సారించాలన్నారు. పీఎం 2.5లోనూ భారత్‌దే మొదటి స్థానం గాలిలో కాలుష్యకారకమైన సూక్షా్మతి సూక్ష్మమైన ధూళి కణాలు పీఎం 2.5 అంశంలో కూడా భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. గాలిలో పీఎం 2.5 75 నుంచి 85 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు లెక్క. గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం భారత్‌లో 83 వరకు ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గాలిలో పీఎం 2.5 ► భారత్ 83.2 ► నేపాల్ 83.1 ► రిపబ్లిక్ ఆఫ్ నైజర్ 80.1 ► ఖతార్ 76.0 ► నైజీరియా 70.4 వాయు కాలుష్యంతో వస్తున్న వ్యాధులు వాయు కాలుష్యంతో భారత్‌లో 87 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో అత్యధికంగా శ్వాసకోశకి సంబంధించిన వ్యాధులే ఉన్నాయి. ► ఊపిరితిత్తుల వ్యాధులు ► న్యుమోనియా ► హార్ట్ ఎటాక్ ► కేన్సర్ ► మధుమేహం ► నవజాత శిశువులకు సోకే వ్యాధులు ► గాలి కలుషితమై పసిపిల్లల ఉసురు తీయడం భారత్‌లోనే అత్యధికం. 2019లో 1,16,000 మంది చిన్నారులు భూమ్మీదకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ► భారత్ తర్వాత స్థానంలో నైజీరియా (67,900 మంది పిల్లల మృతి), పాకిస్తాన్ (56,500), ఇథియోపియా (22,900), డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (1,200) ఉన్నాయి. ► గర్భిణీ స్త్రీలు కలుషితమైన గాలిని పీల్చడంతో గర్భంలో ఉన్న పిండంపై తీవ్ర ప్రబావాన్ని చూపిస్తోంది. దీనివల్ల ప్రీమెచ్యూర్ డెలివరీ, తక్కువ బరువు, ఊపిరితిత్తులు బలంగా లేకపోవడం, రక్తంలో గడ్డలు ఏర్పడడం వంటి సమస్యలు పిల్లల్లో కనిపిస్తున్నాయి. -
ఆసుపత్రిలో శిశువుల మృత్యుఘోష
జైపూర్: రాజస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు శాశ్వత నిద్రలోకి జారుకోవడం కలకలం రేపుతోంది. కేవలం రెండు రోజుల్లోనే పది మంది శిశువులు మృతి చెంది ఆ తల్లులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చారు. కోటలోని జేకేలాన్ ఆసుపత్రిలో డిసెంబరు 23న ఆరుగురు, డిసెంబరు 24న నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు ఆడ శిశువులుండగా, మిగతా ఐదుగురు మగ శిశువులున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెండ్ డా.హెచ్ఎల్ మీనా మాట్లాడుతూ ‘సాధారణంగా ఆసుపత్రిలో రోజుకు ఒకటి, రెండు మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ రెండురోజుల్లో పదిమంది చిన్నారులు మరణించడం బాధాకరం, కానీ సాధారణమే. చాలా వరకు శిశువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లాలని కోరామ’ని పేర్కొన్నాడు. అయితే ఆక్సిజన్ అందక, ఇన్ఫెక్షన్ కారణంగా, పలు కారణాల రీత్యా శిశువులు పుట్టిన 48 గంటల్లోనే మృతి చెందారని ఓ వైద్యుడు తెలిపాడు. కాగా ఇదే ఆసుపత్రిలో డిసెంబర్ నెలలోనే ఇప్పటివరకు 77 మంది చిన్నారులు మరణించడం గమనార్హం. -
బోరుబావిలో పడిన చిన్నారి మృతి
చెన్నై: బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన తమిళనాడులోని ఆర్కాడ్ లోని చిన్నతక్కాయ్ లో ఆదివారం చోటుచేసుకుంది. ఆడుకుంటూ బోరుబావి వద్దకు వెళ్లిన చిన్నారి అందులో పడిపోయింది. దాంతో సమాచారం అందుకున్న రెస్య్కూటీమ్ బాలికను రక్షించేందుకు రంగంలోకి దిగింది. అందులో భాగంగా సహాయక చర్యలు చేపట్టింది. అయితే చిన్నారిని సురక్షితంగా బయటకు తీసినా పాప ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే చిన్నారి ప్రాణాలు విడిచింది. దాంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
ఢిల్లీలో 34,000 మంది శిశువుల మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో ప్రపంచస్థాయి ఆరోగ్య వసతులున్నా, ఏయిమ్స్లాంటి వైద్య విజ్ఞాన సంస్థలున్నా పురుటి బిడ్డలను పరిరక్షించలేక పోవడం శోచనీయం. గత ఐదేళ్ల కాలంలో కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న 19 ఆస్పత్రుల్లో 3,4000 మంది మరణించినట్టు సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. పుట్టిన ప్రతి వెయ్యి మంది శిశువులు మృత్యువుబారిన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సఫ్దారాజంగ్ ఆస్పత్రిలోనే 10, 396 మంది శిశువులు మరణించగా, చిల్డ్రన్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో దాదాపు ఏడువేల మంది శిశువులు మరణించారు. ఏడాది నుంచి ఐదేళ్లలోపు పిల్లలే ఎక్కువ మంది మరణిస్తున్నారు. డయేరియా, న్యూమేనియా, ఇతర అంటువ్యాధుల కారణంగా పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వాధ్యర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయనేది సుస్పష్టం. అయితే తొమ్మిది నెలలు పూర్తికాకముందే పుట్టడం, పుట్టిన శిశువులు తక్కువ బరువుండడం, తల్లి కడుపులో ఉండగానే అంటురోగాల బారిన పడడం వల్లనే ఈ మరణాలు సంభవించాయని ఇటు వైద్యులు, అధికారులు సమర్థించుకుంటున్నారు.దేశంలో ఏటా 2.60 కోట్ల శిశువులు జన్మిస్తుండగా, వారిలో ఐదేళ్లలోపు 18.30 మంది పిల్లలు చనిపోతున్నారు. వైద్య విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేటి యుగంలో ఆనారోగ్యంకాటు నుంచి పిల్లలను రక్షించుకోక పోవడం మన ఆస్పత్రుల పాపమేనని చెప్పవచ్చు.