భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న ముగిశాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ నేతలతో భోపాల్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు.
తమ అభ్యర్థులందరితో చర్చలు జరిపామని, కౌంటింగ్ రోజుకి కూడా సిద్ధమయ్యామని చౌహాన్ తెలిపారు. అంతకుముందు మంగళవారం భింద్ జిల్లాలోని అటర్ నియోజకవర్గంలోని కిషుపురా గ్రామంలో ఈసీఐ ఆదేశాల మేరకు రీపోలింగ్ జరిగింది. వీడియోలు తీసి పోలింగ్ గోప్యతను భంగపరిచారని రాష్ట్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ భదోరియా ఫిర్యాదు మేరకు రీపోలింగ్‌ను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే హేమంత్ కటారే బరిలో ఉన్నారు.
230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరిగాయి. మొత్తం 71.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు జరుగుతున్న మిగతా రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌లోనూ డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment