భోపాల్: బావిలో పడిపోయిన బాలుడిని కాపాడటానికి ప్రయత్నించిన గ్రామస్తులు అనూహ్యంగా ప్రమాదంలో పడిపోయిన ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. బాలుడిని రక్షించే ప్రయత్నంలో ఒకేసారి అక్కడికి చేరడంతో అధిక బరువుతో గోడ కూలి బావిలో పడిపోయారు. ఈ ఘటనలో దాదాపు 30 మంది ప్రమాదంలో చిక్కుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్, విదిష పట్టణానికి సమీపంలో గంజ్‌బసోడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్నఎన్‌డీఆర్‌ఆఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలును చేపట్టాయి. ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన వ్యక్తుల బరువు కారణంగా బావి పైకప్పు కూలిపోయిందని అధికారులు తెలిపారు. వీరిలో 19 మందిని సిబ్బంది కాపాడారు. ఇంకా బావిలోనే చిక్కుకున్న మిగిలిన వారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మరణించిన వారి కుటుంబాలకు సీఎం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంతోపాటు, ఉచిత వైద్య చికిత్స కూడా అందించనున్నామని వెల్లడించారు. అలాగే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు మంత్రి విశ్వాస్ సారంగ్, సహాయ, రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
MP: 4 bodies recovered from the spot so far in Ganjbasoda area of Vidisha.
— ANI (@ANI) July 16, 2021
CM SS Chouhan announces an ex-gratia of Rs 5 Lakhs each for the next of the kin of the deceased & compensation of Rs 50,000 each to the injured. The injured will also be provided free medical treatment. pic.twitter.com/PgBs2hzFJB
Comments
Please login to add a commentAdd a comment