రుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన తమిళనాడులోని ఆర్కాడ్ లోని చిన్నతక్కాయ్ లో ఆదివారం చోటుచేసుకుంది.
చెన్నై: బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన తమిళనాడులోని ఆర్కాడ్ లోని చిన్నతక్కాయ్ లో ఆదివారం చోటుచేసుకుంది. ఆడుకుంటూ బోరుబావి వద్దకు వెళ్లిన చిన్నారి అందులో పడిపోయింది. దాంతో సమాచారం అందుకున్న రెస్య్కూటీమ్ బాలికను రక్షించేందుకు రంగంలోకి దిగింది.
అందులో భాగంగా సహాయక చర్యలు చేపట్టింది. అయితే చిన్నారిని సురక్షితంగా బయటకు తీసినా పాప ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే చిన్నారి ప్రాణాలు విడిచింది. దాంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.