ఫస్ట్‌క్రై మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ షేర్లు మంగళవారం దలాల్ స్ట్రీట్ అరంగేట్రంలో పెట్టుబడిదారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఒక్కసారిగా సచిన్ టెండూల్కర్, రతన్ టాటాతో సహా ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు భారీ లాభాలను పొందారు.
బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ మొదటిరోజే 40 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇప్పటికే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. షేర్లు భారీగా పెరగటంతో ఆయన ఒక్కరోజులోనే 3.35 కోట్లకు పైగా లాభం పొందారు. సచిన్ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్‌లో అక్టోబర్ 2023లో రూ. 10 కోట్ల పెట్టుబడులు పెట్టారు. సచిన్ ఒక్కో షేరుకు రూ.487.44 వెచ్చించారు. ఆ షేర్లే ఇప్పుడు భారీగా పెరిగాయి. సచిన్ ఏకంగా కోట్ల లాభాలను పొందగలిగారు.
రతన్ టాటా కూడా రూ.5.50 కోట్లు లాభం పొందారు. 2016లో 77900 ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.84.72 చొప్పున కొనుగోలు చేసేందుకు కంపెనీలో రూ.66 లక్షలు పెట్టుబడి పెట్టారు. లిస్టింగ్‌లో తన పెట్టుబడి రూ.5 కోట్ల మార్కును తాకింది.
బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ ఐపీఓ ఆగష్టు 6 - ఆగస్ట్ 8 మధ్య నడిచింది. ఫస్ట్‌క్రై పేరెంట్ 32 షేర్ల లాట్ సైజుతో ఒక్కో షేరుకు రూ. 440-465 ధర బ్యాండ్‌లో షేర్లను అందించింది. కంపెనీ తన ఐపీఓ నుంచి మొత్తం రూ. 4,193.73 కోట్లను సేకరించింది. ఇది మొత్తం 12.22 రెట్లు కంటే ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment