దేశంలో శని దేవుని ఆలయాలు చాలానే ఉన్నాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో ఒక ప్రత్యేకమైన శనిదేవుని ఆలయం ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటారు. ఇందుకోసం ఒక డాక్యుమెంట్ తయారు చేసి, శని దేవుని పాదాల చెంత ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుందని వారు నమ్ముతారు. ఇప్పటి వరకు 1,500 మంది వ్యాపారులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు.
ఈ ఆలయం ఖర్గోన్ జిల్లాలోని మోర్ఘడిలో శ్రీ సిద్ధ శని గజానన్ శక్తిపీఠం రూపంలో ఉంది. ఈ దేవాలయం సుమారు 21 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ దేవుని విగ్రహం లేదు. శిల రూపంలో శనిదేవుడు ఇక్కడ కొలువుదీరాడు. ఇక్కడికి వచ్చిన పలువురు వ్యాపారులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారని ఆలయ పూజారి సందీప్ బార్వే తెలిపారు. వారు వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత భాగాన్ని శనిదేవునికి సమర్పిస్తారన్నారు.
మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి, తమ వ్యాపారంలో పురోగతి కోసం శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుంటారు. ఇందుకోసం వారు ఒక దరఖాస్తును వారు నింపుతారు. దానిలో తన వ్యాపారంలో శని దేవుడిని భాగస్వామిగా చేస్తున్నట్లు రాస్తారు. వివాదాస్పద కోర్టు కేసుల నుంచి ఉపశమనం కోరుతూ కూడా పలువురు భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment