bihar Train accident
-
బిహార్ రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా
బిహార్ రైలు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్ర గాయలయ్యాయి. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. బిహార్‌లో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ బక్సర్ సమీపంలో పట్టాలు తప్పింది. 23 బోగీలున్న రైలులోని 21 బోగీలు పట్టాలు తప్పాయి. మూడు బోగీలు పల్టీలు కొట్టాయి. సమాచారం అందుకున్న రెస్యూ టీం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించింది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టాలపై నుంచి బోగీలను అధికారులు తొలగిస్తున్నారు. దెబ్బతిన్న ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు. మృతుల కుంటుంబాలకు రూ.10 లక్షల పరిహారం రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రైల్వేశాఖ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా బిహీర్ సీఎం నితీష్ కుమార్ కూడా మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించారు. చదవండి: కాంగ్రెస్ కీలక సమావేశం.. క్యాండీ క్రష్ ఆడుతూ ఛత్తీస్‌గఢ్ సీఎం రైలు ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ప్రమాదంపై దర్యాప్తు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. దెబ్బతిన్న పట్టాల పునరుద్ధరించే ప్రక్రియ పూర్తయ్యిందని పేర్కొన్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని కోచ్‌లను తనిఖీ చేసినట్లు చెప్పారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను కూడా పరిశీలిస్తామని, దీనిపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. A Terrible Train Accident Happened Near #Buxar In Bihar Last Night 🙏🙏. #TrainAccident #NorthEastExpress pic.twitter.com/wiOSDCr7si — Sai Mohan 'NTR' (@sai_mohan_9999) October 12, 2023 బక్సర్ నుంచి బయల్దేరిన అరగంటలోపే.. 12506 నెంబర్ గల నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆనంద్ విహార్ టర్మినల్ నుంచి బయలు దేరింది. చివరి స్టేషన్ కామాఖ్యకు చేరుకోవడానికి 33 గంటల ప్రయాణించాల్సి ఉంటుంది. బక్సర్ స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంట తర్వాత బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దాదాపు అన్నీ బోగీలు పట్టాలు తప్పాయి . పలు రైళ్ల రీషెడ్యూల్ నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఆ మార్గంలో ప్రయాణించే మొత్తం 40 రైలు ప్రభావితమయ్యాయి. 21 రైళ్లను దారిమళ్లీంచగా.. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఎలక్ట్రిక్ వైర్లు, పోల్స్, రైలు పట్టాలు ధ్వసం అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో సమాచారం, సాయం కోసం ప్రయాణికులకు రైల్వే అధికారులు అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. పాట్నా రైల్వే స్టేషన్- 9771449971 ధనాపూర్ రైల్వే స్టేషన్- 8905697493 అర జంక్షన్- 8306182542 కమర్షియల్- నార్త్ సెంట్రల్ రైల్వేస్- 7759070004 ప్రయాగ్‌రాజ్ 0532-2408128 0532-2407353 0532-2408149 కాన్పూర్ 0512-2323016 0512-2323018 0512-2323015 ఫతేపూర్ 05180-222026 05180-222025 05180-222436 తుండ్ల 05612-220338 05612-220339 05612-220337 ఇతావా 7525001249 అలీఘర్ 2409348 -
బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. 37మంది దుర్మణం
ఖగారియా: బీహార్‌లో ఘోరం జరిగిపోయింది. రైల్వే ట్రాక్ దాటుతున్నవారిపైకి ఎదురుగా వస్తున్న మరో రైలు దూసుకుపోవడంతో 37 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 13 మంది మహిళలు, నలుగురు పిల్లలున్నారు. మరో 24 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పాట్నాకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖగారియా జిల్లాలోని ధమారాఘాట్ స్టేషన్లో సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది. కళ్లముందే తమ వారంతా పట్టాల కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోవడంతో వారి బంధువులు ఆగ్రహోదగ్రులయ్యారు. రైల్వేస్టేషన్‌లోకి చొరబడి విధ్వంసానికి దిగారు. ఏసీ కోచ్ సహా ఆరు బోగీలు, ఇంజిన్‌కు నిప్పంటించారు. కొందరు రైల్వే ఉద్యోగులను బందీలుగా పట్టుకున్నారు. ప్రమాదంపై ప్రధాని మన్మోహన్సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సానుభూతి ప్రకటించారు. స్థానికులు ఆవేశానికి లోను కావొద్దని, సంయమనం పాటించాలని ప్రధాని కోరారు. ఈ ఘటనపై రైల్వేశాఖ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష పరిహారం ప్రకటించింది. ప్రమాదం ఎలా జరిగిందంటే: సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ధమారాఘాట్ స్టేషన్‌కు వచ్చి ఆగింది. ఈ రైలు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దిగారు. పవిత్ర శ్రావణ మాసం.. అందులోనూ సోమవారం కావడంతో వీరంతా సమీపంలోని కాత్యాయనిస్థాన్ ఆలయంలో శివలింగానికి జలాభిషేకం చేయడానికి వెళ్తున్నారు. అవతలి వైపు వెళ్లడానికి ట్రాక్ దాటుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరోవైపు నుంచి సహర్సా-పాట్నా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ 80 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చింది. వాస్తవానికి ఈ ఎక్స్‌ప్రెస్ ధమారాఘాట్ స్టేషన్లో ఆగదు. దీంతో డ్రైవరు అదే వేగంతో రైలును పోనివ్వడం, పట్టాలపై నడుస్తున్నవారంతా చక్రాల కింద పడిపోయి చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. మృతులంతా ఖగారియా, సహర్సా, ముంగర్, నౌగాచియా ప్రాంతాలకు చెందినవారు. ‘‘సహర్సా-పాట్నా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌కు ధమారాఘాట్లో హాల్ట్ లేదు. దీంతో అధికారులు రైలు ముందుకు వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. రైలు ఆగుతుందేమో అన్న ఉద్దేశంతో యాత్రికులు ట్రాక్ దాటారు. వారి దగ్గరికి రాగానే డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులను నొక్కారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది’’ అని రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్ర కుమార్ చెప్పారు. ప్రమాదం తర్వాత మృతుల బంధువులు, స్థానికులు సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు బోగీలు, ఇంజిన్ తోపాటు సహర్సా-పాట్నా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఏసీ కోచ్‌కు నిప్పు పెట్టారు. ఘటన జరిగిన అనంతరం ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్లు రాజారాం పాశ్వాన్, సుశీల్ కుమార్ సుమన్ అక్కడ్నుంచి పారిపోయారు. తర్వాత తాము క్షేమంగానే ఉన్నట్టు రైల్వే అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. రాష్ట్ర నిర్లక్ష్యం లేదు: సీఎం నితీశ్ ప్రమాదం వెనుక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీ లేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. మృతుల కుటుంబీకులకు రూ.2 లక్షల పరిహారం ఇస్తామని, క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స చేయిస్తామని ప్రకటించారు. ప్రమాదం విషయం తెలియగానే ఖగారియా, సహర్సా జిల్లాల నుంచి రాష్ట్ర అధికారులను పంపామని, అయితే సరైన రోడ్డు మార్గం లేకపోవడం, మధ్యలో ఓ బ్రిడ్జి పాడవడంతో రెండు జిల్లాల నుంచి ఎక్కడ్నుంచి వెళ్లినా మూడు గంటలపాటు కాలినడకన వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. రైల్వేశాఖ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ఇందుకు సమాధానం చెప్పాల్సింది ఆ శాఖ వారే అని బదులిచ్చారు. ఇది అత్యంత అరుదుగా జరిగే ప్రమాదాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. పూర్తి దర్యాప్తు తర్వాతే అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ప్లాట్‌ఫాం లేకున్నా కిందకు దిగారు: రైల్వేమంత్రి ఖర్గే ప్రమాదంపై రైల్వేమంత్రి మల్లిఖార్జున ఖర్గే సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. ‘‘ధమారాఘాట్ స్టేషన్ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఆగాయి. ఇందులోంచి కొందరు ప్రయాణికులు ప్లాట్‌ఫాం లేని వైపు దిగారు. అదే సమయంలో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ వచ్చింది. మలుపుగా ఉండడంతో డ్రైవర్‌కు పట్టాలపై ఉన్నవారు సరిగ్గా కనిపించలేదు. అయినా కొంతదూరం రాగానే అత్యవసర బ్రేకులు వేసినా అప్పటికే ప్రమాదం జరిగిపోయింది’’ అని ఆయన వివరించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. సహాయక సిబ్బందితో కూడిన రైలు ఘటనా ప్రాంతానికి 11 గంటల సమయంలో చేరుకుందని చెప్పారు. -
బీహార్ రైలు ప్రమాద దృశ్యాలు
-
35కి చేరిన బీహార్ రైలు ప్రమాద మృతుల సంఖ్య
పాట్నా : బీహార్ రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 35కి పెరిగింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ సోమవారం తెల్లవారుజామున భమారా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు డ్రైవర్‌ను లాగి కొట్టడమే కాక, కొన్ని బోగీలకు నిప్పు పెట్టారు. కాగా మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలే ఉన్నారు. బాధితుల్లో చాలామంది కన్వారియాలు (శివభక్తులు). వీరంతా పట్టాల మీద నిలబడి ఆందోలన చేస్తు ఉండగా, రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. తూర్పు రైల్వే పరిధిలోని సమస్తిపూర్ డివిజన్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు. దుర్ఘటన జరిగిన తర్వాత కొంత దూరం వెళ్లి రైలు ఆగిపోయింది. ఈ ప్రమాదం ఫలితంగా ఆ మార్గంలో కొంత సేపటి పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. కాగా రాజ్యమణి ఎక్స్‌ప్రెస్‌కు ధమారా రైల్వేస్టేషన్లో హాల్ట్ లేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. అయితే రైలును ఆపేందుకు ప్రయాణికులు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో 35మంది దుర్మరణం చెందినట్లు కజారియా లోక్‌సభ ఎంపీ దినేష్ చంద్ర యాదవ్ వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.