రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో గత మూడేళ్లలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో గత మూడేళ్లలో మొత్తం 3200 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1231 మంది మృతి చెందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 23 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినప్పటికీ నిబంధనలు పాటించకుండా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఖర్గోన్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ టీఐ దేవేంద్ర సింగ్ పరిహార్ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు.
జిల్లాలో మొత్తం 24 బ్లాక్ స్పాట్‌లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్‌స్పాట్‌ల వద్ద ప్రమాదాలను తగ్గించేందుకు కలెక్టర్ నేతృత్వంలో అన్ని రోడ్ ఏజెన్సీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రోడ్డు పక్కన ఉన్న పొదలను తొలగించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రోడ్ల విస్తరణ, నగరాల్లో రద్దీ ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపుపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment