
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 17 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం (డిసెంబర్9న) ఘటన చోటు చేసుకోగా మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం వరకు నిర్విరామంగా బాలుడిని బావి నుంచి బయటకు తీసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు,పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతుంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

#WATCH दौसा, राजस्थान: दौसा में खेलते समय एक 5 वर्षीय बच्चा बोरवेल में गिर गया। बचाव अभियान जारी है।
DM देवेंद्र कुमार ने बताया, "बच्चा करीब 150 फीट गहराई में है, उसे लगातार ऑक्सीजन दिया जा रहा है। मेडिकल टीम मौके पर मौजूद है। SDRF, NDRF और सिविल डिफेंस की टीमें मौके पर पहुंच गई… pic.twitter.com/JECEDzVtxv— ANI_HindiNews (@AHindinews) December 9, 2024
బోరు బావి ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ కొద్ది సేపటి క్రితం మాట్లాడుతూ.. ‘‘150 అడుగుల లోతులో ఉన్న బాలుడు ఆర్యన్ ఆరోగ్యం బాగుంది. ఆక్సీజన్ పంపుతున్నాం. బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బావిలోకి కెమెరాలను పంపాము. బాలుడిని రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఎంతవీలైతే అంత తొందరగా బాలుడిని రక్షించాలనే’’ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
బోరుబావిలో బాలుడు పడ్డాడనే సమాచారంతో స్థానికులు, జిల్లా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. బాలుడి ఆచూకీ గురించి ఆరా తీస్తున్నారు. ఆర్యన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment