బిహార్‌ రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా | Bihar Train Mishap: Railways To Give Rs 10 Lakh Ex-Gratia To Kin | Sakshi
Sakshi News home page

బిహార్‌ రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Published Thu, Oct 12 2023 11:07 AM | Last Updated on Thu, Oct 12 2023 11:46 AM

Bihar Train mishap: Railways To Give 10 Lakh Ex Gratia To Kin - Sakshi

బిహార్‌ రైలు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్ర గాయలయ్యాయి. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. 

బిహార్‌లో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బక్సర్‌ సమీపంలో పట్టాలు తప్పింది.  23 బోగీలున్న రైలులోని 21 బోగీలు పట్టాలు తప్పాయి. మూడు బోగీలు పల్టీలు కొట్టాయి. సమాచారం అందుకున్న రెస్యూ టీం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించింది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టాలపై నుంచి బోగీలను అధికారులు తొలగిస్తున్నారు. దెబ్బతిన్న ట్రాక్‌ పునరుద్దరణ పనులు చేపట్టారు.

మృతుల కుంటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రైల్వేశాఖ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా బిహీర్‌ సీఎం నితీష్‌ కుమార్‌ కూడా మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించారు.
చదవండి: కాంగ్రెస్‌ కీలక సమావేశం.. క్యాండీ క్రష్‌ ఆడుతూ ఛత్తీస్‌గఢ్‌ సీఎం 

రైలు ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

ప్రమాదంపై దర్యాప్తు
రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. దెబ్బతిన్న పట్టాల పునరుద్ధరించే ప్రక్రియ పూర్తయ్యిందని పేర్కొన్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని కోచ్‌లను తనిఖీ చేసినట్లు చెప్పారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను కూడా పరిశీలిస్తామని, దీనిపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

బక్సర్‌ నుంచి బయల్దేరిన అరగంటలోపే..
12506 నెంబర్‌ గల నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌  బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ టర్మినల్‌ నుంచి బయలు దేరింది. చివరి స్టేషన్‌ కామాఖ్యకు చేరుకోవడానికి 33 గంటల ప్రయాణించాల్సి ఉంటుంది. బక్సర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరిన అరగంట తర్వాత బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దాదాపు అన్నీ బోగీలు పట్టాలు తప్పాయి .

పలు రైళ్ల రీషెడ్యూల్‌
నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో  ఆ మార్గంలో ప్రయాణించే మొత్తం 40 రైలు ప్రభావితమయ్యాయి. 21 రైళ్లను దారిమళ్లీంచగా.. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఎలక్ట్రిక్‌ వైర్లు, పోల్స్‌, రైలు పట్టాలు ధ్వసం అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో సమాచారం, సాయం కోసం ప్రయాణికులకు రైల్వే అధికారులు అత్యవసర హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేశారు. 

పాట్నా రైల్వే స్టేషన్‌- 9771449971
ధనాపూర్‌ రైల్వే స్టేషన్‌- 8905697493
అర జంక్షన్‌- 8306182542
కమర్షియల్‌- నార్త్‌ సెంట్రల్‌ రైల్వేస్‌- 7759070004

ప్రయాగ్‌రాజ్‌
0532-2408128
0532-2407353
0532-2408149

కాన్పూర్‌
0512-2323016
0512-2323018
0512-2323015

ఫతేపూర్‌
05180-222026
05180-222025
05180-222436

తుండ్ల
05612-220338
05612-220339
05612-220337

ఇతావా
7525001249

అలీఘర్‌
2409348

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement