counting day
-
ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీ నేతల సన్నద్ధతపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. సోమవారం పలువురు పార్టీ నేతలకు కేసీఆర్ ఫోన్ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్ల నియామకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.ఓట్ల లెక్కింపు చివరిరౌండ్ పూర్తయ్యే వరకు ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండేలా చూసుకోవాలన్నారు. చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యరి్థగా గట్టి పోటీనిస్తున్నందున ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. లెక్కింపు ప్రారంభానికి ముందే పార్టీ తరఫున నియమితులైన పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకునేలా ఎంపీ అభ్యర్థులు సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. ముగిసిన దశాబ్ది ఉత్సవాలు మూడు రోజులపాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరి గిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సోమవారం ముగిశాయి. సిరిసిల్లలో కేటీఆర్ జాతీ య జెండాతోపాటు పార్టీ జెండా ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, శ్రేణులు ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. -
కౌంటింగ్ వేళ నిర్లక్ష్యం వద్దు: సీఎం
సాక్షి, హైదరాబాద్: కౌంటింగ్ రోజున ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు, కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం ఎ.రేవంత్‌రెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండవద్దని, పోటాపోటీగా ఉంటాయని భావిస్తున్న చోట్ల మరింత అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ పూర్తయ్యేంతవరకు కేంద్రాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు.నేడు లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం సీఎం రేవంత్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇంచార్జి మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులతో జూమ్ ద్వారా సమావేశమయ్యారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్మున్షీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా పాల్గొన్నారు. నిబద్ధత ఉన్న కార్యకర్తలనే ఏజెంట్లుగా జూమ్ సమావేశంలో భాగంగా రేవంత్ మాట్లాడు తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిబద్ధత కల కార్యకర్తలను మాత్రమే ఏజెంట్లుగా పంపాలని, సీ నియర్ నేతలను కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. పోలైన ఓట్లతో 17సీ లిస్ట్ సరిపోలాలని, ఈవీఎంలో లెక్కించిన ఓట్లతో 17సీ లిస్టులోని ఓట్లు సరిపోలకపోతే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్ని విషయాలపై అవగాహన ఉన్న వారిని ఏజెంట్లు పంపేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏజెంట్లంతా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అక్కడే ఉండేలా చూడాలని ఎంపీ అభ్యర్థులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. -
AP: స్వతంత్రుల ఏజెంట్లూ ‘తమ్ముళ్లే’!
సత్తెనపల్లి: జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లను పంపేలా కూటమి నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఏజెంట్ల నియామకానికి గురువారంలోగా వివరాలు పంపాలని పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేశ్ బి లత్కర్ సూచించారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోపాటు మరో 93 మంది అభ్యర్థులు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల బరిలో ఉన్నారు. అభ్యర్థుల తరఫున ఏజెంట్లు నియమించుకోవడానికి ఆధార్ కార్డులతో పాటు గుర్తింపు పత్రాలు, ఫొటోలు ఇస్తే గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. గుర్తింపు పొందిన పార్టీలతో పాటు పోటీలో ఉన్న ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి తరఫున ఏజెంట్లను నియమించుకునేందుకు అవకాశం ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులకు ఎరవేసి వారి తరఫున కూడా తమవారిని నియమించుకునే వ్యూహాన్ని పల్నాడు జిల్లాలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పన్నుతున్నట్లు చర్చ జరుగుతోంది. స్వతంత్రంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఉన్న ఏజెంట్లకు బదులు టీడీపీ అభ్యర్థులు సొంత మనుషులను ఏజెంట్లుగా నియమించుకున్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థులు వారి ఏజెంట్లకు మాత్రమే ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. దీంతో స్వతంత్ర అభ్యర్థుల తరఫున తమ అనుచరులను ఏజెంట్లుగా నియమించుకున్నట్టు తెలిసింది. లెక్కింపు కేంద్రం లోపల తమ వారు ఎక్కువ మంది ఉండేలా చూసుకుంటున్నారని, అందుకు ప్రధాన కారణం రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు అధికారులు ప్రకటించగానే తమకు సమాచారం ఇచ్చేలా నమ్మకస్తులను ఏర్పాటు చేసుకున్నట్లు అనుచర వర్గం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అవసరమైతే లోపల గొడవలకు కూడా సిద్ధంగా ఉండేలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, పోలీసులు ఇలాంటి ప్రలోభాలను నిలువరిస్తారా! లేక చేతులు ఎత్తేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. వ్యూహాత్మకంగా స్వతంత్రులుగా రంగంలోకి.. టీడీపీకి చెందిన కొందరినీ ముందుగానే వ్యూహం ప్రకారం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించారు. ఇప్పుడు వారి తరఫున కూడా ఏజెంట్లుగా తెలుగు తమ్ముళ్లే వెళ్లబోతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 15 మంది పోటీలో ఉన్నారు. వీరిలో వివిధ పార్టీల నుంచి 9 మంది బరిలో ఉంటే ఆరుగురు స్వతంత్రులున్నారు. స్వతంత్రులతో పాటు కొందరు బరిలో ఉన్న అభ్యర్థులనూ ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా చివరి ఘట్టమైన కౌంటింగ్ కేంద్రాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని, అనుకూలంగా లేకపోతే గొడవలకు దిగాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
ఉమ్మడి విశాఖలో రౌడీ షీటర్లపై భైండోవర్ ల అస్త్రం
-
ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్‌తో చూసుకోండిలా..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఆరు విడతల పోలింగ్ పూర్తి అయింది. మరో విడత జూన్ 1తో ముగుస్తుంది. దేశ వ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ అన్ని రాజకీయ పార్టీ, సంబంధిత పోలింగ్ ఏజెంట్లు ఫలితాల రోజు తనిఖీ చేయాల్సిన అంశాల చెక్ లిస్ట్ విడుదల చేశారు. ఫలితాల రోజు ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎం మిషన్లను తెరిచే క్రమంలో పాటించాల్సిన సూచనలకు సంబంధించి ఓ చార్ట్ తయారు చేసినట్లు తెలిపారు. ‘‘చాలా మంది ఈవీఎం ట్యాంపర్ అవడానికి అవకాశం ఉందని అంటున్నారు. నేను కచ్చితంగా చెప్పగలను ఈవీఎంలు ట్యాపర్ కావు. ప్రపంచంలో ఈవీఎం మిషన్ ఎక్కడా ట్యాంపర్ కాదు. అందుకే ఈ చెక్ లిస్ట్‌ను విడుదల చేశాం’’ అని కపిల్ సిబల్ అన్నారు.చెక్ లిస్ట్ చార్ట్‌లోని తనిఖీ చేసే అంశాలు ఇవే..1. చార్ట్‌లో కంట్రోల్ యూనిట్ నంబర్, బాలెట్ యూనిట్ నంబర్, వీవీప్యాట్ (VVPAT)ఐడీ ఉంటాయి.2. చార్ట్‌లో మూడో కాలమ్ చాలా ముఖ్యమైంది.4 జూన్2024 అని మూడో కాలమ్‌లో రాసి ఉంటుంది. ఈవీఎం మిషన్ తెరిచిన సమయాన్ని మూడో కాలమ్ కింద రాయాలి.3. ఒక ఒకవేల సమయంలో తేడా వస్తే.. ఆ ఈవీఎం మిషన్ అప్పటికే ఎక్కడో ఒక తెరిచినట్లుగా నిర్ధారణకు రావాలి. కంట్రోల్ యూనిట్(CU) సీరియల్ నంబర్ రాసి ఉన్న ఫార్మాట్లో ఉంటుంది. అక్కడ ఉన్న నంబరల్ మ్యాచ్ చేసుకోవాలి.4. మొత్తం పోలైన ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కౌంటింగ్ సమయంలో ఓట్లు తేలితే సమస్య ఎదురవుతుంది.5. రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి.. పై కాలమ్‌లో వెరిఫికేషన్ పూర్తి అయ్యే వరకు రిజల్ట్ బటన్ నొక్కకూడదు. సమయంలో తేడా వస్తే.. వెలువడిన రిజల్ట్ సమయం కూడా తప్పు అవుతుంది.6. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అక్కడ కూర్చన్న తర్వాత జాగ్రత్తగా చెక్ లిస్ట్‌లోని మొదిటి కాలమ్‌ను పరిశీలించిన అనంతరం ఈవీఎంలను తెరవాలని కోరకుంటున్నాను.#WATCH: Kapil Sibal's EVM ADVICE To Political Parties, Candidates Ahead Of June 4 COUNTING Kapil Sibal Explains What Polling Agents and Leaders of #IndiaAlliance should do before EVM Machines are Opened For Counting.!🎯IMPORTANT UPDATES:▪️I have made a chart for all the… pic.twitter.com/WigELsaH7W— Gururaj Anjan (@Anjan94150697) May 26, 2024 -
Madhya Pradesh Elections 2023: కౌంటింగ్‌కి సన్నద్ధం.. నేతలతో చౌహాన్ భేటీ
భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న ముగిశాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ నేతలతో భోపాల్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. తమ అభ్యర్థులందరితో చర్చలు జరిపామని, కౌంటింగ్ రోజుకి కూడా సిద్ధమయ్యామని చౌహాన్ తెలిపారు. అంతకుముందు మంగళవారం భింద్ జిల్లాలోని అటర్ నియోజకవర్గంలోని కిషుపురా గ్రామంలో ఈసీఐ ఆదేశాల మేరకు రీపోలింగ్ జరిగింది. వీడియోలు తీసి పోలింగ్ గోప్యతను భంగపరిచారని రాష్ట్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ భదోరియా ఫిర్యాదు మేరకు రీపోలింగ్‌ను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే హేమంత్ కటారే బరిలో ఉన్నారు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరిగాయి. మొత్తం 71.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు జరుగుతున్న మిగతా రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌లోనూ డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్
-
గుర్తుండిపోయే గురువారంగా మే 23
-
పోస్టల్ బ్యాలెట్ రూటు ఎటో!
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఉద్యోగుల తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే విషయమై సర్వత్రా ఉత్కం ఠ రేగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో అష్టకష్టాలు పడిన ఉద్యోగ వర్గాలు ఎంతమాత్రం ఆ పార్టీకి అనుకూలంగా ఉండరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 15 నియోజకవర్గాల్లోని ఉద్యోగులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధుల్లో 21,461 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో 19,578 మంది పోస్టల్ బ్యాలెట్లను తీసుకున్నారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 17 వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు రిటర్నింగ్ అధికారుల కార్యాలయూలకు చేరాయి. ఉద్యోగులు ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యేలోగా రిటర్నింగ్ అధికారి కార్యాలయూల్లో ఏర్పాటు చేసిన బాక్సుల్లో బ్యాలెట్ వేసే అవకాశం కల్పించారు. అంటే ఈనెల 16వ తేదీన ఉదయం 7గంటలలోగా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. కౌంటింగ్ రోజున ముందుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ ముగిశాక అభ్యర్థుల వారీగా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఈవీఎంలలో వచ్చిన ఓట్లను కలిపి తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి ఎక్కువేగత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికంగానే పోలయ్యూయని అధికార వర్గాల భోగట్టా. కౌంటింగ్ ప్రారంభమయ్యే లోగా మరిన్ని ఓట్లు పోలవుతారుు. మొత్తంగా ఏయే నియోజకవర్గాల్లో ఎన్నెన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయనేది కౌంటింగ్ అనంతరం గాని వెల్లడి కాదు. ప్రతి నియోజకవర్గంలోను అభ్యర్థుల జాతకాలను తేల్చే విషయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ప్రభావం చూపుతారుు. ఇప్పటివరకూ ఏలూరు నియోజకవర్గం పరిధిలో 2,300 వరకు పోస్టల్ బ్యాలెట్లు పడినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట వెయ్యికి పైగా పోస్టల్ బ్యాలెట్ల వినియోగం జరిగింది. వైఎస్సార్ సీపీకే అనుకూలం వివిధ శాఖల ఉద్యోగుల మధ్య జరుగుతున్న చర్చలను బట్టిచూస్తే వారిలో అత్యధిక శాతం మంది వైఎస్సార్ సీపీకే అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి టీడీపీ అభ్యర్థుల్లో గుబులు రేగుతోంది. కొన్నిచోట్ల వీటిని కొనడానికి వారు ప్రయత్నాలు చేశారు. అయితే, కలెక్టర్ సిద్ధార్థజైన్ సూచన మేరకు ఉద్యోగులంతా ఆత్మప్రభోదం మేరకే ఓటు వేసినట్టు చెబుతున్నారు.