వయనాడ్‌ అప్‌డేట్స్‌: కర్నాటక ఆపన్న హస్తం | Wayanad landslide: day five Rescue operations continuing wayanad updates | Sakshi
Sakshi News home page

కకావికలమైన వయనాడ్‌: ఐదో రోజు సెర్చ్‌ ఆపరేషన్‌.. అప్‌డేట్స్‌

Published Sat, Aug 3 2024 10:11 AM | Last Updated on Sat, Aug 3 2024 2:02 PM

Wayanad landslide: day five Rescue operations continuing wayanad updates

Updates

  • కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఐదో రోజు సెర్చ్‌, రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ ఘటనలో గల్లంతైన వారిపై ఆచూకీ కోసి రెస్క్యూ బృందాలు ప్రధానంగా దృష్టిపెట్టాయి. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు, జగిలాలను ఉపయోగించి మనుషుల జాడను గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ తాజా గణాంకాలతో.. మృతుల సంఖ్య 358కి చేరుకుంది. ఇందులో 146  మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • వయనాడ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 215 మృతదేహాలు వెలికి తీశామని, 206 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు.

      

  • వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని  అన్నారు.
     

100 ఇళ్లులు నిర్మిస్తాం: కర్ణాటక సీఎం

  • వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
  • ఈ విషయం కేరళ సీఎం పినరయి విజయన్‌కు తెలిపినట్లు ఎక్స్‌లో పోస్ట్‌

 

  •   కొండ చరియలు విరిగిపడటంతో గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు నేటికీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

    సైన్యానికి సలాం
     
  • వయనాడ్‌ విపత్తు నాటి నుంచి సహాయక చర్యల్లో భారత సైన్యం పోషిస్తున్న పాత్ర అమోఘం. తక్షణ వారధిల నిర్మాణం దగ్గరి నుంచి.. వరదల్లో చిక్కుకున్నవాళ్లను రక్షించడానికి దాకా.. అంతటా సాహసం ప్రదర్శిస్తోంది. తాజాగా.. ఓ కుటుంబాన్ని రక్షించడంపై సీఎం పినరయి విజయన్‌  స్పందించారు.  ‘‘వయనాడ్‌లో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందం 8 గంటలపాటు శ్రమించి, ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం.. పునర్నిర్మించుకుందాం’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 
     
  • కల్పేట ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కె.హాషిస్‌ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నా.. సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకొని ఉండడాన్ని బృందం గమనించింది. వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు.

 

  • అక్కడ పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకొని ఉండగా వారిని రక్షించారు. కాగా వారు కొద్దిరోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ అధికారి తెలిపారు. దీంతో తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామన్నారు. తమతో రావాల్సిందిగా వారిని కోరగా ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎంతో బతిమాలగా వారి తండ్రి ఒప్పుకున్నారని తెలిపారు. పిల్లలు ఇద్దరినీ తమ శరీరాలకు కట్టుకొని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. అనంతరం వారిని అత్తమాల యాంటీపోచింగ్ కార్యాలయానికి తరలించినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వారు అక్కడ సురక్షితంగా ఉన్నారన్నారు.
     
  • రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. సహాయక బృందాన్ని కొనియాడారు.

 

 

  • ముఖ్యమంత్రి పినరయ విజయన్‌, ఆయన భార్య టీ.  కమలా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు  రూ. లక్షా 33 వేల విరాళం ప్రకటించారు.  
  • ఆరు జోన్లతో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 
  • రెస్క్యూ ఆపరేషన్స్‌లో డీప్ సెర్చ్ రాడార్‌లను పంపాలని  కేంద్రానికి కేరళ ప్రభుత్వం  విజ్ఞప్తి చేసింది. దీంతో నార్తర్న్ కమాండ్ నుంచి ఒక జేవర్ రాడార్‌, ఢిల్లీ, తిరంగ మౌంటైన్ రెస్క్యూ ఆర్గనైజేషన్ నుంచి నాలుగు రీకో రాడార్‌లను ఇవాళ వయనాడ్‌కు ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలించారు.

వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌  స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు. గతంలో ఆయనకు ఆర్మీ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా ఇచ్చింది. టెరిటోరియల్‌ ఆర్మీలో కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌.. విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశమయ్యారు. వాళ్ల సేవల్ని కొనియాడారు. కోజికోడ్‌ నుంచి రోడ్‌ మార్గంలో వయనాడ్‌కు వెళ్లి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. అంతకు ముందు.. వయనాడ్‌ కొండచరియలు విరిగిన పడిన ప్రాంతాల్లో పునరావాసం కోసం రూ.3 కోట్లు విరాళం ఇచ్చారాయన. 

 

  • మలయాళ నటుడు మోహన్‌లాల్‌ వయనాడ్‌లోని కొండరియలు విరిగినపడిన ప్రాంతాన్ని సందర్శించారు. సహాయక, గాలింపు చర్యలు చేపట్టిన  ఆర్మీ సైనికులతో పరిశీలించారు. ఆయనకు ఆర్మీ అధికారులు ప్రమాద తీవ్రతను వివరించారు. 
     

  •  

 

 

ఇండియన్ ఆర్మీ జవాన్లు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్‌  కోసం ఉపయోగించే యంత్రాలు తీసుకువెళ్లడానికి తాత్కాలిక వంతెనను నిర్మించారు. ఇంకా 300 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

 

దీంతో కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతోపాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అత్తమల అరాన్‌మల, ముండక్కై, పుంచిరిమట్టం, వెల్లరిమల, జీవీహెచ్‌ఎస్‌ఎస్‌ వెల్లరిమల, నదీతీరం ఇలా కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement