rescue operations
-
ఎస్ఎల్బీసీ టన్నెల్లో.. సవాల్‌గా మారిన సహాయక చర్యలు (ఫొటోలు)
-
SLBC సొరంగంలో పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి జూపల్లి
-
టన్నెల్ లో పరిస్థితి ఘోరం.. 50 మీటర్లు మించి వేళ్లలేకపోతున్న ఆర్మీ, NDRF సిబ్బంది
-
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు... సీఎం రేవంత్ సమీక్ష
సాక్షి,హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు.సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు రెండోరోజు నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండీ పర్యవేక్షించారు.ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.వాటర్ ప్లోటింగ్ సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడేయటంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. టన్నెల్లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటికి చేరుకునే ప్రత్నామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
కుప్పకూలిన సొరంగం
సాక్షి, నాగర్‌కర్నూల్/ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. ఘటన విషయం తెలిసిన సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతామని, పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇటీవలే పనులు పునః ప్రారంభమై... శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్ఎల్బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి.. ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్‌బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్‌కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్‌కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా...: సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది. ఈ సొరంగానికి ఇన్లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న మంత్రులు సొరంగం ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. సహాయక చర్యలను పరిశీలించారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతో‹Ù, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు క్షేత్రస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కిషన్‌రెడ్డి ఫోన్ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించాలని, కేంద్రం నుంచి అన్నిరకాల సహాయం అందించాలని కోరారు. అమిత్ షా సానుకూలంగా స్పందించారని.. హైదరాబాద్ నుంచి ఒకటి, విజయవాడ నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రమాద స్థలానికి పంపారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇక సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.శరవేగంగా సహాయక చర్యలు: సీఎం రేవంత్ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గాయపడిన కార్మీకులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించా రు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తనకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై శనివారం రాత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ప్రమాదం ఘటన, సహాయక చర్యల పరిస్థితి, ఇతర అంశాలను సీఎంకు మంత్రి ఉత్తమ్ వివరించారు.పూర్తి సహకారం అందిస్తాం: ప్రధాని మోదీ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మీకులను కాపాడేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని సీఎం రేవంత్ వివరించారు. దీనితో కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సహాయక చర్యల కోసం సత్వరమే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని మోదీ హామీ ఇచ్చారు. -
57 గంటల తర్వాత బోరు బావి నుంచి బయటకు.. ప్రాణాలు కోల్పోయిన ఆర్యన్
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడు ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల పాటు శ్రమించారు. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషాదం సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.STORY | Race against time to save 5-year-old Aryan stuck in Rajasthan borewellREAD: https://t.co/LlJCz15soaVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KqVqlNJmo7— Press Trust of India (@PTI_News) December 11, 2024వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ మధ్యాహ్నం 3గంటల సమయంలో బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిలో పడ్డ గంట తర్వాత ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు కదిలి వచ్చాయి. బోరుబావిలో పడ్డ బాలుడి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు, జేసీబీలు,డ్రిల్లింగ్ మెషిన్లతో ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపాయి. ఎన్డీఆర్ఎఫ్ ఆపరేషన్‌లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నీటి మట్టం దాదాపు 160 అడుగుల వరకు ఉంటుందని అంచనా వేశారు. భూగర్భంలో ఆవిరి కారణంగా బాలుడి కదలికలను కెమెరాలో బంధించడంలో ఇబ్బంది మారింది. అదే సమయంలో భద్రతా సమస్యలు కూడా తలెత్తుతాయని అంచనా వేశారు. అయినప్పటికీ, 57 గంటల పాటు శ్రమించి బోరుబావి నుంచి ఆపస్మారక స్థితిలో ఉన్న ఆర్యన్ సురక్షితంగా బయటకు తీశారు. గ్రీన్ కారిడార్ ద్వారా అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌తో కూడిన అంబులెన్స్‌లో ఆర్యన్‌ను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్ష చేసినా డాక్టర్లు ఆర్యన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. -
150 అడుగుల బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 17 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం (డిసెంబర్9న) ఘటన చోటు చేసుకోగా మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం వరకు నిర్విరామంగా బాలుడిని బావి నుంచి బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు,పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతుంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. #WATCH दौसा, राजस्थान: दौसा में खेलते समय एक 5 वर्षीय बच्चा बोरवेल में गिर गया। बचाव अभियान जारी है।DM देवेंद्र कुमार ने बताया, "बच्चा करीब 150 फीट गहराई में है, उसे लगातार ऑक्सीजन दिया जा रहा है। मेडिकल टीम मौके पर मौजूद है। SDRF, NDRF और सिविल डिफेंस की टीमें मौके पर पहुंच गई… pic.twitter.com/JECEDzVtxv— ANI_HindiNews (@AHindinews) December 9, 2024బోరు బావి ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ కొద్ది సేపటి క్రితం మాట్లాడుతూ.. ‘‘150 అడుగుల లోతులో ఉన్న బాలుడు ఆర్యన్ ఆరోగ్యం బాగుంది. ఆక్సీజన్ పంపుతున్నాం. బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బావిలోకి కెమెరాలను పంపాము. బాలుడిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఎంతవీలైతే అంత తొందరగా బాలుడిని రక్షించాలనే’’ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.బోరుబావిలో బాలుడు పడ్డాడనే సమాచారంతో స్థానికులు, జిల్లా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. బాలుడి ఆచూకీ గురించి ఆరా తీస్తున్నారు. ఆర్యన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నారు. -
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. నలుగురి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. లక్నోలోని ట్రాన్స్‌పోర్టు నగర్లో శనివారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం కూలడంతో సమీపంలో పారక్ చేసి లారీ కూడా నుజ్జునుజ్జయింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే శిథిలాల కింద మరికిందరు చిక్కుకొని ఉంటారి అధికారులు భావిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ కూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందికాగా బిల్డింగ్ కూలిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేయాలని తెలిపారు.#WATCH | Lucknow building collapse | Rescue operations to evacuate the trapped people are underway. Fire Department and NDRF teams are at the spot. The evacuated people are being sent to the hospital.So far, 4 people have been evacuated in the incident. pic.twitter.com/gN3GWrAQ4X— ANI (@ANI) September 7, 2024 -
గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. 20 మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. పలు నగరాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 300 మందిని సహాయక బృందాలు కాపాడాయి. మోర్బీలో ఒకరు, గాంధీనగర్‌లో ఇద్దరు, ఆనంద్‌లో ఆరుగురు, వడోదరలో ఒకరు, ఖేదాలో ఒకరు, మహిసాగర్‌లో ఇద్దరు, ఒకరు మరణించారు. భరూచ్‌లో మరణించగా, అహ్మదాబాద్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 23,870 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 1,696 మందిని రక్షించారు. అయితే మంగళవారం వర్షం తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణవాఖ గుజరాత్‌కు హచ్చరికలు జారీ చేసింది.#HeavyRainfallअगर बहुत जरूरी ना हो तो इस समय गुजरात घूमने से बचे,बारिश ने कहर मचाया हुआ है। खासकर अहमदाबाद,वडोदरा में भयंकर बारिश है।प्रभु धीर धरो..बाढ़ के हालात हैं #GujaratFlood #HeavyRain #GujaratRains #vadodararain #HeavyRainAlert #Gujarat #Ahmedabad #AhmedabadRains pic.twitter.com/5ddCzz6SdU— Monu kumar (@ganga_wasi) August 28, 2024 రెస్క్యూ. రిలీఫ్ ఆపరేషన్లను వేగవంతం చేయడానికి , గుజరాత్ ప్రభుత్వం ఆరు ఇండియన్ ఆర్మీ బృందాల సాయం కోరింది దేవభూమి ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్ జిల్లాల్లో సైన్యం, 14 ఎన్డీఆర్ఎఫ్, 22 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. వర్షాల ధాటికి సురేందర్‌నగర్ జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయింది. వర్షాల పరిస్థితి, సహాయక చర్యలను సమీక్షించేందకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న నదులు, డ్రెయిన్లు, సరస్సుల్లోకి ఎవరూ వెళ్లకుండా పోలీసుల సహకారం తీసుకుని పూర్తి అప్రమత్తతతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అంతే కాకుండా వాతావరణ శాఖ ప్రత్యేకంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదనే హెచ్చరికను కచ్చితంగా పాటించాలని తీర ప్రాంతాల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.गुजरात में भारी बारिश से जनजीवन अस्त व्यस्त.. कृपया इस मौसम में सावधानी बरतेंसावधान रहें.! सुरक्षित रहे.!!#HeavyRainfall #GujaratRains #HeavyRainAlert pic.twitter.com/n9Qlh9pmPy— Mukesh Jeetrawal (@MukeshJeetrawal) August 28, 2024 ఇక గుజరాత్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నదుల్లో నీటి మట్టం పెరిగి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరత్, వడోదర నగరాల్లో వరద ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తోంది. రాజధాని గాంధీనగర్లోనూ రోడ్లపైకి నీరు చేరింది. వడోదరలో విశ్వమిత్రి నదిలో నీట మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలో ఏడు వంతెనలను మూసివేశారు. నది పక్కనే ఉన్న అనేక ఇళ్లు నీట మునిగాయి. డైమండ్ సిటీ సూరత్‌లోనూ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. -
వయనాడ్ అప్డేట్స్: కర్నాటక ఆపన్న హస్తం
Updatesకేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఐదో రోజు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో గల్లంతైన వారిపై ఆచూకీ కోసి రెస్క్యూ బృందాలు ప్రధానంగా దృష్టిపెట్టాయి. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు, జగిలాలను ఉపయోగించి మనుషుల జాడను గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ తాజా గణాంకాలతో.. మృతుల సంఖ్య 358కి చేరుకుంది. ఇందులో 146 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.వయనాడ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 215 మృతదేహాలు వెలికి తీశామని, 206 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.Wayanad landslides: 215 bodies recovered, 206 people still missing, rescue ops in final stage, says Kerala CMRead @ANI Story | https://t.co/YFqTebrZCS#KeralaCM #WayanadLandslides #PinarayiVijayan pic.twitter.com/Rv27vnPr3C— ANI Digital (@ani_digital) August 3, 2024 వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని అన్నారు. 100 ఇళ్లులు నిర్మిస్తాం: కర్ణాటక సీఎంవయనాడ్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యఈ విషయం కేరళ సీఎం పినరయి విజయన్‌కు తెలిపినట్లు ఎక్స్‌లో పోస్ట్ In light of the tragic landslide in Wayanad, Karnataka stands in solidarity with Kerala. I have assured CM Shri @pinarayivijayan of our support and announced that Karnataka will construct 100 houses for the victims. Together, we will rebuild and restore hope.— Siddaramaiah (@siddaramaiah) August 3, 2024 కొండ చరియలు విరిగిపడటంతో గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు నేటికీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.సైన్యానికి సలాం వయనాడ్ విపత్తు నాటి నుంచి సహాయక చర్యల్లో భారత సైన్యం పోషిస్తున్న పాత్ర అమోఘం. తక్షణ వారధిల నిర్మాణం దగ్గరి నుంచి.. వరదల్లో చిక్కుకున్నవాళ్లను రక్షించడానికి దాకా.. అంతటా సాహసం ప్రదర్శిస్తోంది. తాజాగా.. ఓ కుటుంబాన్ని రక్షించడంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. ‘‘వయనాడ్‌లో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందం 8 గంటలపాటు శ్రమించి, ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం.. పునర్నిర్మించుకుందాం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కె.హాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నా.. సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకొని ఉండడాన్ని బృందం గమనించింది. వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు. అక్కడ పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకొని ఉండగా వారిని రక్షించారు. కాగా వారు కొద్దిరోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ అధికారి తెలిపారు. దీంతో తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామన్నారు. తమతో రావాల్సిందిగా వారిని కోరగా ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎంతో బతిమాలగా వారి తండ్రి ఒప్పుకున్నారని తెలిపారు. పిల్లలు ఇద్దరినీ తమ శరీరాలకు కట్టుకొని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. అనంతరం వారిని అత్తమాల యాంటీపోచింగ్ కార్యాలయానికి తరలించినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వారు అక్కడ సురక్షితంగా ఉన్నారన్నారు. రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. సహాయక బృందాన్ని కొనియాడారు. Kerala. pic.twitter.com/f4T4Lam45I— Comrade Mahabali (@mallucomrade) August 2, 2024 ముఖ్యమంత్రి పినరయ విజయన్, ఆయన భార్య టీ. కమలా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. లక్షా 33 వేల విరాళం ప్రకటించారు. ఆరు జోన్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్‌లో డీప్ సెర్చ్ రాడార్లను పంపాలని కేంద్రానికి కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో నార్తర్న్ కమాండ్ నుంచి ఒక జేవర్ రాడార్, ఢిల్లీ, తిరంగ మౌంటైన్ రెస్క్యూ ఆర్గనైజేషన్ నుంచి నాలుగు రీకో రాడార్లను ఇవాళ వయనాడ్‌కు ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలించారు.వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. గతంలో ఆయనకు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చింది. టెరిటోరియల్ ఆర్మీలో కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్.. విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశమయ్యారు. వాళ్ల సేవల్ని కొనియాడారు. కోజికోడ్ నుంచి రోడ్ మార్గంలో వయనాడ్‌కు వెళ్లి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అంతకు ముందు.. వయనాడ్ కొండచరియలు విరిగిన పడిన ప్రాంతాల్లో పునరావాసం కోసం రూ.3 కోట్లు విరాళం ఇచ్చారాయన. #WATCH | Actor and Honorary Lieutenant Colonel Mohanlal visited landslide-affected Punchiri Mattam village in Wayanad#Kerala pic.twitter.com/ckp2uAhyaE— ANI (@ANI) August 3, 2024 మలయాళ నటుడు మోహన్‌లాల్ వయనాడ్‌లోని కొండరియలు విరిగినపడిన ప్రాంతాన్ని సందర్శించారు. సహాయక, గాలింపు చర్యలు చేపట్టిన ఆర్మీ సైనికులతో పరిశీలించారు. ఆయనకు ఆర్మీ అధికారులు ప్రమాద తీవ్రతను వివరించారు. #WATCH | Kerala: Indian Army jawans construct a temporary bridge for the machinery to pass through, to facilitate search and rescue operation. Visuals from Punchirimattom, Wayanad. Search and rescue operation in landslide-affected areas in Wayanad, entered 5th day today. The… pic.twitter.com/FKrBiiI4qp— ANI (@ANI) August 3, 2024 ఇండియన్ ఆర్మీ జవాన్లు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉపయోగించే యంత్రాలు తీసుకువెళ్లడానికి తాత్కాలిక వంతెనను నిర్మించారు. ఇంకా 300 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.#WATCH | Kerala: Search and rescue operations in landslide-affected areas in Wayanad entered 5th day today. The death toll stands at 308.Drone visuals from Bailey Bridge, Chooralmala area of Wayanad. pic.twitter.com/OQ7GpKvwND— ANI (@ANI) August 3, 2024 దీంతో కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతోపాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అత్తమల అరాన్‌మల, ముండక్కై, పుంచిరిమట్టం, వెల్లరిమల, జీవీహెచ్ఎస్ఎస్ వెల్లరిమల, నదీతీరం ఇలా కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు.Wayanad landslides: Search operation enters Day 5, death toll at 308Read @ANI Story | https://t.co/94yPyDrseW#WayanadLandslides #Kerala #VeenaGeorge pic.twitter.com/c3PstYyb4z— ANI Digital (@ani_digital) August 3, 2024 -
వణుకుతున్న వాయనాడ్..
-
వయనాడ్ లో రెండో రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
వయనాడ్ విపత్తు: సహాయక చర్యల్లో వైమానిక హెలికాప్టర్లు
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి, ఒక విదేశీయుడు ఉన్నారు. భారీ వర్షం మధ్యే సహయక చర్యలు కొనసాతున్నాయి. చీకటి, భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం యంత్రాంగం మొత్తం సహయాక చర్యల్లో పాల్గొనాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. Wayanad landslide | CM Pinarayi Vijayan has given directions to coordinate the rescue operations in Wayanad promptly following the devastating landslide. He announced that the entire government machinery is actively involved in the efforts, with Ministers overseeing and… pic.twitter.com/DWDXebBxmz— ANI (@ANI) July 30, 2024 250 మంది ఫైర్ అండ్ రెస్క్యూ, సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్, లోకల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సభ్యులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ అదనపు బృందాలను వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు వైమానిక దళ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.Wayanad landslide | 250 members of Fire and Rescue, Civil Defence, NDRF and Local Emergency Response Team are involved in the rescue operation in Wayanad Churalmala. An additional team of NDRF has been directed to reach the spot immediately: Kerala CMO— ANI (@ANI) July 30, 2024 శిథిలాల కింద వందలాది మంది చిక్కకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. భారీ విరిగిన పడిన కొండచరియలు, భారీ వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వయనాడ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని నెటిజన్లు ప్రార్థనలు చేస్తున్నారు. വയനാട് രക്ഷാപ്രവർത്തനം.@airnewsalerts @airnews_tvm AIR VIDEOS: Arunvincent, PTC Wayanad pic.twitter.com/TcISMAzxjv— All India Radio News Trivandrum (@airnews_tvm) July 30, 2024BREAKING: 6 bodies found, hundreds feared trapped as two landslides hit Kerala’s #Wayanad last night and early this morning.Rescue on in extremely adverse, rainy conditions. pic.twitter.com/adJwZulmAh— Abhijit Majumder (@abhijitmajumder) July 30, 2024Pray For Wayanad 🙏🏻#Wayanad #WayanadLandSlide pic.twitter.com/ZEHB7nFJFq— நெல்லை செல்வின் (@selvinnellai87) July 30, 2024 -
అస్సాంలో వరదలు: పలువురిని కాపాడిన ఆర్మీ
దిస్ఫూర్: అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలు రాష్ట్రంలోని పలు జిల్లాలను ప్రభావితం చేశాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ.. జూన్ 29 నుంచి పలు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు చేపట్టింది.#SpearCorps, #IndianArmy, @sdma_assam, and @ComdtSdrf, jointly carried out relentless rescue & relief operations in the flood affected areas in Dhemaji District of #Assam and East Siang district of #ArunachalPradesh. Over 35 citizens were evacuated, provided critical aid &… pic.twitter.com/xLxSYQ8kzw— SpearCorps.IndianArmy (@Spearcorps) July 1, 2024 ‘అసోంలోని ధేమాజీ జిల్లాలోని శివగురి, అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాలోని మెర్ గ్రామాలు ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సెస్ (SDRF) సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టాం. జూన్ 29 నుంచి వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని భారత్ ఆర్మీ ఒక ప్రకటనలో వెల్లడించింది.Troops of #AssamRifles & #IndianArmy under #SpearCorps, safely rescued 800 personnel, including women and children from the inundated areas in Imphal East and Imphal West districts of #Manipur. The rescue columns also strengthened the embankments of the Imphal and Iril Rivers in… pic.twitter.com/3zDgwLIOda— SpearCorps.IndianArmy (@Spearcorps) July 3, 2024 అస్సాంలోని శివగురి, నామ్సింగ్ ఘాట్, పగ్లామ్, ఓరియన్ ఘాట్ ప్రాంతాల్లో 72 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టాం. సహాయక చర్యల్లో 17 మంది పిల్లలతో సహా మొత్తం 48 మందిని రక్షించినట్లు తెలిపారు. తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం, వైద్య సాయం అందిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యల్లో స్థానిక అధికార యంత్రాంగం, డిజాస్టర్ రెస్పాన్స్ టీంలతో కలిసి.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సాయం అందించామని ఆర్మీ అధికారులు తెలిపారు.#IndianArmy is conducting joint rescue & relief ops in the flood affected areas of #Assam & #ArunachalPradesh; 35 people evacuated so far. pic.twitter.com/WhGMwMiqPL— News IADN (@NewsIADN) July 1, 2024 -
ప్రాణాలకు తెగించి పనిచేశాం.. కానీ!’ ర్యాట్ హోల్ మైనర్ల ఆవేదన
ర్యాట్ హోల్ మైనర్స్.. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదానికి ముందు ఈ పేరును ఎవరూ ఎక్కువగా విని ఉండరు. కానీ టన్నెల్లో ఇరుకున్న కార్మికులను రక్షించడంలో వీరు చేసిన కృషి తర్వాత అందరికీ సుపరిచితులుగా మారారు. కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకురావడంలో ర్యాట్ హోల్ మైనర్లది కీలక పాత్ర. ఈ క్రమంలోనే వీరి సేవలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గురువారం 12 మంది ర్యాట్ హోల్ మైనర్లను ఒక్కొక్కరికి రూ. 50,000 చెక్కులతో సత్కరించారు. అయితే ర్యాట్ హోల్ మైనర్స్.. తాజాగా తమ నిరాశను వ్యక్తం చేశారు. సీఎం తమకు ఇచ్చిన రూ. 50 వేల చెక్కులను క్యాష్‌గా మార్చుకోవడానికి నిరాకరించారు. కార్మికులను రక్షించడంలో తాము పడ్డ కష్టానికి ప్రభుత్వ సాయానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల విషయంలో తాము నిరాశ చెందినట్లు తెలిపారు. ఆ చెక్కులను తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. యంత్రాలు కూడా చేయని పనిని తాము పూర్తి చేశామని.. ఎటువంటి షరతులు పెట్టకుండా మా ప్రాణాలను పణంగా పెట్టి శిథిలాలను మాన్యువల్‌గా డ్రిల్ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన పనిని అభినందిస్తున్నాము కానీ మాకు అందించిన మొత్తంతో సంతృప్తి చెందలేదని ర్యాట్ హోల్ మైనర్ల బృందానికి నాయకత్వం వహించిన వకీల్ హసన్ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ర్యాట్ హోల్ మైనర్ల పాత్ర వీరోచితమైనదని, కానీ వారు ప్రభుత్వం నుంచి పొందిన డబ్బు సరిపోదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్మానించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు.. తమకు అందించిన చెక్కులను క్యాష్ చేయకూడదని సమిష్టిగా నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. ‘చెక్కులు అందజేసిన రోజే ముఖ్యమంత్రికి మా అసంతృప్తిని తెలియజేశాను. మా విషయంపై రెండురోజుల్లో ప్రకటన చేస్తానని అధికారులు హామీ ఇవ్వడంతో తిరిగివచ్చాం. ఆ హామీ నిలబెట్టుకోకుంటే.. చెక్కులను తిరిగి ఇస్తాం. ఆపరేషన్‌లో సహకరించిన మైనర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాశ్వత ఉద్యోగాలు తాము ఆశిస్తున్నాం’ అని చెప్పారు. కాగా ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ కొంతభాగం కూలిపోయి నవంబర్ 12వ తేదీన 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి. కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయాత్నాలు చేసినా.. విదేశాల మిషన్లతో ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరికి ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగి వారిని రక్షించారు. -
ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకంగా వినిపించిన పేరు ఆర్నాల్డ్ డిక్స్. ఎవరీ డిక్స్.. ఈయన ప్రత్యేకత ఏంటి? మన ఊరు కాదు, మన భాషకాదు అయినా అందరితోనూ మమేకమవుతూ రక్షణ చర్యల్లో భాగంగా దేశం కాని దేశం వచ్చి ఇక్కడి కార్మికుల కోసం 24/7 ఎందుకంత కష్టపడ్డారు? ఇలాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ .ఆస్ట్రేలియా స్వతంత్ర విపత్తు పరిశోధకుడు. అంతర్జాతీయ టన్నెలింగ్ సంఘం అధ్యక్షుడు కూడా. ఉత్తరకాశీ వద్ద సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు సవాల్‌గా తీసుకున్నారు. నవంబర్ 20నుంచి రెస్క్యూ ఆపరేషన్‌లో దిగిపోయారు. అప్పటినుంచీ సొరంగంలో చిక్కుకు పోయిన 41 మంది కార్మికులను తన సొంత కొడుకుల కంటే మిన్నగా భావిస్తూ, నిరంతరం వారి క్షేమం కోసం పరితపించిన వ్యక్తి. అటు కార్మికులతో మాట్లాడుతూ, వారికి భరోసా ఇస్తూనే రక్షణ చర్యల్ని కొనసాగించారు. ఈ ఆపరేషన్ సక్సెస్ పై ‘17 రోజుల విరామం లేని శ్రమ, 400పైగా గంటలు, 41 మంది కార్మికులు’ ఎట్టకేలకు వారంతా మృత్యుంజయులుగా బైటపడ్డారు అంటూ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు. వినయంగా ఉండాలనే విషయం పర్వతం మాకు చెప్పింది: డిక్స్ భూగర్భ టన్నెలింగ్‌లో ప్రపంచంలోని ప్రముఖ నిపుణుడిగా పేరొందిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ భూగర్భ మరియు రవాణా రంగంలో ప్రత్యేకత ఆయన సొంతం. నిర్మాణ ప్రమాదాలు, సెక్యూరిటీ చర్యలు, వాస్తవ భద్రతా పనితీరు మొదలు, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారం వరకూ ఆయనకు ఆయనే సాటి. ఉత్తరకాశీ వద్ద సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే, డిక్స్ సిల్క్యారా టన్నెల్ సైట్లో తనిఖీ నిర్వహించి, సహాయక చర్యల్లో పాల్గొన్న ఏజెన్సీలతో చర్చించిన తరువాత కార్మికులను రక్షించడంపై భరోసా ఇచ్చారు. కార్మికులకు ఆహారం, నీళ్లు లాంటి అత్యవసర సాయాన్ని అందించారు. వాళ్లతో ఫోన్లతో మాట్లాడటం, వీడియోలతో కుటుంబ సభ్యులకు కూడా కాస్త ఊరట కలిగింది. అయితే క్రిస్మస్ నాటికి వారంతా బైటికి వచ్చే అవకాశం ఉందని తొలుత ప్రకటించారు. కానీ ఆయన అంచనా కంటే ముందుగానే వారిని రక్షించడం విశేషం. అమెరికా నుంచి తీసుకొచ్చిన ఆగర్ డ్రిల్లింగ్ మెషిన్ ఆపరేషన్ పగుళ్లతో దీనికి అంతరాయం ఏర్పడింది. ఆగర్ ఆపరేషన్‌ను పాజ్ చేశారు. అగర్ డ్రిల్లింగ్ మెషిన్ చివరి భాగం విరిగిపోవడంతో చివరికి ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా కార్మికులను రక్షించే ప్రక్రియ విజయంతంగా పూర్తి అయింది. రెస్క్యూ ఆపరేషన్ ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇంతకు ముందెప్పుడూ ఇలా చెప్పలేదు.మంచిగా అనిపిస్తోంది. పర్వతం పైభాగంలో డ్రిల్లింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందని మాన్యువల్ డ్రిల్లింగ్‌పై సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆనంద్ మహీంద్రా మంగళవారం డిక్స్ పై ప్రశంసలు The art of communication is essentially the art of storytelling. Our ancient culture has its roots in storytelling. But we need to revive & refine those skills. In the meantime, here’s an Australian giving us a master class…👏🏽👏🏽👏🏽 pic.twitter.com/QP4huuS78u — anand mahindra (@anandmahindra) November 28, 2023 మరిన్ని సంగతులు, అవార్డులు ♦2011లో, టన్నెలింగ్‌లో ప్రత్యేకించి టన్నెల్ ఫైర్ సేఫ్టీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అలాన్ నేలాండ్ ఆస్ట్రలేసియన్ టన్నెలింగ్ సొసైటీ ద్వి-వార్షిక అవార్డును అందుకున్నారు. ♦ డిక్స్ న్యాయవాది కూడా బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్స్లో సభ్యుడు. స్పెషలిస్ట్ అండర్ గ్రౌండ్ వర్క్స్ ఛాంబర్స్ సభ్యుడు, విక్టోరియన్ బార్ సభ్యుడు , టోక్యో సిటీ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ (టన్నెల్స్) విజిటింగ్ ప్రొఫెసర్. ♦ ఇంజనీరింగ్, జియాలజీ, లా రిస్క్ మేనేజ్మెంట్ విషయాల్లో మూడు దశాబ్దాలుగా బలమైన కరియర్ ♦ రిస్క్ అసెస్మెంట్ లేదా అంశానికి సంబంధించి చట్టపరమైన , సాంకేతిక పరిమాణాలను అంచనా వేయడంలో దిట్ట. ♦ లాయర్ కూడా కావడంతో లీగల్ అంశాలతోపాటు, పరిశోధకుడిగా, నిపుణుడుగా క్లిష్ట పరిస్థితి అంచనా వేయడంలో సమర్ధుడు. ♦ ముఖ్యంగా సొరంగాలలో ఫైర్ సేఫ్టీని పెంపొందించడంలో డిక్స్ సంచలనాత్మక విజయాలు సాధించారు. ♦ 2022లో అమెరికా నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కమిటీ సర్వీస్ అవార్డు -
ఆగిన టన్నెల్ తొలిచే పనులు...ప్రమాదంలో 40 మంది ప్రాణాలు!
ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లో టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న 40 మంది కార్మికులను కాపాడే రెస్క్యూ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. డ్రిల్లింగ్ మెషిన్ మళ్లీ మొరాయించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. టన్నెల్లోకి వెడెల్పైన స్టీల్ పైపులను పంపి చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారీ యంత్రంతో ఆరు రోజులుగా డ్రిల్లింగ్ చేస్తున్నారు. టన్నెల్ డ్రిల్లింగ్ చేస్తూ శుక్రవారం ఆగిపోయిన యంత్రం రెండోది కావడం గమనార్హం. గురువారం ఒక యంత్రం డ్రిల్లింగ్ చేస్తూ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అధికారులు మూడో యంత్రాన్ని ఇండోర్ నుంచి వాయు మార్గంలో తీసుకువస్తున్నారు. ఈ యంత్రం శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకోనున్నట్లు సమాచారం. కాగా, ఆదివారం(నవంబర్ 12) ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో చార్దామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 4 కిలోమీటర్ల టన్నెల్‌లోని ఓ భాగం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేస్తేన్న 40 మంది కార్మికులు టన్నెల్ కింద చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్, ఆహారపదార్థాలు, నీరు పంపిస్తున్నారు. ఇప్పటివరకు వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదీచదవండి..ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు : హర్యానా హై కోర్టు -
బిహార్ రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా
బిహార్ రైలు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్ర గాయలయ్యాయి. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. బిహార్‌లో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ బక్సర్ సమీపంలో పట్టాలు తప్పింది. 23 బోగీలున్న రైలులోని 21 బోగీలు పట్టాలు తప్పాయి. మూడు బోగీలు పల్టీలు కొట్టాయి. సమాచారం అందుకున్న రెస్యూ టీం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించింది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టాలపై నుంచి బోగీలను అధికారులు తొలగిస్తున్నారు. దెబ్బతిన్న ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు. మృతుల కుంటుంబాలకు రూ.10 లక్షల పరిహారం రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రైల్వేశాఖ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా బిహీర్ సీఎం నితీష్ కుమార్ కూడా మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించారు. చదవండి: కాంగ్రెస్ కీలక సమావేశం.. క్యాండీ క్రష్ ఆడుతూ ఛత్తీస్‌గఢ్ సీఎం రైలు ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ప్రమాదంపై దర్యాప్తు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. దెబ్బతిన్న పట్టాల పునరుద్ధరించే ప్రక్రియ పూర్తయ్యిందని పేర్కొన్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని కోచ్‌లను తనిఖీ చేసినట్లు చెప్పారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను కూడా పరిశీలిస్తామని, దీనిపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. A Terrible Train Accident Happened Near #Buxar In Bihar Last Night 🙏🙏. #TrainAccident #NorthEastExpress pic.twitter.com/wiOSDCr7si — Sai Mohan 'NTR' (@sai_mohan_9999) October 12, 2023 బక్సర్ నుంచి బయల్దేరిన అరగంటలోపే.. 12506 నెంబర్ గల నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆనంద్ విహార్ టర్మినల్ నుంచి బయలు దేరింది. చివరి స్టేషన్ కామాఖ్యకు చేరుకోవడానికి 33 గంటల ప్రయాణించాల్సి ఉంటుంది. బక్సర్ స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంట తర్వాత బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దాదాపు అన్నీ బోగీలు పట్టాలు తప్పాయి . పలు రైళ్ల రీషెడ్యూల్ నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఆ మార్గంలో ప్రయాణించే మొత్తం 40 రైలు ప్రభావితమయ్యాయి. 21 రైళ్లను దారిమళ్లీంచగా.. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఎలక్ట్రిక్ వైర్లు, పోల్స్, రైలు పట్టాలు ధ్వసం అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో సమాచారం, సాయం కోసం ప్రయాణికులకు రైల్వే అధికారులు అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. పాట్నా రైల్వే స్టేషన్- 9771449971 ధనాపూర్ రైల్వే స్టేషన్- 8905697493 అర జంక్షన్- 8306182542 కమర్షియల్- నార్త్ సెంట్రల్ రైల్వేస్- 7759070004 ప్రయాగ్‌రాజ్ 0532-2408128 0532-2407353 0532-2408149 కాన్పూర్ 0512-2323016 0512-2323018 0512-2323015 ఫతేపూర్ 05180-222026 05180-222025 05180-222436 తుండ్ల 05612-220338 05612-220339 05612-220337 ఇతావా 7525001249 అలీఘర్ 2409348 -
Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఏంటో చెప్పిన రైల్వే శాఖ
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ప్రమాదానికి సిగ్నల్ ఫెయిల్యూరే కారణమని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒడిశా రైలు ప్రమాదంపై ప్రాథమిక నివేదికను నిపుణుల బృందం రైల్వే శాఖకు అందించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్లోకి తప్పుగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ఈ నివేదికలో వెల్లడైంది. సిగ్నల్ ఫెయిల్యూర్ కారణంగానే ప్రమాదం చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ లభించకపోవడంతో ప్రమాదం జరిగిందని తేలింది. మొదట సిగ్నల్ ఇచ్చినా ఆ తరువాత దానిని ఆపేశారని, దీంతో కోరమండల్ రాంగ్ ట్రాక్‌పైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మెయిన్‌లైన్ బదులు లూప్లైన్లోకి వెళ్లడంతో.. లూప్లైన్లో ఉన్న గూడ్స్‌ను రైలును కోరమాండల్ ఢీకొట్టి పట్టాలు తప్పిందని నిపుణుల బృందం తేల్చింది. దీని బోగీలు పక్క ట్రాక్‌పైన పడగా.. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ వీటిని ఢీకొట్టింది. దీంతో ఈ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయని అని రైల్వే శాఖ తమ నివేదికలో వెల్లడించింది. కాగా శుక్రవారం ఒడిశా బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన పెను విషాదానికి కారణమైన విషయం తెలిసిందే. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ముగిసిన సహాయక చర్యలు : రైల్వే శాఖ ఒడిశా రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ప్రమాదం జరిగిన బాలాసోర్ మార్గంలో కవచ్ వ్యవస్థ లేదని ఆయన తెలిపారు. దాని వల్లే ప్రమాదం తీవ్రత అధికంగా మారిందని పేర్కొన్నారు. ఆ రూట్లో కవచ్ సిస్టమ్ లేదు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, ఇక రైల్వే లైన్ పునరుద్దరణ పనులు మొదలుపెడుతున్నామని, ప్రమాదం జరిగిన రూట్లో కవచ్ రక్షణ వ్యవస్థ లేదని తెలిపారు. కాగా రైలు ప్రమాదాలను నివారించేందుకు దేశవ్యాప్తంగా కవచ్ వ్యవస్థను భారత రైల్వేశాఖ డెవలప్ చేస్తోంది. కవచ్ అనేది ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. దీనిని మూడు భారతీయ సంస్థలతో కలిసి రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సమయానికి బ్రేక్ వేయడంలో డ్రైవర్ ఫెయిల్ అయితే కవచ్ సిస్టమర్ రైలు వేగాన్ని ఆటోమెటిక్‌గా నియంత్రిస్తుంది. Drone footage of #TrainAccident #CoromandelExpress pic.twitter.com/XCSnJJ0Tcg — Rail Vandi (@rail_vandi) June 3, 2023 Scary Visuals of Balasore Train Accident.. ☺️☺️ . .#TrainAccident #CoromandelExpress #CoromandelExpressAccident #BalasoreTrainAccident #tupaki #Odisha @tupakinews_ pic.twitter.com/mnfCCTqdhA — Tupaki (@tupakinews_) June 3, 2023 -
మూడు రైళ్లు...మహా విషాదం!
భువనేశ్వర్/బాలాసోర్/హౌరా/సాక్షి, అమరావతి: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఒకే చోటఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దారుణంలో కనీసం వంద మందికిపైగా దుర్మరణం పాలైనట్టు భావిస్తున్నారు. ఇప్పటిదాకా 70కి పైగా మృతదేహాలను వెలికి తీశారు. 350 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వందలాది మంది బోగీల్లో చిక్కుబడి ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కన్పిస్తోంది. సహాయక చర్యలకు పెను చీకటి అడ్డంకిగా మారింది. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మృతులు, క్షతగాత్రుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఉండొచ్చని చెబుతున్నారు. ఏం జరిగింది...? రాత్రి ఏడింటి ప్రాంతంలో బెంగుళూర్ నుంచి హౌరా వెళ్తున్న 12864 ఎక్స్‌ప్రెస్ బాలాసోర్ సమీపంలోని బహనాగా బజార్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దాని తాలూకు బోగీలను ఢీకొని షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పిందని, దాని బోగీలు మరో ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌పైకి దూసుకెళ్లాయని అంటున్నారు. కానీ వాస్తవానికి తొలుత ప్రమాదానికి గురైంది కోరమండల్ ఎక్స్ప్రెసేనన్నది ప్రత్యక్ష సాక్షుల కథనం. దానికి పొరపాటున లూప్ లైన్లోకి సిగ్నల్ ఇవ్వడంతో ఆ ట్రాక్‌పై నిలిచి ఉన్న గూడ్స్‌ను శరవేగంగా ఢీకొట్టిందన్నది వారు చెబుతున్నారు. ‘‘ప్రమాద ధాటికి కనీసం ఏకంగా 14 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పలు బోగీలు గూడ్స్ బోగీల్లోకి దూసుకెళ్లాయి. దాంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగి పరుగులు తీశారు. మరికొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. ఆ ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పింది’’ అని వారంటున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికారులు సరైన సమాచరం ఇవ్వకపోవడం, దాంతో సైట్లు, వార్తా సంస్థలు ఒక్కోటీ ఒకోలా రిపోర్టు చేయడం మరింత గందరగోళానికి దారితీసింది. హుటాహుటిన సహాయ చర్యలు ప్రమాద సమాచారం తెలియగా>నే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. కోచ్‌ల కింద చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. చీకటి వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెప్పారు. 132 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. మిగతా వారిని సొరో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, గోపాల్పూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, ఖొంటపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం కూడా రంగంలోకి దిగింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం ఆయన ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు. రైలు ప్రమాదంపై పరిస్థితిని తాను వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. రైల్వేస్టేషన్లు.. విజయవాడలో 0866 2576924, రాజమండ్రిలో 0883 2420541, రేణిగుంటలో 9949198414, తిరుపతిలో 7815915571, నెల్లూరులో 0861 2342028, సామర్లకోటలో 7780741268, ఒంగోలులో 7815909489, గూడూరులో 08624250795, ఏలూరులో 08812232267 నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 040 27788516 నంబర్‌ను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే హౌరాలో 033 2638227, ఖరగ్‌పూర్‌లో 8972073925, 9332392339, బాలాసోర్‌లో 8249591559, 7978418322, 858 5039521, షాలిమార్‌లో 9903370746, సంత్రాగచ్చిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీగా ప్రయాణికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రధాని మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు సాధ్యమైన సహాయం అందించనున్నట్లు c. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. రూ.10 లక్షల పరిహారం.. ప్రమాద బాధితులకు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పరిహారం ప్రకటించారు. మృతుల కు టుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. మాటలకందని విషాదం: వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఒడిశా రైలు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ‘‘ఇది మాటలకు అందని విషాదం. మృతుల కుటుంబాలకు దేవుడు ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి అందరూ కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగేలా అందరూ సహకరించాలని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు తోడుగా నిలవాలని ట్వీట్ చేశారు. రద్దయిన రైళ్లు ఇవే... 12837 హౌరా–పూరీ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12863 హౌరా–సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12839 హౌరా–చెన్నై మెయిల్ (02.06.2023); 12895 షాలిమార్–పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 20831 షాలిమార్–సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023); 22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్ 0(2.06.2023); 12074 భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12073 హౌరా–భువనేశ్వర్ జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12822 పూరీ–షాలిమార్ ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 2821 షాలిమార్ – పూరి ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12892 పూరి–బంగిరిపోసి (03.06.2023), 12891 బంగిరిపోసి–పూరి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్ (03.06.2023); 12842 చెన్నై–షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12509 ఎస్ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023). -
సూడాన్ టూ భారత్.. ఆనందంలో బాధితులు..
న్యూఢిల్లీ: సూడాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ‘ఆపరేషన్ కావేరి’ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో భారతీయులు స్వదేశం చేరుకున్నారు. కేంద్రం భారత వాయుసేన, నావికా దళాల ద్వారా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేరుస్తున్నది. కాగా, ఆపరేషన్ కావేరిలో భాగంగా సూడాన్ నుంచి దాదాపు ఆరువేల మంది భారతీయులు స్వదేశం చేరుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా భారతీయులను సూడాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌కు చేరుస్తున్నది. ఇప్పటికే పలువురు స్వదేశానికి వచ్చేయగా తాజాగా మరో 231 మంది వాయు మార్గంలో ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో భారత్ చేరుకున్న వారి సంఖ్య 6వేలకు చేరుకుంది. ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి వందకు పైగా మందిని తరలించే క్రమంలో తెగువ ప్రదర్శించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు. జెడ్డాకు చేరుకునే క్రమంలో పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు 121 మందితో కూడిన భారతీయ పౌరుల బృందం చేరుకోవాల్సి ఉంది. అయితే.. చేరుకునే మార్గం లేక వాడి సయ్యద్నా చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఏఐఎఫ్ రంగంలోకి దిగింది. వాళ్లను తరలించేందుకు C-130J హెర్క్యులస్‌తో బయల్దేరింది. అయితే.. వాడి సయ్యద్నాలో ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితి. దీంతో.. పైలట్లు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో ఏమాత్రం తప్పిదం లేకుండా ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ను చాకచక్యంగా ల్యాండ్ చేశారు. #WATCH | Another flight carrying 231 Indian passengers reaches New Delhi. They have been evacuated from conflict-torn Sudan.#OperationKaveri pic.twitter.com/oESNze3YPd — ANI (@ANI) April 29, 2023 ఇది కూడా చదవండి: సరిహద్దులో సాధారణ స్థిరత్వం: చైనా విదేశాంగ మంత్రి -
కొట్టుకువచ్చిన... 500కి పైగా భారీ తిమింగలాలు
న్యూజిలాండ్‌లోని మారమూల చతం దీవుల్లోకి దాదాపు 500పైగా చనిపోయిన తిమింగలాలు కొట్టుకు వచ్చాయి. ఐతే ఆ ప్రాంతంలో ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టలేమని మెరైన్ బృదం తెలిపింది. మొదటగా ఆ బీచ్‌లో 250 తిమింగలాలు కొట్టుకువచ్చాయని ఆ తర్వాత మూడు రోజులకు 240కి పైగా కొట్టుకువచ్చాయిని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో రెస్క్యూ చర్యలు చేపట్టడం చాలా కష్టం అని అధికారులు న్యూజిలాండ్ ప్రభుత్వ సాంకేతిక సలహదారుడు లండ్ క్విస్ట్కి చెప్పారు. ఆ బీచ్‌లో ఒకటి రెండు తిమంగలాలు ఉంటే పర్లేదు కానీ ఏకంగా వందల సంఖ్యలో కొట్టుకు వచ్చాయని అందువల్ల అసాధ్యం అని చెప్పారు. పైగా తిమంగలాలు భారీగా ఉంటాయి. అవి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పుడూ ఏ క్షణమైన పేలిపోవచ్చు అందవల్ల వాటిని అలానే వదిలేయాలని అధికారులు నిర్ణయించారు. అవి అలా సహజ సిద్ధంగా కుళ్లిపోవడమే మంచిదని అధికారులు నిర్ణయించారు. ఇలానే 1918లో సుమారు ఒక వెయ్యి తిమింగలాలు సాముహికంగా చనిపోయి కొట్టుకువచ్చినట్లు తెలిపారు. ఇలా ఆకస్మాత్తుగా వందల సంఖ్యలో తిమింగలాలు చనిపోయి ఎందుకు కొట్టుకు వస్తాయనేది తెలియడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అదీగాక అధికారిక గణాంకాల ప్రకారం న్యూజిలాండ్‌లో ఏడాదికి సుమారు 300 సముద్ర జీవులు సాముహికంగా చనిపోయి కొట్టుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: కిమ్ రూటే సెపరేట్: క్షిపణి ప్రయోగం చేసిన స్థావరంలోనే..) -
మంచు కొండచరియల బీభత్సం.. పర్వతారోహకులు మృతి!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మంచు కొండచరియలు విరిగిపడి బీభత్సం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 28 మంది పర్వతారోహకులు మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ద్రౌపది దండ-2 పర్వతంలో హిమపాతం కారణంగా నెహ్రూ పర్వతారోహణ సంస్థకు చెందిన 28 మంది ట్రైనీలు మంచులో చిక్కుకుని మృతిచెందినట్టు సమాచారం అందింది. జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది అని వెల్లడించారు. #Update | Rapid, relief and rescue operations are underway to rescue 28 trainee mountaineers trapped after an avalanche in Uttarakhand. pic.twitter.com/LOuU8iGaOR — NDTV (@ndtv) October 4, 2022 -
లంక గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు
-
Telangana: గోదావరి మహోగ్ర రూపం.. రంగంలోకి హెలికాప్టర్లు.. సైన్యం
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనంతగా మహోగ్ర రూపం దాల్చిన గోదావరి బారి నుంచి ప్రజ లను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన సైన్యాధికారులు 101 మంది బృందంతో కూడిన ప్రత్యేక దళాన్ని భద్రాచలం ముంపు ప్రాంతాల్లో సేవలందించేందుకు కేటాయించారు. దీంతో వారంతా హైదరాబాద్ నుంచి భద్రాచలం బయల్దేరి వెళ్లారు. సైన్యంతో పాటు ప్రత్యేకంగా హెలీకాప్టర్లను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం వరదలపై సమీక్ష సందర్భంగా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు హెలికాప్టర్లను ప్రజలను రక్షించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలకు వీలుగా సిద్ధం చేశారు. రబ్బర్ పడవలతో పాటు, రక్షణ పరికరాలు, లైఫ్ జాకెట్లను యుద్ధప్రాతిపదికన భద్రాచలానికి తరలిస్తున్నారు. రెస్క్యూ టీమ్‌లను కూడా రంగంలోకి దించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడానికి వీలైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇప్పటికే తరలించిన రక్షణ సామగ్రి సరిపోని పక్షంలో మరింత సామగ్రి పంపించాలని సూచించారు. చదవండి: (భద్రా‘జలం': క్షణక్షణం భయం భయం.. రంగంలోకి సైన్యం) 80 అడుగుల వరదొచ్చినా ఎదుర్కోవాలి వర్షాలు, వరదల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎస్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష, సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. వరద నీరు 80 అడుగులకు చేరినా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎస్ ఆదేశించారు. ముంపునకు గురయ్యే గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి ప్రత్యేక పునరావాస శిబిరాలకు తరలించాలని సూచించారు. శిబిరాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఐటీసీ భద్రాచలం వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపారు. చదవండి: (గోదావరి ఉధృతి.. పాత రికార్డులన్నీ బద్దలు..?!) పర్యవేక్షణ అధికారిగా సింగరేణి ఎండీ వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరామని ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎస్ తెలిపారు. ఈ మేరకు 68 మంది సభ్యులుగల ఇన్ఫాంట్రీ, 10 మంది సభ్యులుగల వైద్య బృందం, 23 మంది సభ్యులు గల ఇంజనీరింగ్ బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లాయని తెలిపారు. పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక పడవలను సిబ్బందితో సహా పంపామని చెప్పారు. అగ్నిమాపక విభాగానికి చెందిన 7 బోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది ఈతగాళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నారని వివరించారు. ఈ జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి, సింగరేణి కాలరీల ఎండీ ఎం.శ్రీధర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించామని తెలిపారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్‌లను భద్రాచలం, కొత్తగూడెం పట్టణాల్లో ఉంచితే..వరద సహాయక చర్యలు సమర్ధవంతంగా చేపట్టేందుకు అవకాశముందని మంత్రి పువ్వాడ చెప్పారు. -
కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి, 45 మంది గల్లంతు
ఇంపాల్: మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో ఉంది. దీని రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంప్‌ని ఏర్పాటు చేశారు. కాగా బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ బేస్ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, 45 మంది ఆచూకీ గల్లంతైంది. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటివరకు 19 మందిని రక్షించారు. ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. #WATCH | NDRF, SDRF, State Government and Railways workers involved in rescue work at the landslide-hit Tupul station building in Noney, Manipur (Video credit: CPRO, NF Railway) pic.twitter.com/N7zo2pLaY7 — ANI (@ANI) June 30, 2022 చదవండి: ఔరంగాబాద్ పేరు మార్పు తప్పుడు నిర్ణయం: ఏఐఎంఐఎం -
అయ్యా ఎమ్మెల్యే సారూ అదేం పని.. వీడియో వైరల్
భారీ వర్షాల కారణంగా అసోం అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా అసోం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కాగా, వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. ఆయన చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? వివరాల ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్యే బిసు మిశ్రా గురువారం వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో వరద నీరు ఎక్కువగా ఉండటంతో ఆయనకు నడవడం సాధ్యపడలేదు. దీంతో, ఎమ్మెల్యే మిశ్రా.. అక్కడే ఉన్న రెస్క్యూ టీమ్ సభ్యుడిని పిలిచారు. అనంతరం రెస్క్యూ టీమ్ సభ్యుడి వీపుపై ఎక్కి, ఎమ్మెల్యే పడవ వరకూ వెళ్లి అందులో నిల్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఎమ్మెల్యే అలా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వర్షాల కారణంగా అసోంలో నాలుగు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. #WATCH | Assam: BJP MLA from Lumding Assembly, Sibu Misra was seen taking a piggyback ride to a boat, on the back of a flood rescue worker yesterday, May 18th. He was in Hojai to review the flood situation in the area. pic.twitter.com/Rq0mJ8msxt — ANI (@ANI) May 19, 2022 ఇది కూడా చదవండి: బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత -
అంతులేని నిర్లక్ష్యం: తీరని విషాదం!
-
కుప్పకూలిన మూడు భవనాలు
కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో శనివారం వేకువజామున మూడు భవనాలు కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ పసికందు సహా ఆరుగురు సజీవ సమాధి అయ్యారు. మరో నలుగురు ఆస్పత్రి పాలవగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో సైదున్నీసా (2), ఫారున్నీసా (8 నెలలు), యాషికా(3)తోపాటు ఫైరోజా (65), భాను (30), ఫాతిమాబీ (65) ఉన్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో జిలాన్ అనే వ్యక్తి తన పాత భవనంపై ఎటువంటి పిల్లర్లు వేయకుండా మరో రెండంతస్తుల నిర్మాణం చేపట్టారు. పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఆ భవనంలోని కింది భాగం పాత నిర్మాణం కావడంతో కొత్తగా నిర్మించిన రెండంతస్తుల బరువును మోయలేక శనివారం వేకువజామున 3 గంటల సమయంలో కుప్పకూలింది. దాని శిథిలాలు పక్కనే ఉన్న మరో రెండంతస్తుల భవనంతో పాటు ఆ పక్కనే ఉన్న ఇంకో భవనంపైనా పడటంతో అవి కూడా నేలమట్టమయ్యాయి. నిర్మాణంలో ఉన్న భవనంలోని కింది పోర్షన్లో నిద్రిస్తున్న ఇంటి యజమాని జిలాన్ తల్లి ఫైరోజా (65), పక్క భవనంలోని మొదటి అంతస్తులో నిద్రిస్తున్న టీవీ చానల్ విలేకరి సోమశేఖర్ సతీమణి భాను (30), వీరి మూడేళ్ల చిన్నారి యాషికా, అత్త ఫాతిమాబీ (65) శిథిలాల కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోమశేఖర్ ఇంటి కింది పోర్షన్లో కాపురముంటున్న వంట మాస్టర్ రాజు, కదిరి మండలం రామదాసు నాయక్ తండాకు చెందిన ఉదయ్ నాయక్, మీటేనాయక్ తండాకు చెందిన గౌతమ్ నాయక్, చిగురుమాను తండాకు చెందిన డిప్లొమా విద్యార్థి తరుణ్ నాయక్ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరంతా ఓ మూలన ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు. తరుణ్ నాయక్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీస్, రెవెన్యూ, మునిసిపల్, అగ్నిమాపక, 108 సిబ్బంది వారిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అయితే పక్కనే ఉన్న మరో ఇంటిపైనా భవన శిథిలాలు పడటంతో ఆ ఇల్లు కూడా కూలింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న హబీబుల్లా, కలీమున్నీసా, హిదయతుల్లా, దంపతులు కరీముల్లా, హబీబున్నీసా బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు. కరీముల్లా దంపతుల రెండేళ్ల చిన్నారి సైదున్నీసా, 8 నెలల చిన్నారి ఫారున్నీసా శిథిలాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో వంట మాస్టర్ రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి ఉదయం నుంచీ అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని వారికి ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. -
బాలుడిని రక్షించబోయి ప్రమాదంలో గ్రామస్తులు, నలుగురు దుర్మరణం
భోపాల్: బావిలో పడిపోయిన బాలుడిని కాపాడటానికి ప్రయత్నించిన గ్రామస్తులు అనూహ్యంగా ప్రమాదంలో పడిపోయిన ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. బాలుడిని రక్షించే ప్రయత్నంలో ఒకేసారి అక్కడికి చేరడంతో అధిక బరువుతో గోడ కూలి బావిలో పడిపోయారు. ఈ ఘటనలో దాదాపు 30 మంది ప్రమాదంలో చిక్కుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్, విదిష పట్టణానికి సమీపంలో గంజ్‌బసోడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్నఎన్‌డీఆర్‌ఆఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలును చేపట్టాయి. ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన వ్యక్తుల బరువు కారణంగా బావి పైకప్పు కూలిపోయిందని అధికారులు తెలిపారు. వీరిలో 19 మందిని సిబ్బంది కాపాడారు. ఇంకా బావిలోనే చిక్కుకున్న మిగిలిన వారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మరణించిన వారి కుటుంబాలకు సీఎం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంతోపాటు, ఉచిత వైద్య చికిత్స కూడా అందించనున్నామని వెల్లడించారు. అలాగే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు మంత్రి విశ్వాస్ సారంగ్, సహాయ, రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. MP: 4 bodies recovered from the spot so far in Ganjbasoda area of Vidisha. CM SS Chouhan announces an ex-gratia of Rs 5 Lakhs each for the next of the kin of the deceased & compensation of Rs 50,000 each to the injured. The injured will also be provided free medical treatment. pic.twitter.com/PgBs2hzFJB — ANI (@ANI) July 16, 2021 -
బంగారు గనిలో బ్లాస్ట్: మరో 15 రోజులు పట్టొచ్చు!
బీజింగ్: చైనాలోని బంగారు గనిలో చిక్కుకున్న వర్కర్లను వెలికితీసేందుకు మరో 15 రోజులు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వీరు ఇందులో చిక్కుకుపోయి 11 రోజులవుతోంది. తూర్పు చైనాలోని బంగారు గనిలో జరిగిన పేలుడుతో గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మన్ను పేరుకుపోయింది. దీంతో ఈ మట్టిని తవ్వుకుంటూ పోతే తప్ప గనిలో వారిని బయటకు తీసే అవకాశం లేదు. ఇప్పటికే పేలుడు సమయంలో గాయాలతో ఒక వర్కర్ మరణించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. గనిలో ఇంకా 21 మంది ఉన్నారు. వీరిలో 11 మందితో సంబంధాలు పునరుద్ధరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంకో పదిమంది ఆచూకి తెలియరాలేదు. ఆ 11మందికి ఇతర మార్గాల ద్వారా ఆహారం, మెడిసిన్స్ అందిస్తున్నామని, మరోవైపు తవ్వకం చురుగ్గా సాగుతోందని ప్రభుత్వం తెలిపింది. గనిలో పేలుడుకు కారణాలు బహిర్గతం కాలేదు. చైనాలో మైనింగ్ పరిశ్రమలో ఏటా దాదాపు 5వేల మంది మరణిస్తుంటారు. -
ఇండియాలో తొలిసారి కాపాడే మహిళా దళాలు
‘రెస్క్యూ ఆపరేషన్’ అనే మాట వినే ఉంటారు. విపత్తులలో.. విలయాలలో.. వైపరీత్యాలలో.. ప్రాణాలకు తెగించడం. ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడటం. ఈ పనిలో ఇప్పటివరకు పురుషులే ఉన్నారు. ఇకపై మహిళలూ రెస్క్యూలోకి దిగబోతున్నారు! తొలి బ్యాచ్‌లో 100 మహిళలు శిక్షణ పొంది ‘ఏ క్షణానికైనా’ సిద్ధంగా ఉన్నారు. ఆపదలో ఆదుకునేవాళ్లను ఆపద్బాంధవులు అంటారు. మన దేశానికి అధికారిక ఆపద్బాంధవి.. ‘జాతీయ విపత్తు రక్షణ దళం’. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్.డి.ఆర్.ఎఫ్.) ఈ జాతీయ దళం పేరుకు ఆపద్బాంధవి అయినప్పటికీ ఇందులో ఇంతవరకు మరీ చిన్నస్థాయిలో తప్ప ప్రత్యక్షంగా ప్రాణాలు కాపాడే ‘డిజాస్టర్ కంబాట్’లో మహిళా సిబ్బంది లేరు. ‘రెస్క్యూ ఆపరేషన్లోకి మహిళల్ని తీసుకుని రిస్క్ చెయ్యలేం’ అనేవాళ్లు అధికారులు. ‘‘ఇది ‘హై–ప్రెషర్’ జాబ్, మగవాళ్లు మాత్రమే చేయగలరు’ అని కూడా! నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లను హెలికాప్టర్ల నుంచి పైకి లాగడమే కాదు, కొన్నిసార్లు నడుముకు కట్టుకుని కూడా ఒడ్డుకు చేర్చవలసి ఉంటుంది. అదుపుతప్పి వ్యాపిస్తున్న మంటలను దారికి తేవడమే కాదు, కొన్నిసార్లు మంటల్లో చిక్కుకున్న వాళ్ల కోసం ఆ మంటల్లోకే వెళ్లవలసి ఉంటుంది. భూకంపాలప్పుడు శిథిలాల కింద ఉన్నవారిని కనిపెట్టడమే కాదు, సమయం మించిపోక ముందే ప్రాణాలతో వారిని బయటికి తేవాలి. ఇంకా.. రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిని స్ట్రెచర్ల మీదే కాదు, అవసరం అయితే భుజాలపై మోసుకుని కూడా అంబులెన్స్‌లోకి ఎక్కించవలసి ఉంటుంది. ప్రతి క్షణమూ విలువైనదే కనుక ప్రతి ప్రయత్నమూ బలమైనదే కావాలి. ఆ బలం మహిళలకు ఉండదు అనుకునేవారు. అయితే ఆ ఆలోచనా ధోరణి మారింది. ఎన్.డి.ఆర్.ఎఫ్. తన బలం పెరగాలంటే రెస్క్యూ టీమ్‌లలో మహిళలు తప్పనిసరిగా ఉండాలని భావిస్తోంది. ఫలితమే ‘జాతీయ విపత్తు రక్షణ దళం’లోకి మహిళల చరిత్రాత్మక రంగ ప్రవేశం. ∙∙ తొలిసారి శిక్షణ పొంది వచ్చిన ఈ వంద మంది మహిళా బృందాన్ని ఉత్తరప్రదేశ్‌లోని గర్హ్ ముక్తేశ్వర్ పట్టణంలో గంగానది పొడవున గస్తీ విధుల్లో నియమించారు. ఆపద నుంచి కాపాడే పడవల్ని నడపడం, అవసరమైతే అప్పటికప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినవారిని గాలించి ఆ పడవల్లో ఒడ్డుకు చేర్చడం వంటివన్నీ వారు విజయవంతంగా పూర్తి చేసిన శిక్షణ లో భాగమే. వీళ్లు కాక మరో వందమందికి పైగా మహిళలకు ఎన్.డి.ఆర్.ఎఫ్. డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్.ప్రధాన్ శిక్షణ ఇప్పించబోతున్నారు. ఈ మొత్తం 200 మందీ ఇన్స్పెక్టర్లుగా, సబ్ ఇన్స్పెక్టర్లుగా, కానిస్టేబుళ్లుగా తమ విధులు నిర్వర్తిస్తారు. నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యిమంది సిబ్బందిలో 108 మంది మహిళల్ని మాత్రమే చేర్చుకునేందుకు తనకున్న అధికారం మేరకే ఈ నియామకాలు చేపట్టగలిగారు ఎన్.డి.ఆర్.ఎఫ్. డీజీ. లేకుంటే ఇంకా ఎక్కువమందినే తీసుకునేవారు. ‘‘మహిళలు రెస్క్యూ టీమ్‌లో ఉండటం వల్ల ప్రత్యేకమైన ఆపత్సమయ ప్రయోజనాలు ఉన్నాయి. మహిళల్ని కాపాడేందుకు మహిళలే చొరవ చూపగలరు. ఇంకా ప్రత్యేకమైన సందర్భాలలో మహిళల్ని మహిళలే ఆదుకోవడం అవసరమౌతుంది కూడా’’ అని ప్రధాన్ అంటున్నారు. ‘‘మహిళా బృందం, పురుష బృందం రెండూ ప్రధానమే. అయితే స్త్రీ, పురుషులు కలిసి ఉండే బృందాన్ని ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపుతున్నాం. ప్రాణాల్ని రక్షించేటప్పుడు స్త్రీ పురుషులిద్దరూ కలిసి పని చేయడం వల్ల తక్షణ ఫలితాలు ఉంటాయి’’ అంటారు ప్రధాన్. -
బోరుబావిలో పడిపోయిన బాలుడు
సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బోరుబావి ప్రమాదం కలకలం రేపుతోంది. మహోబా జిల్లాలోని ఒక గ్రామంలో నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. దీంతో తీవ్ర ఆందోళనలో పడిపోయిన బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ దళాలు, ఆరోగ్య, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బావిలోకి ఆక్సిజన్‌ను అందిస్తూ అధికారులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ధనేంద్ర ఆడుకుంటూ సుమారు 25-30 అడుగుల లోతైన బోర్‌బావిలో పడిపోయాడని పోలీసు అధికారి అనుప్ కుమార్ దుబే చెప్పారు. సంఘటన జరిగిన సమయంలో బాలుని తల్లిదండ్రులు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారని తెలిపారు. బాలుడుని కాపాడేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, లక్నో నుంచి జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలను రంగంలోకి దింపామని మహోబా జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్ర కుమార్ తెలిపారు. -
టర్కీలో భారీ భూకంపం
ఎలాజిగ్: తూర్పు టర్కీని భారీ భూకంపం వణికించింది. ఎలాజిగ్, మలాట్యా ప్రావిన్స్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం ధాటికి 22 మంది మృతిచెందగా.. 1,015 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సివ్రిస్ నగరంలో చిన్న సరస్సు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. తొలుత సివ్రిస్లో భూమి కంపించిందని టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు నేలకూలాయి. ఘటనా స్థలాలకు చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఎలాజిగ్‌లో శిథిలాల్లో చిక్కుకున్న 39 మందిని సురక్షితంగా కాపాడామని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు వెల్లడించారు. టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దాదాపు 2 వేల మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భూకంప బాధితుల కోసం మలాట్యాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు. -
‘సుజిత్’ కోసం తమిళనాడు ప్రార్థనలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో బోరు బావిలో పడ్డ రెండేళ్ల సుజిత్‌ను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నాడుకాట్టుపట్టికి చెందిన ప్రిట్లో ఆరోగ్యరాజ్ (40), కళామేరీ (35) దంపతులు, వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఆరోగ్యరాజ్‌కు సొంతిల్లు, సమీపంలోనే వ్యవసాయ భూమి ఉంది. సాగునీరు కోసం ఐదేళ్ల క్రితం 500 అడుగుల లోతులో బోరుబావి తవి్వంచాడు. అయితే అందులో నీరు పడకపోవడంతో దాన్ని పూడ్చకుండా అలానే వదిలేసి ప్లాస్టిక్మూత పెట్టాడు. ఇదిలా ఉండగా, ఈనెల 25వ తేదీ సాయంత్రం 5.45 గంటల సమయంలో చిన్నకుమారుడు రెండేళ్ల సుజిత్ విల్సన్ ఇంటికి సమీపంలోని పెదనాన్న ఇంటికి నడుచుకుంటూ వెళుతూ ప్లాస్టిక్ మూతపై కాలువేశాడు. ఈ మూత విరిగిపోగా బోరుబావిలోకి బాలుడు జారిపోయాడు. సుజిత్ ఏడుపులు విని తల్లి కళామేరీ, ఇరుగుపొరుగూ వచ్చి గుండెలుబాదుకుంటూ రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. నాలుగు ప్రొక్లయిన్లు రప్పించి, చిన్నపాటి అత్యాధునిక సీసీ కెమెరాలను బోరుబావిలోకి దించి బాలుడు 22 అడుగుల లోతులో ప్రాణాలతో వేలాడుతున్నట్లు గుర్తించారు. కెమెరాలను ఒక ల్యాప్‌టాప్‌తో అనుసంధానం చేసి దానిలోని దృశ్యాలతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రక్షింపు చర్యల్లో భాగంగా బోరుబావికి సమీపంలో సమాంతరంగా 15 అడుగుల లోతులోకి మట్టిని తవ్వుతున్నపుడు వచ్చిన ప్రకంపనలకు సుజిత్ మరింత లోతులోకి జారిపోయాడు. దీంతో రాత్రి 9 గంటలకు తవ్వకాల పనులను నిలిపివేశారు. బాలుని చేతికి తాడును చుట్టి పైకిలాగేందుకు ప్రయత్నాలు సాగించారు. మరోవైపు తల్లి కళామేరీ శనివారం తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో బోరుబావి వద్ద కూర్చుని బిడ్డను పలుకరించగా ‘అప్పా’ (నాన్నా) అనడం పైనున్నవారికి వినిపించింది. ఆ తరువాత బాలుడు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరికొద్దిసేపటి తరువాత బాలుడిపై మట్టిపడడం ప్రారంభమైంది. అరక్కోణం నుంచి 20 మందితో కూడిన ప్రకృతి వైపరీత్యాల రక్షణ చర్యల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. నిన్న మధ్యాహ్నం వరకు బాలుడు శ్వాసతీసుకోవడం గమనించారు. అయితే శనివారం సాయంత్రానికి 70 అడుగుల లోతులోకి జారిపోగా శ్వాస వినిపించడం నిలిచిపోయింది. రాత్రి 7 గంటల సమయానికి బాలుడు వంద అడుగుల్లోకి వెళ్లిపోయాడు. బిడ్డ ఎప్పుడు బయటపడినా చికిత్స అందించేందుకు అంబులెన్స్‌తో వైద్య బృందం సిద్ధంగా ఉంది. స్పృహతప్పిన తల్లి: బోరుబావికి సమీపంలో కూర్చుని కన్నబిడ్డ గురించి కన్నీళ్ల పర్యంతమైంది. బిడ్డ ఏడుపు వినిపించినపుడు ‘ ఏడవకు నాన్నా ఏడవకు, ఇదిగో ఎత్తుకుంటాను’ అంటాను అంటూ ఊరడించడం అందరి హృదయాలను కలచివేసింది. బిడ్డ కోసం 24 గంటలకు పైగా కన్నీటి పర్యంతం అవుతున్న తల్లి కళామేరీ ఆ బాధను తట్టుకోలేక స్పృహ తప్పింది. సమీపంలోని వైద్యులు వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి తరలించి గ్లూకోజ్ ఎక్కించారు. శనివారం రాత్రి 8.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం సహాయక బృందానికి బాలుడు అందుబాటులోకి రాలేదు. సేవ్ సుజిత్ అంటూ ప్రార్థనలు.. బోరుబావిలో బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడం రాష్ట్ర ప్రజలను కలచివేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఒకవైపు దీపావళి పండుగలో నిమగ్నమై ఉంటూనే సేవ్ సుజిత్ అంటూ ప్రార్థనలు చేయసాగారు. టీవీలు, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బాలుడి క్షేమ సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. సుజిల్ సురక్షితంగా బయటపడాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, మంత్రులు, సామాజిక కార్యకర్తలు, మదురైలో పలువురు దివ్యాంగులు శనివారం సాయంత్రం ప్రార్థనలు చేశారు. అలక్ష్యానికి అద్దం: నటుడు వివేక్ బోరుబావిలో బాలుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడడం అలక్ష్యం, అజాగ్రత్తలకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్య సమాజ పోకడల కారణంగానే వినియోగంలో లేని బోరుబావులు దర్శనమిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రమాదపరిస్థితులు సంభవించినపుడు వెంటనే రక్షణ చర్యలు చేపట్టేందుకు అత్యాధునిక పరికరాలను కనుగొనాలని ఆయన సూచించారు. -
ఇది వారికి జీవన్మరణ సమస్య : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మేఘాలయాలోని ఓ బొగ్గు గనిలో గల్లంతైన 15 మంది కార్మికులను కాపాడటానికి జరుగుతన్న సహాయక చర్యలపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికులను కాపాడే విషయంలో ఆదిత్య ఎన్ ప్రసాద్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. కార్మికులను కాపాడటానికి ఆర్మీ సహాయం ఎందుకు తీసుకోలేదని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం మేఘాలయా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కార్మికులను కాపాడే విషయంలో ప్రతి క్షణం విలువైనదని.. ఇది వారికి జీవన్మరణ సమస్య అని ధర్మాసనం అభిప్రాయపడింది. గల్లంతైన వారిని బయటకు తీసుకురావడానికి విస్తృత చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంపై దృష్టి సారించాలని సోలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతాను కోరిన ధర్మాసనం.. కార్మికులను కాపాడటానికి ఏ రకమైన చర్యలు తీసుకున్నారో శుక్రవారం కోర్టుకు తెలియజేయాలని చెప్పింది. కార్మికులను కాపాడటానికి తీసుకున్న చర్యలు ఇంతవరకు ఎందుకు సఫలీకృతం కాలేదని మేఘాలయా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన మేఘాలయా తరఫు న్యాయవాది ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోల్ ఇండియా అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారని కోర్టుకు తెలిపారు. అయినా ఆ వివరణతో కోర్టు సంతృప్తి చెందలేదు. మేఘాలయలోని ఈస్ట్ జైంతా హిల్స్ జిల్లా లూమ్‌థారీ ప్రాంతంలోని ఓ అక్రమగనిలో డిసెంబర్ 13న ఈ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బొగ్గును వెలికితీస్తున్న క్రమంలో పక్కనే ఉన్న లైటైన్ నదీ ప్రవాహం గనిలోకి పోటెత్తింది. ఈ ఘటనలో 15 మంది లోపలే చిక్కుకోగా, ఐదుగురు మాత్రం ప్రవాహానికి ఎదురొడ్డి బయటపడగలిగారు. ప్రమాదం జరిగి 22 రోజులు కావస్తున్న గనిలో కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
గని కార్మికుల గాలింపునకు విశాఖ నేవీ ఈతగాళ్లు
షిల్లాంగ్: మేఘాలయలోని ఓ అక్రమ బొగ్గు గనిలో గల్లంతైన 15 మంది కార్మికుల జాడ కనుక్కునేందుకు నేవీ గజ ఈతగాళ్లు రంగంలోకి దిగనున్నారు. పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని లుంథారి గ్రామం సమీపంలోని గనిలోకి ఈ నెల 13వ తేదీన నది వరద ప్రవేశించడంతో కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వీరి జాడ కనిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విశాఖలోని నేవీ విభాగానికి చెందిన 15 మంది గజ ఈతగాళ్ల బృందం శనివారం ఆ ప్రాంతానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. వీరి వద్ద అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, సహాయ చర్యలపై నేవీ అధికారులు సమీక్ష జరిపారని వివరించారు. ఇదిలా ఉండగా, 37 అడుగుల లోతైన గని నుంచి నీటిని తోడి వేసేందుకు కిర్లోస్కర్ కంపెనీకి చెందిన 18 అతి శక్తివంతమైన మోటార్లను అక్కడికి పంపే ఏర్పాట్లుచేస్తున్నారు. దీంతోపాటు ఒడిశా అగ్ని మాపక శాఖకు చెందిన 20 మంది సభ్యులతో కూడిన రక్షక బృందం అత్యాధునిక పరికరాలతో ప్రయత్నిస్తోంది. -
మేఘాలయా గనిలో చిక్కుకున్న కార్మికులు
-
విమాన ప్రమాదం : ఆరు మృతదేహాలు లభ్యం
జకార్తా : ఇండోనేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి గంటలు గడిచిన నేపథ్యంలో... ఎవరూ బతికుండే అవకాశం లేదని అధికారులు ప్రకటించారు. సముద్రంలో విమాన శకలాలతోపాటు కొన్ని శరీర భాగాలను కూడా గుర్తించినట్టు తెలిపారు. జావా సముద్రంలో రెస్క్యూ టీమ్స్ ఎమర్జెన్సీ బోట్లతో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. విమానం మెయిన్‌బాడీ కూలిన చోటు కోసం గాలిస్తున్నాయి. బ్లాక్‌బాక్సులు స్వాధీనం చేసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. సాంకేతిక లోపం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోడానికి కొన్ని క్షణాల ముందు.. వెనక్కి వచ్చేయాలని పైలట్‌కు కమాండ్ ఇచ్చినట్టు జకార్తా ఎయిర్పోర్ట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదానికి గురైన JT 610 విమానానికి గత ప్రయాణంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు తెలిసింది. సముద్రంలో కుప్పకూలిన సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 189మంది ఉన్నారు. అపార అనుభవం ఉన్నా.. ఇండోనేషియాలో ఘోర ప్రమాదానికి గురైన విమానానికి ఢిల్లీకి చెందిన వ్యక్తి పైలట్‌గా వ్యవహరించారు. ఫ్లైట్ కెప్టెన్ భవ్యే సునేజా ఈ ప్రమాదంలో మరణించినట్టు జకార్తాలోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది. సునేజా మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. భవ్యే సునేజా అపార అనుభవం కలిగిన పైలట్ అని లయన్ ఎయిర్ పేర్కొంది. కాగా సునేజా మరణించారని అధికారులు ప్రకటించడంతో.. ఢిల్లీలోని అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన భవ్యే సునేజా 2011లో లయన్ ఎయిర్ సంస్థలో చేరారు. -
ఇదేం నిర్వాకం బాబూ?!
తిత్లీ తుపాను పొరుగునున్న ఒరిస్సాతోపాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంపై విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించి అప్పుడే వారం కావస్తోంది. గత బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ 165 కిలోమీటర్ల పెను వేగంతో తన ప్రతాపం చూపిన ఆ మహమ్మారి ధాటికి జిల్లా మొత్తం చిగురాటాకులా వణికింది. అక్కడి ప్రజలంతా దాదాపు 12 గంటలపాటు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని క్షణమొక యుగంగా గడిపారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. లక్షల హెక్టార్లలో పంటలన్నీ నీట మునిగాయి. కొబ్బరి, జీడి తోటలు తుడిచిపెట్టుకుపోయి పెను నష్టం వాటిల్లింది. జిల్లాలో సగటున 77 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందంటే తుపాను తీవ్రత ఎంతటిదో తెలుస్తుంది. దాదాపు 10 లక్షల మంది ప్రజలు ఈ తుపానులో చిక్కుకున్నారు. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. విరుచుకుపడ బోయే విపత్తు తీవ్రత ఎంతటిదో, దానివల్ల ఏ ఏ ప్రాంతాలు దెబ్బతినే ప్రమాదముందో అంచనా వేసుకుని, ముందస్తు చర్యలు తీసుకోవడం మాత్రమే ఏ ప్రభుత్వమైనా చేయగలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించటం, సహాయ బృందాలను హుటాహుటీన రంగంలోకి దించి ఆపదలో చిక్కుకున్నవారిని కాపాడటం వంటివి చేస్తే ప్రాణనష్టం కనిష్ట స్థాయిలో ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మంచినీరు, పాలు, కూరగాయలు, ఇతర నిత్యా వసరాలు వగైరాలకు కొరత లేకుండా చూడాలి. ముఖ్యంగా సంక్షోభాన్ని ఆసరా చేసుకుని జనాన్ని నిలువుదోపిడీ చేయడానికి తయారయ్యేవారిపై కన్నేసి ఉంచాలి. ఎక్కడెక్కడ నష్టం వాటిల్లిందో, తక్షణ సాయం అందించాల్సిన ప్రాంతాలేవో లెక్కలేసి అవసరమైన సిబ్బందిని, సామగ్రిని తర లించాలి. కానీ శ్రీకాకుళం జిల్లాలో వారం గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా దొరక్క కష్టాలు పడుతున్న ప్రజానీకాన్ని చూస్తుంటే, వారు చెబుతున్న కన్నీటి గాథలు వింటుంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నదా అనే అనుమానం కలుగుతుంది. ఒకపక్క తాను ప్రకృతినే హ్యాండిల్ చేశానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వోత్కర్షకు పోతున్నారు. వాస్తవంలో మాత్రం తుపానులో చిక్కుకున్న లక్షలమంది ప్రజలు ఆరురోజులుగా అష్టకష్టాలూ పడుతున్నారు. తమను పరామర్శించడానికొచ్చిన మంత్రులను, తెలుగుదేశం నేత లను ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు చెవులకు వినబడటం లేదో లేక ఆయన వినదల్చుకోలేదో తెలియదు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పూండిలో మంత్రి కొల్లు రవీంద్ర కాన్వాయ్‌ని స్థానికులు చుట్టుముట్టారు. అయిదురోజుల నుంచి గుక్కెడు నీళ్లు లేక, తినడానికేమీ దొరక్క అలమటిస్తుంటే తీరిగ్గా ఇప్పుడొస్తారా అని ప్రజలు ఆగ్రహించారు. నానా అగచాట్లూ పడుతున్నామని చంటిపిల్లల తల్లులు, వృద్ధులు చెప్పారు. రహదారులపై పడిన చెట్లను తామే తొలగించుకోవాల్సి వచ్చిందని, ఇన్ని రోజులుగా అధికారులు లేదా ప్రజా ప్రతినిధుల జాడే లేదని నిలదీస్తున్న ప్రజలకు పోలీసు లను చూపించి బెదిరించడం మినహా వారు తగిన జవాబివ్వలేకపోయారు. హుద్‌హుద్ తుపాను సమయంలో చంద్రబాబు ఎన్ని గొప్పలు పోయారో అందరికీ గుర్తుంది. సరిగ్గా నాలుగేళ్లక్రితం ఇదే నెలలో హుద్‌హుద్ విరుచుకుపడినప్పుడు ఆయన అయిదు రోజులు అక్కడే మకాం వేశారు. తనతోపాటు మంత్రుల్ని, ఉన్నతాధికార గణాన్ని మోహరించారు. వీరంతా కలిసి అక్కడ జరిగే సహాయ, పునరావాస కార్యక్రమాలకు అడ్డు తగులుతూ హంగామా సృష్టిం చడం తప్ప చేసిందేమీ లేదు. వార్డులవారీగా మంత్రులనూ, ఉన్నతాధికారులనూ ఇన్చార్జిలుగా నియమించి సర్వం కదిలించేస్తున్నట్టు, అన్నీ బ్రహ్మాండంగా అమలవుతున్నట్టు మీడియాలో ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు జరుపుతూ హడావుడి చేశారు. కానీ తమకు కనీసావసరాలుకూడా అందుబాటులో లేవని బాధితులు ఆవేదన చెందారు. అప్పుడు మాత్రమే కాదు...ఆ తర్వాత కూడా చంద్రబాబు సర్కారు చేసిందేమీ లేదు. నాలుగేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆ ప్రాంతంలో దేన్నీ సరిగా పునరుద్ధరించలేకపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతినగా, 10,000 ఇళ్లు నిర్మిస్తామని అప్పట్లో బాబు హామీ ఇచ్చారు. ఇప్పటికి అతి కష్టం మీద 3,000 ఇళ్లు పూర్తిచేశామనిపించారు. రోడ్లు సైతం నాలుగేళ్ల తర్వాత కూడా అధ్వా న్నంగానే ఉన్నాయి. ప్రభుత్వ నిర్వాకాన్ని చూపడానికి ఎక్కడో మారుమూలకు వెళ్లనవసరం లేదు. విశాఖ నగరంలోనే అనేక ప్రభుత్వ భవనాలు ఇప్పటికీ శిథిలావస్థలోనే ఉన్నాయి. వీటిని పునరు ద్ధరించాలన్న స్పృహే కొరవడింది. పంటనష్టానికి, పశు నష్టానికి పరిహారం ఊసేలేదు. బంగాళాఖాతం తరచుగా అల్లకల్లోలం కావటం, వాయుగుండాలు, తుపానులు ఏర్పడటం ఆంధ్రప్రదేశ్‌కు కొత్తేమీ కాదు. అటువంటి సమయాల్లో తీరప్రాంతం అతలాకుతలమవుతోంది. జనావాసాలు వరదల్లో చిక్కుకుంటున్నాయి. భారీగా పంట నష్టం సంభవిస్తోంది. ఏటా కనీసం రెండు లేదా మూడుసార్లు ఇదంతా తప్పడం లేదు. విపత్తులు కొత్త కానప్పుడు వాటిని ఎదుర్కొ నడంలోనూ తగినంత అనుభవం వచ్చి ఉండాలి. సహాయ, పునరావాసాల చర్యల్లో లోటు పాట్లుండ కూడదు. కానీ చంద్రబాబు సర్కారు దేన్నీ నేర్వటం చేతగాని మొద్దబ్బాయి తీరును తలపిస్తోంది. నాలుగేళ్లక్రితం సంభవించిన హుద్‌హుద్ తుపాను నాటి పరిస్థితులే ఇప్పడూ ఉండటం, పౌరులు రోజుల తరబడి పస్తులుండే దుస్థితి ఏర్పడటం ఎంత ఘోరం! గత అను భవాలను సమీక్షించుకుని, అందులోని లోటుపాట్లు గ్రహించి అవి పునరావృతం కాకుండా ఏం చేయాలో మదింపు వేసుకుంటే సమస్యలుండవు. అంతేతప్ప గతంలో అంత చేశాం, ఇంత చేశా మంటూ గప్పాలు కొట్టుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేది శూన్యం. ఇప్పటికైనా బాబు ప్రభుత్వం చురుగ్గా కదిలి ఉద్దానం తుపాను బాధితులను తక్షణం ఆదుకోవాలి. -
పునరావాసమే సవాల్!
తిరువనంతపురం/కొచ్చి: వర్షాలు తెరిపివ్వడంతో కేరళలో వరద ఉధృతి తగ్గినా కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. లక్షల మంది నిరాశ్రయులకు పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం సవాల్‌గా మారింది. తిండి, నీరు, తాత్కాలిక ఆశ్రయం కల్పించడంతోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం, అధికారుల ముందు అతిపెద్ద సమస్యగా నిలిచింది. వరదల కారణంగా మృతుల సంఖ్య 376కు చేరింది. 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది నిరాశ్రయులున్నారు. మరోవైపు, పలుప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో నీటిలో చిక్కుకున్న వారిని కాపాడే కార్యక్రమాలు సాగుతున్నాయని సదరన్ కమాండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ డీఆర్ సోనీ పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా ఇంకెవరు చిక్కుకుని ఉన్నారనే విషయం తెలుసుకుని.. ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ‘అందరినీ కాపాడి పూర్తి పునరావాసం కల్పించడంపైనే దృష్టిపెట్టాం’ అని ఆయన తెలిపారు. సహాయక బృందాలకు అవసరమైన కనీస సదుపాయాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లు దాదాపుగా ముగిసినట్లేనని వైస్ అడ్మిరల్ గిరీశ్ లుథారా పేర్కొన్నారు. అక్కడక్కడ చిక్కుకుని ఉన్నవారిని గుర్తించామని వారిని కాపాడేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సహాయక చర్యలు ముమ్మరం ఇళ్లపైకప్పుల పైన, మిద్దెల పైన నిలబడి సాయం కోసం అర్థిస్తున్నారు. ఎవరైనా రాకపోతారా.. కాపాడకపోతారా అనే ఆశతో తిండితిప్పల్లేకుండా ఆశగా ఎదురుచూస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని శాటిలైట్ ఫోన్ల ద్వారా చేరుకుంటున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఎర్నాకులం జిల్లా పరూర్‌లో ఆదివారం రాత్రి ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీడీ సతీశన్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న దాదాపు అందరినీ క్షేమంగా పునరావాస కేంద్రాలకు పంపించినట్లు ఆయన వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లలో పేరుకుపోయిన బురద, రాళ్లురప్పలు తొలగించే పనులు కూడా ఊపందుకున్నాయి. ఈ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నారు. నేవల్ ఎయిర్‌బేస్, కొచ్చి పోర్టు ద్వారా.. కొచ్చి నేవల్ ఎయిర్‌బేస్‌లో వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. బెంగళూరునుంచి సరుకులతో వచ్చిన విమానం సోమవారం ఉదయం ఎయిర్‌బేస్‌లో ల్యాండైంది. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 26వరకు విమానాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో.. కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాలనుంచి సహాయసామాగ్రి కోసం ఈ ఎయిర్‌బేస్‌నే వినియోగించనున్నారు. మరోవైపు, కేరళ పోర్టుకు కూడా వివిధ రాష్ట్రాలనుంచి సముద్రమార్గం ద్వారా సహాయ సామగ్రి రవాణా మొదలైంది. ముంబై నుంచి 800 టన్నుల స్వచ్ఛమైన నీరు, 18 టన్నుల సరుకుతో నేవల్షిప్ ఐఎన్ఎస్ దీపక్ చేరుకుందని కొచ్చి పోర్టు ట్రస్టు అధికారులు తెలిపారు. పోర్టునుంచే పునరావాస కేంద్రాలకు ట్రక్కుల్లో ఈ సామగ్రిని పంపిస్తున్నారు. మరోవైపు, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరో భారీ సరుకుల నౌక వల్లార్‌పదం పోర్టుకు చేరుకుంది. మరోవైపు, ముంబై నుంచి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన భారీ నౌకలో 50వేల మెట్రిక్ టన్నుల ఇంధనం కూడా కొచ్చి పోర్టుకు చేరుకుంది. సహాయక కార్యక్రమాలు, ట్రక్కుల కోసం భారీగా ఇంధనం అవసరమైన నేపథ్యంలో బీపీసీఎల్ ఈ నౌకను పంపించింది. అటు, తిరువనంతపురం, ఎర్నాకులం మధ్య రైలు సేవలను పునరుద్ధరిస్తున్నారు. ట్రయల్‌రన్ తర్వాత సహాయకసామగ్రిని తరలించేందుకు ఈ ట్రాక్ కీలకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు, తిరువనంతపురం నుంచి చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీలకు రైలు సేవలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. సాయం అందుతోంది! వరదకోరల్లో చిక్కుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.3కోట్లు, అస్సాం ప్రభుత్వం రూ.3కోట్ల సాయం అందిస్తున్నట్లు ప్రకటించాయి. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. అటు, రూ.10 కోట్ల సాయం అందించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2,500 టన్నుల బియ్యాన్ని ప్రత్యేక రైల్లో కేరళకు పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 100 మెట్రిక్ టన్నుల ధాన్యాలు, 52 మెట్రిక్ టన్నుల అత్యవసర మందులను సోమవారం కేరళకు పంపించింది. దీంతోపాటుగా 2,600 మెగావాట్ల విద్యుత్‌ను అందించేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎమ్సీ) కేరళలో వరద పరిస్థితి, అందుతున్న సాయంపై సమీక్ష నిర్వహించింది. తలచుకుంటేనే భయమేస్తోంది: బాధితులు అటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారు కూడా భవిష్యత్తును తలచుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరిగి ఇళ్లకు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్లుగగుర్పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వరదలకు ముందుపరిస్థితి నెలకొనడం ఎలాగనేదే పెద్ద సమస్యంటున్నారు. ‘మళ్లీ ఇళ్లకు వెళ్లాక మా పరిస్థితేంటో అర్థం కావడం లేదు. సర్వం నష్టపోయాం. మా ఇళ్లను కట్టుకునేందుకు తగినంత సాయంకావాలి’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పునరావాస కేంద్రాల్లోనూ పరిస్థితి ఒకేలా లేదు. చాలాచోట్ల కనీస వసతులు కూడా ఇంకా ఏర్పాటుచేయలేదు. ఎర్నాకులంలోని ఓ కేంద్రంలో ఓ చిన్నారికి తట్టు (చికెన్ పాక్స్) సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆ చిన్నారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రత్యేక ఏర్పాట్లతో చికిత్సనందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చల్లేందుకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్ కొరత కారణంగా మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. రండి.. కాపాడుకుందాం: కేంద్రం పిలుపు వరదలతో అతలాకుతలమైన కేరళ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘విషాదకరమైన మానవత్వ సంక్షోభం’లో ఉన్న కేరళను ఆదుకునేందుకు తోచినంత సాయం చేయాలని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు విజ్ఞప్తి చేశారు. సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయదలచుకోవడం లేదని.. సహాయం చేయడం, చేసేవారిని కలుపుకుని వెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు, సీఐఐ, ఫిక్కీ వంటి వ్యాపార సంస్థలు తదితరులతో అధికారులు మాట్లాడుతున్నారన్నారు. అటు కేరళనుంచి వివిధ ప్రాంతాలకు విమానచార్జీలు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి స్పందిస్తూ.. విమానయాన కంపెనీలు మానవతాధృక్పథంతో వ్యవహరించాలన్నారు. అటు, కేరళ సాధారణస్థితికి చేరుకునేందుకు వందలు, వేల సంఖ్యలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు అవసరమని మరో కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ అన్నారు. జాతీయవిపత్తుగా గుర్తించబోం: కేంద్రం న్యూఢిల్లీ: కేరళలో వరద విలయాన్ని తీవ్రమైన విపత్తుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ‘కేరళలో వరదల తీవ్రత, కొండచరియలు విరిగిపడిన ఘటనలను, జరిగిన అపార నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా గుర్తించాం’ అని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రకృతి ప్రకోపాన్ని అరుదైన/తీవ్రమైన విపత్తుగా గుర్తించినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో సహాయం అందుతుంది. ఎన్డీఆర్ఎఫ్ నిధి నుంచి అదనపు సాయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య 3:1 నిష్పత్తితో విపత్తు సహాయ నిధి (సీఆర్ఎఫ్)ను ఏర్పాటుచేస్తారు. ఈ నిధిలో డబ్బులు తగ్గినపుడు నేషనల్ కెలామిటీ కంటిన్జెన్సీఫండ్ (100%కేంద్ర నిధులు) నుంచి సాయం అందిస్తారు. తీవ్రమైన విపత్తు ప్రకటించిన ప్రాంతాల్లో బాధితుల రుణాల చెల్లింపులో వెసులుబాటు, కొత్త రుణాలు ఇచ్చే అవకాశాన్ని చూస్తారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించబోమని కేరళ హైకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం ఈ విషయం తెలిపింది. ‘కేరళ విపత్తు తీవ్రమైనది. జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనల ఆధారంగా దీన్ని లెవల్ 3 విపత్తుగా గుర్తించాం. ఎంత పెద్ద విపత్తు ఎదురైనా ఈ నిబంధనల ఆధారంగానే కేటగిరీలు నిర్ణయిస్తాం. కేరళ వరదల విలయాన్ని జాతీయ విపత్తుగా గుర్తించబోవడం లేదు’ అని పేర్కొంది. తగ్గిన కర్ణాటక వరదలు కర్ణాటకలోని కొడగు జిల్లాలో నాలుగురోజులుగా బీభత్సం సృష్టించిన వరద తగ్గుముఖం పట్టింది. జిల్లాలోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో పర్యాటకుల బుకింగ్స్‌ను రద్దుచేసి నిరాశ్రయులకు గదులు కేటాయించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైన్యం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఒక్కో కుటుంబానికి రూ.3,800 చొప్పున మధ్యంతర సహాయం అందించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అలువా జిల్లాలో అంటువ్యాధులు సోకకుండా మందుల పంపిణీ కొచ్చి ఆడిటోరియంలో బాధితుల కోసం సహాయ సామగ్రిని సిద్ధం చేస్తున్న వాలంటీర్లు -
వీళ్ళే సివిల్ సర్వెంట్స్!
దేవలోకంగా భావించే కేరళని వరదలు ముంచెత్తడంతో ఆపన్న హస్తం కోసం అన్నార్తులు ఎదురుచూస్తున్నారు. గూడు చెదిరి కొందరు, గుండె పగిలి మరికొందరు. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయారు. పచ్చటి పైర్లతో విలసిల్లే కేరళలో గుప్పెడు బియ్యం కోసం ప్రజలు అల్లాడుతున్నారు. సహాయకచర్యలకోసం విలవిల్లాడుతున్నారు. ఇదే సందర్భంలో కేరళలోని ఇద్దరు ఐఏఎస్ అధికారులు తమ ఉద్యోగధర్మానికి సరైన నిర్వచనంలా నిలిచారు. వరదలు ముంచెత్తిన రాత్రి సహాయక చర్యల్లో భాగంగా ఎంతో ప్రయాసపడి బియ్యం బస్తాలను మోసుకుంటూ వచ్చింది ఓ వ్యాన్. అసలే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. రోడ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ లేనేలేదు. తక్షణమే వచ్చిన లోడ్‌ని ఖాళీ చేసి, వ్యాన్ తిరిగి పంపించాలి. అయితే, బస్తాలు దించేందుకు అందుబాటులో ఉన్న వాళ్ళు సరిపోరు. అది చూసిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు వెంటనే కార్యక్షేత్రంలోకి దిగి ట్రక్కులో ఉన్న బియ్యం బస్తాలను భుజాలకెత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి దించేసారు. సివిల్ సర్వెంట్స్‌కి సరైన నిర్వచనం ఇచ్చిన జి.రాజమాణిక్యం, ఎన్ఎస్కె. ఉమేష్‌లు అందరికీ ఆదర్శంగా నిలిచారు. వయ్‌నాడ్ జిల్లా సబ్‌కలెక్టర్‌గా ఉన్న ఎన్ఎస్కె ఉమేష్, ప్రత్యేక అధికారి హోదాలో కేరళ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ జి.రాజమాణిక్యం అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కేరళ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. జంతువులను రక్షిస్తున్న హెచ్ఎస్ఐ ఎడతెరిపి లేకుండా కేరళలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అయింది.వరదల కారణంగా నిరాశ్రయులైన మనుష్యులను సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పలు సంఘాల వలంటీర్లు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదనీటిలో చిక్కుకున్న జంతువులను రక్షించేందుకు ఓ బృందం అవిశ్రాంతంగా పని చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటోంది. కుక్కలు, పిల్లులు ఇతర పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వాటికి అవసరమైన ఆహారం, వైద్యసహాయాన్ని అందిస్తోంది. వరద నీటిలో చిక్కుకున్న జంతువులను రక్షించేందుకు హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం నిలంబూర్, తిరుర్ రీజియన్స్‌లో పనిచేస్తోంది. త్రిసూర్‌లో ఉంటున్న ఓ మహిళ తనతో పాటు ఇంట్లో ఉన్న 25 కుక్కలను కూడా తరలిస్తేనే ఇంటిని ఖాళీ చేస్తానని భీష్మించింది. దీంతో హ్యూమన్ సొసైటీ సభ్యులు అక్కడికి వెళ్లి కుక్కలతో పాటు ఆమెను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. జిల్లా కలెక్టర్, పశువైద్యశాఖ అధికారుల సహాయంతో జంతువులను సంరక్షిస్తున్నామని కొన్నింటిని వాటి యజమానులకు అందజేశామని మిగిలిన వాటిని కూడా అప్పగిస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. మానవత్వం చాటుకుంటున్న మత్స్యకారులు జలప్రళయంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అన్ని వర్గాల వారు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. నిత్యం సముద్రపు నీటితో సహవాసం చేసే మత్స్యకారులు కూడా బాధితులను రక్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కేరళకు చెందిన 100 మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చేపలు పట్టేందుకు ఉపయోగించే నాటు పడవలను కొల్లాం, ఎర్నాకుళం, తిరువనంతపురంలోని వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. వరద నీటిలో చిక్కుకున్న స్థానికులను తమ పడవలలో పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు. ఒక్కో పడవలో పది మందిని సులభంగా తరలించగలిగారు. కేవలం ప్రజల్ని తరలించడమే కాదు పోలీసులతో కలిసి తాగునీరు, లైఫ్ జాకెట్లు, సెర్చ్ లైట్స్ వంటి వాటిని తరలించడానికి ఈ పడవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. -
పడవ ప్రమాదం: వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
-
బోటు ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు..
నాగ్‌పుర్ : మహారాష్ట్రాలో విషాదం చోటు చేసుకుంది. బోటు బోల్తా పడిన దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. నాగ్‌పుర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో అమరావతి రోడ్డు సమీపంలోని వెనా డ్యాంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. ఎనిమిది యువకులు కలిసి పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడానికి బోటు షికారుకు వెనా డ్యాంకు వెళ్లారు. ముగ్గురు బోటు సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం బోటు షికారుకు వెళ్లారు. డ్యాం మధ్యలోకి చేరుకోగానే ప్రమాదవశాత్తు బోటు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా, ఏడుగురి ఆచూకీ గల్లంతయ్యింది. ముగ్గురురిని రెస్క్యూ సిబ్బంది కాపాడగలిగింది. ఏడుగురి కోసం రెస్యూసిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తోందని నాగ్‌పుర్ రూరల్ అడిషనల్ ఎస్పీ సురేష్ బోయట్ తెలిపారు. కాగా, బోటు ప్రమాదానికి గురికావడానికి కొద్దిక్షణాల ముందు యువకులు కేరింతలు కొడుతూ సరదాగా గడుపిన ఓ వీడియోను పోలీసులు వెల్లడించారు. బోటులో ఉన్న ఓ యువకుడు తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫోన్ సహాయంతో లైవ్ టెలీకాస్ట్ చేశాడు. మిత్రులందరూ కలిసి బోటులో ఆనందంగా గడుపిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుంకుంది. -
ఆ విమానం సెర్చింగ్‌కు స్పెషల్ చాపర్లు
గువాహటి: కనిపించకుండా పోయిన భారత వైమానిక విభాగానికి చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం జాడ తెలుసుకునేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. సీ-130 యుద్ధ విమానంతోపాటు ఎలెక్ట్రో పెలోడ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్‌హెచ్) హెలికాప్టర్ సహాయంతో కనిపించకుండాపోయిన సుఖోయ్ను గాలించారు. అయితే, సుఖోయ్ కనిపించకుండా పోయిన ప్రాంతం మొత్తం కూడా దట్టంగా పొగమంచు కప్పుకొని ఉన్నకారణంగా సరిగా కనిపించని పరిస్థితి ఉంది. ఆ వైపుగా వెళ్లేందుకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు కూడా ఆ విమానం గురించిగానీ, పైలట్ల గురించి ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో గాలింపు చర్యలు ఆపేశారు. -
తేరుకుంటున్న నగరం
ఇంకా ముంపులోనే పలు కాలనీలు * సహాయక చర్యలు ముమ్మరం * బాధితులకు ఆహారం, నీరు అందిస్తున్న ఆర్మీ, జీహెచ్ఎంసీ బృందాలు సాక్షి, హైదరాబాద్: కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ నగరంలో ఆదివారం వర్షం కాస్త తెరిపినిచ్చింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం తొలగి కాస్త ఉపశమనం లభించింది. భారీ వర్షాలకు నిండా మునిగిన నిజాంపేట్‌లోని భండారీ లే అవుట్లో ఇంకా 25 అపార్ట్మెంట్లు వరద నీటిలోనే ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించకపోవడంతో వాటిల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్వచ్ఛంద సంస్థలు ఆహారం, మంచినీరు, మందులు అందజేస్తున్నాయి. ఇక దూలపల్లి, కొంపల్లి, గుండ్లపోచంపల్లి చెరువులు అలుగుపోస్తుండడంతో కొంపల్లి పరిధిలోని ఉమామహేశ్వర కాలనీ నుంచి 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఫాక్స్ సాగర్‌కు ఎగువ భాగంలో ఉన్న ప్రాంతంలో 160 ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ఇక అల్వాల్‌లోని రెడ్డి ఎన్క్లేవ్, శ్రీనివాసనగర్, భారతినగర్, వెంకటాపురం, భూదేవినగర్, శివనగర్, తుర్కపల్లి ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది. బేగంపేట్ నాలాకు ఆనుకుని ఉన్న అల్లంతోట బావి ప్రాంతం ముంపులోనే ఉంది. ఆర్మీ, జీహెచ్ఎంసీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. మరిన్ని రోజులు వానలు.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా అల్పపీడన ప్రభావంతో ముసురు వీడలేదు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు పలు చోట్ల కుండపోత వాన కురిసింది. హకీంపేట్‌లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 4.1, కుత్బుల్లాపూర్‌లో 4, బొల్లారంలో 3.5, చిలకలగూడలో 2.1, బేగంపేట్‌లో 1.7, సరూర్‌నగర్‌లో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఇక హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. నగరానికి ఆనుకుని ఉన్న గండిపేట్ (ఉస్మాన్‌సాగర్) జలాశయం గరిష్ట మట్టం 1790 అడుగులకుగాను ఆదివారం సాయంత్రానికి 1779 అడుగుల నీటిమట్టం నమోదైంది. హిమాయత్‌సాగర్ జలాశయం గరిష్ట మట్టం 1763.5 అడుగులకుగాను 1743 అడుగుల వరకు నీరు చేరింది. ఎగువన వర్షాలు తగ్గడంతో వరద క్రమంగా తగ్గుముఖం పడుతోందని జలమండలి అధికారులు తెలిపారు. -
కూలిన బతుకులు
గుంటూరులో ఘోరం ► భవన నిర్మాణ పనుల్లో విరిగిపడిన మట్టి పెళ్లలు ► నలుగురి మృతి.. శిథిలాల కింద మరో ముగ్గురు! ► పొక్లెయిన్ సాయంతో మట్టి పెళ్లల తొలగింపు యత్నాలు ► బాధితులంతా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు వాసులు ► రాత్రంతా కొనసాగనున్న సహాయక చర్యలు అరండల్‌పేట (గుంటూరు) : గుంటూరులో భవన నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడి నలుగురు మృత్యు ఒడికి చేరారు. మరో ముగ్గురు మట్టిపెళ్లల కిందే ఉన్నారని భావిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. లక్ష్మీపురం ప్రధాన రహదారిలో ఓ భవన నిర్మాణానికి పునాదులు తీసే పనులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి పిల్లర్లకు కాంక్రీటు పనులు జరుగుతుండగా, పైన వేసిన మట్టి పెళ్లలు ఒక్కసారిగా జారిపడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కార్మికుడిని పక్కకు లాగేందుకు వెళ్లిన కూలీలంతా మట్టి పెళ్ళల కింద చిక్కుకున్నారు. ఈ దుర్ఘటనలో శేషు, బుసి సాల్మన్ సహా నలుగురు మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న మరియబాబు అనే వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసి గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. ఇంకా ముగ్గురు కూలీల వరకు మట్టి పెళ్ళల కింద ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. బాధితుల ంతా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. రెండు పొక్లయిన్ సాయంతో మట్టిపెళ్ళలను తొలగిస్తున్నారు. ప్లాన్ పొందింది ఇలా... నగరంలోని లక్ష్మీపురం ప్రధాన రహదారిలో నగరానికి చెందిన డాక్టర్ సుబ్బారావుకు స్థలం ఉంది. దీనిలో వాణిజ్య భవనం నిర్మించేందుకు టీడీపీ నాయకుడు చుక్కపల్లి రమేష్‌కు చెందిన ఫోనిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా చుక్కపల్లి రమేష్ వాణిజ్య భవనం నిర్మించేందుకు నగరపాలక సంస్థకు 191/2014/జి1 దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నగర పాలక సంస్థ 28.10.2015న 2,270 చదరపు గజాల్లో రెండు సెల్లార్లు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 4 అంతస్తులు నిర్మించు కొనేందుకు అనుమతులు మంజూరు చేసింది. మూడు నెలలుగా పనులు వేగవంతం చేశారు. తొలుత సెల్లార్ల నిర్మాణానికి కార్మికులతో పనులు ప్రారంభించారు. అడుగడుగునా నిబంధనలకు పాతర ... భవన నిర్మాణంలో అడుగడుగునా నిబంధనలకు పాతర వేశారు. సెల్లార్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉన్నా అదనపు వ్యయం అవుతుందన్న కక్కుర్తితో పాటించలేదు. ప్రధానంగా 30 అడుగుల్లోతు సెల్లార్లను తవ్వుతున్నప్పుడు చుట్టుపక్కల పది అడుగుల స్థలాన్ని వదిలి సెల్లార్లను నిర్మించాలి. అదేవిధంగా మట్టిపెళ్ళలు విరిగిపడకుండా చుట్టూ ఇనుప చువ్వలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ కేవలం రెండు అడుగులు మాత్రమే చుట్టుపక్కల వదిలారు. నిర్మాణానికి పక్కనే ఉన్న భవనానికి సంబంధించిన గోడ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో సెల్లార్లలో పిల్లర్లుకు కాంక్రీటు పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మట్లిపెళ్లలు విరిగిపడ్డాయి. దీనికి తోడు పక్కనే ఉన్న గోడ సైతం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరొకరిని శిథిలాల కింద నుంచి బయటకుతీసి ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు మట్టి పెళ్ళల కింద ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అసలు సైట్లో ఉండి పనులను పర్యవేక్షించాల్సిన సైటు ఇంజినీరు హరిబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కార్మికులు చెబుతున్నారు. కూలీలంతా యువకులే ... మట్టి పెళ్ళల కింద చిక్కుకుపోయిన వారంతా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు యువకులే. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని పనుల్లోకి వస్తున్నారు. గుంటూరుకు చెందిన కాంట్రాక్టరు రాము వీరిని పనుల నిమిత్తం తీసుకువచ్చారని తెలిపారు. పోలీసుల ఓవర్ యాక్షన్ ... బిల్డర్ చుక్కపల్లి రమేష్ అధికారపార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారనే విమర్శలు వెల్తువెత్తాయి. సంఘటన జరిగిన ప్రాంతం వద్దకు మీడియా ప్రతినిధులు, ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబసభ్యులు వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లనీయవద్దంటూ పై నుంచి ఆదేశాలంటూ చెప్పి గేట్లకు తాళాలు వేశారు. అక్కడే ఉన్న చుక్కపల్లి అనుచరులు రాయలేని భాషలో అసభ్యపదజాలం ఉపయోగిస్తూ మీడియా వారి పట్ల దురుసుగా వ్యవహరించారు. -
ముగ్గురిని మింగిన గని
మందమర్రి భూగర్భ గనిలో ఘోరం బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ఏరియా శాంతిఖని గనిలో బుధవారం జరిగి న పెను ప్రమాదం ముగ్గురు కార్మికులను బలి తీసుకుంది. గని భూగర్భంలోని పైకప్పు కూలడంతో ఆర్బీసీ కార్మికులు పోల్సాని హన్మంతరావు, రమావత్ కిష్టయ్య, మేసన్ మేస్త్రీ గాలిపల్లి పోశం దాని కింద నలిగి నిస్సహాయంగా ప్రాణాలొదిలారు. హన్మంతరావు, కిష్టయ్య రోజూలా ఉదయం 9 గంటల కు విధులకు వచ్చారు. పోశం మొదటి షిఫ్ట్ విధులకు వెళ్లారు. గనిలో దిగి పనులు ముగించుకుని, 52 లెవల్ వన్‌డీప్ దగ్గరి పంపు వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో అలిసిపోయి ఉండటంతో కాసేపు జంక్షన్ వద్ద సేద తీరారు. గని రక్షణ అధికారి సంతోష్‌రావు అటువైపు వచ్చి వెళ్లిపోగానే పైకప్పు బండ ఆకస్మికంగా కూ లింది. 5 అడుగుల పొడవు, 14 అడుగుల మందమున్న ఆ బండ కింద హన్మంతరావు, కిష్టయ్య, పోశం నలిగిపోయారు. మరో 20 మంది కార్మికులు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. జంక్షన్ వద్ద పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడమే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. సహాయక చర్యలు: ఘటనా స్థలికి రామకృష్ణాపూర్ నుంచి రెస్క్యూ సిబ్బందిని రప్పిం చారు. వారు జాకీలు, ఇతర సపోర్టు పనిముట్లతో బండరాళ్లను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. తొలగింపు అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతూనే ఉంది. భారీగా కూలిన ఆ రాళ్లను పూర్తిగా తొలగిస్తే గానీ మృతదేహాలను బయటకు తీసే పరిస్థితుల్లేవు. నిర్విరామంగా శ్రమిస్తే గురువారం తెల్లవారుజాము, లేదా మధ్యాహ్నం వరకు వాటిని వెలికితీసే అవకాశముంది. మందమర్రి ఏరియా జీఎం వెంకటేశ్వర్‌రెడ్డి తదితర అధికారులు గనిలో దిగి సహాయక పనులను పర్యవేక్షి ంచారు. దుఃఖసాగరం: గని ప్రమాదంలో మరణించిన ముగ్గురు కార్మికుల కుటుంబాలు తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయాయి. ప్రమాదం జరిగాక ఐదారు గంటలదాకా మృతులెవరో నిర్ధారణ కాకపోవడంతో కార్మికుల కుటుంబాలన్నీ ఆందోళనకు గురయ్యాయి. మృతుల కుటుంబీకులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎంపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, కార్మిక సంఘాల నాయకులు వి.సీతారామయ్య బెల్లంపల్లి ఏరియా జీఎం కె.రవిశంకర్, కార్మికులు శాంతిఖని గనికి తరలివచ్చారు. -
భూగర్భంలోనే ఊపిరొదిలారు
► శాంతిఖని గనిలో కూలిన పైకప్పు ► జంక్షన్ వద్ద ఘటన ► ఒకరికి గాయూలు ► ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న 20 మంది ► బండరాయి కిందనే మృతదేహాలు ► కొనసాగుతున్న సహాయక చర్యలు నిత్యం భూగర్భంలోనే పనిచేసే ముగ్గురు సింగరేణి కార్మికులే అక్కడే ఊపిరి వదిలారు. ప్రమాదవశాత్తు భూగర్భంలోని జంక్షన్ రూఫ్‌ఫాల్ (పై కప్పు కూలి) కావడంతో బండ కింద నలిగి అక్కడికక్కడే చనిపోయారు. మందమర్రి ఏరియా ఏరియా శాంతిఖని గనిలో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెల్లంపల్లి(ఆదిలాబాద్) : బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా పరిధిలోని శాంతిఖని భూగర్భగనిలో బుధవా రం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు బలయ్యూరు. ఒకరు గాయూలతో బయటపడగా సుమారు 20 మంది కార్మికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తోటి కార్మికుల కథనం ప్రకారం.. కార్మికులు ఎప్పటిలాగే మొదటి షిఫ్టు డ్యూటీకి హాజరయ్యారు. పనులు ముగించుకొని మధ్యాహ్నం సుమారు 1.45 గం టల సమయంలో గనిలోని 52 లెవల్ వన్‌డీప్ జంక్షన్లో ఉన్న పంపు వద్దకు చేరుకుని ముఖం, కాళ్లు, చేతులు కడుక్కొని నీళ్లు తాగారు. గని రక్షణ అధికారి సంతోష్‌రావు అటు వైపు వచ్చి వెళ్లిపోయూడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా జంక్ష న్ ప్రాంతంలోని పైకప్పు(సుమారు ఐదు ఫీట్ల వెడల్పు, 14 ఫీట్ల మందం కలిగిన బండ) కూలింది. దీంతో అక్కడే ఉన్న ఆర్బీసీ(సపోర్టుమెన్)లు పోల్సాని హన్మంతరావు(58), రమావత్ కిష్టయ్య(52), మేషన్ మేస్త్రీ గాలిపల్లి పోశం(53) బండ కింద నలిగిపోయూరు. కొద్ది దూరంలో ఉన్న మరో 20 మంది కార్మికులు భయంతో పరుగులు తీశారు. వీరంతా కొద్ది గంటల తర్వాత ఉపరితలానికి చేరుకున్నారు. గాయపడిన జనరల్ మజ్దూర్ కార్మికుడు చీమల శంకర్ స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముమ్మరంగా సహాయక చర్యలు విషయం తెలిసిన వెంటనే మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల అధికారులు గని వద్దకు వచ్చి రామకృష్ణాపూర్ నుంచి రెస్క్యూ సిబ్బందిని రపించారు. వారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కప్పు కూలిన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాకీలు, ఇతర సపోర్టుల సహాయంతో బండరారుు శిథిలాలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యూరు. గురువా రం తెల్లవారుజాము లేదా మధ్యాహ్నం వరకు బండ కింద ఉన్న కార్మికుల మృతదేహాలను వెలికితీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తరలివచ్చిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ప్రమాద ఘటన విషయం తెలియగానే రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎంపీ జి.వివేకానంద, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, బెల్లంపల్లి ఏరియా జీఎం కె.రవిశంకర్, టీఆర్ఎస్, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ నాయకులు గని వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును తోటి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. గనిలోకి మందమర్రి ఏరియా జీఎం వెంకటేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారు లు, కార్మిక సంఘాల నాయకులు దిగి ప్రమాదస్థలిని పరిశీలించారు. శోకసంద్రంలో మృతుల కుటుంబాలు సింగరేణి అధికారులు సమాచారాన్ని వెంటనే చేరవేయకపోవడంతో కొన్ని గంటల పాటు మరణ వార్త సదరు కార్మిక కుటుంబాలకు తెలియలేదు. తర్వాత విషయం తెలియగానే మృతి చెందిన హన్మంతరావు, పోశం, కిష్టయ్య కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయా యి. గనిపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 రోజులుగా మొత్తుకున్నా.. శాంతిఖని గని ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ప్రధానంగా కనబడుతోంది. గనిలోని 52 లేవల్, ఒకటో డీప్ జంక్షన్ వద్ద పైకప్పు నుంచి శబ్దాలు వస్తున్నాయని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని కార్మికులు 15 రోజులుగా మొత్తుకున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ప్రమాదం జరిగిన స్థలంలో తాగునీటి పంపుతో పాటు మూడు కన్వేయర్ బెల్టులు, రెండు ఎస్డీఎల్ యంత్రా లు, రెండు గాలి సరఫరా చేసే ఫ్యాన్లు పనిచేస్తున్నాయి. వీటి శబ్దాల వలన గని పైకప్పు కూలే సమయంలో సంకేతం ఏమీ వినబడకపోవ డం వల్లే కార్మికులు ప్రమాదాన్ని పసిగట్టలేక పోయారనే అభిప్రాయా లు సైతం వ్యక్తమవుతున్నారుు. అధికారుల నిర్లక్ష్యం వల్లే.. గనిలో జరిగిన ప్రమాదం మృతుల కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా, ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినా గనుల్లో ప్రమాదాలు ఆగడం లేదు. గని అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాలను అన్ని రకాల ఆదుకోవాలి. - నల్లాల ఓదెలు, ప్రభుత్వ విప్ రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. జంక్షన్ వద్ద పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ముగ్గురు కార్మికులు బల య్యూరు. సింగరేణి అధికారులే బాధ్య త వహించాలి. మృతుల కుటుంబాల కు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. - వి.సీతారామయ్య, ఎస్సీడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బాధ్యులను సస్పెండ్ చేయాలి ప్రమాదానికి కారకులైన సింగరేణి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఘటనకు గని మేనేజ ర్, రక్షణ అధికారి పూర్తి బాధ్యత వహించాలి. డీజీఎంఎస్ పర్యవేక్షణ లోపం వల్ల ప్రమాదం జరిగింది. గనిలో అధికారులు దిగకుండా కార్మికులను పంపి ప్రాణాలు బలితీసుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. - రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రక్షణపై శ్రద్ధ లేకనే.. గనిలో కంటీన్యూయస్ మైనర్ యంత్రాన్ని ప్రవేశపెట్టాలనే ఆతృత తప్ప గని అధికారులకు రక్షణపై శ్రద్ధ లేదు. కొద్ది రోజుల నుంచి జంక్షన్ వద్ద శబ్దం వస్తున్న ట్లు కార్మికులు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. - ఎస్.రాజమొగిళి, ఐఎన్టీయూసీ -
శిథిలాల కింద ఓ మృతదేహం లభ్యం
బీజింగ్ : చైనా షెంజన్ పారిశ్రామిక వాడలో సోమవారం భారీగా కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటి వరకు ఓ మృతదేహాన్నివెలికి తీసినట్లు ఉన్నతాదికారులు మంగళవారం వెల్లడించారు. 85 మంది ఆచూకీ తెలియలేదని తెలిపారు. వారు శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉందన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారిలో 32 మంది మహిళలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం భారీగా సిబ్బందిని రంగంలోకి దింపామన్నారు. -
కాశ్మీర్ వరద మృతులకు దలైలామా సంతాపం
ధర్మశాల : జమ్మూ కాశ్మీర్ వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు టిబెట్ ఆధ్యాత్మిక బౌద్ధమత గురువు దలైలామా గురువారం సంతాపం తెలిపారు. వరదల బీభత్సంతో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఆయన జమ్మూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు రాసిన ఓ లేఖలో తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగించవల్సిందిగా దలైలామా సూచించారు. అలాగే వినాశకరమైన వైపరీత్యంతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దలైలామా ట్రస్ట్ నుంచి విరాళం ప్రకటించారు. విరాళాన్ని ముఖ్యమంత్రి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్‌కు పంపించినట్లు ధర్మశాలలోని దలైలామా కార్యాలయం వెల్లడించింది. మరోవైపు భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్‌లో బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ వరద ప్రాంతాల్లో 77 వేలమంది బాధితులను రక్షించారు. మృతుల సంఖ్య 215కి పెరిగింది. -
వరద బాధితులను ఆదుకునేందుకు సైన్యం చర్యలు
శ్రీనగర్: భారీ వరదల వల్ల అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్‌లో బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ పర్యటిస్తున్నారు. సైన్యం ఇప్పటి వరకు 4 లక్షల మందికి సహాయ సామాగ్రాని అందజేయగా, వరద ప్రాంతాల్లో 80 వేలమంది బాధితులను రక్షించారు. సహాయక చర్యల్లో 3 వేల మంది జవాన్లు పాల్గొంటున్నారు. 97 హెలీకాప్టర్లను వాడుతున్నారు. -
సహాయక చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న భారీ వర్షాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ముంపు ప్రాంతాల్లో వరద నష్టంపై ఆరా తీస్తున్నారు. భారీ వర్షాల బారిన పడిన జిల్లాల నాయకులతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏయే జిల్లాల్లో ఎక్కువ నష్టం వాటిల్లిందో తెలుసుకుంటున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజల పునరావాసం గురించి అడుగుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులను వైఎస్ జగన్ ఆదేశించారు. పలు జిల్లాల్లో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉన్న ఒంగోలులో సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న బాధితులను ఆయన దగ్గరరుండి పునరావాస కేంద్రాలకు తరలించారు. వారి కోసం భోజన ఏర్పాట్లు చేయవలసిందిగా సంబంధిత అధికారులను బాలినేని ఆదేశించారు. -
18 హెలికాప్టర్లు, 12 విమానాలు సిద్ధం: సుశీల్ కుమార్ షిండే
ఫైలిన్ తుపాన్ బాధితులకు సహాయక, పునరావాస చర్యలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. 18 హెలీకాప్టర్లు, 12 విమానాలు, రెండు యుద్ధ నౌకల్ని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవరసమైన చోట వీటిని మోహరించినట్టు షిండే చెప్పారు. ఒడిషాలో 5.5 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు మంత్రి తెలియజేశారు. ఒడిషాలో ఎనిమిది, ఆంధ్రప్రదేశ్‌లో మూడు జిల్లాల్లో ఫైలిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. మొత్తం 500 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.