ఏజెంట్ల నియామకం, నేతల సన్నద్ధతపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరా
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీ నేతల సన్నద్ధతపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. సోమవారం పలువురు పార్టీ నేతలకు కేసీఆర్ ఫోన్ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్ల నియామకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
ఓట్ల లెక్కింపు చివరిరౌండ్ పూర్తయ్యే వరకు ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండేలా చూసుకోవాలన్నారు. చాలా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రధాన ప్రత్యరి్థగా గట్టి పోటీనిస్తున్నందున ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. లెక్కింపు ప్రారంభానికి ముందే పార్టీ తరఫున నియమితులైన పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకునేలా ఎంపీ అభ్యర్థులు సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.
ముగిసిన దశాబ్ది ఉత్సవాలు
మూడు రోజులపాటు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరి గిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సోమవారం ముగిశాయి. సిరిసిల్లలో కేటీఆర్ జాతీ య జెండాతోపాటు పార్టీ జెండా ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, శ్రేణులు ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment