కేరళలోని వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌తో పాటు రిటైర్డ్ మేజర్, నటుడు A. K. రవీంద్రన్ పాల్గొన్న విషయం తెలిసిందే. వయనాడ్ పర్యటన సందర్భంగా యూనిఫాం దుర్వినియోగం చేసినందుకు మేజర్ రవిపై మరో రిటైర్డ్ అధికారి ఫిర్యాదు చేశారు.
విపత్తు బారిన పడిన వాయనాడ్ ప్రాంత పర్యటనలో ఆర్మీ యూనిఫాం దుర్వినియోగం చేశారనే ఆరోపణలు సినీ దర్శకుడు, మేజర్ రవి ఎదుర్కొంటున్నారు. ఆర్మీ రిటైర్డ్ అధికారి అరుణ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, రక్షణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సైన్యంలో పదవీ విరమణ పొందిన తర్వాత ఎవరూ కూడా మళ్లీ సైనిక యూనిఫామ్ ధరించడం నిషేధం. డిఫెన్స్ సర్వీస్ నిబంధనలను మేజర్ రవి ఉల్లంఘించారని ఆరుణ్ ఆరోపించారు. వాస్తవంగా రవీంద్రన్ ఇండియన్ ఆర్మీలో అత్యున్నత స్థానంలో పనిచేసి మేజర్ ర్యాంక్ వరకు చేరుకుని ఆపై రిటైర్డ్ అయ్యారు.
అయితే, ఆర్మీ దుస్తులు ధరించి ఫోటోలు తీయడం ఆపై వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి చర్యలకు మేజర్ రవి పాల్పడ్డారని అరుణ్ విమర్శించారు. ఇలాంటి పనులు చేయడం వల్ల సైనిక యూనిఫామ్ సమగ్రతను దెబ్బతినడంతో పాటు తీవ్రమైన భద్రతా సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన నెటిజన్ల నుంచి కూడా విస్తృతమైన ఎదురుదెబ్బకు దారితీసింది, నెట్టింట కూడా మేజర్ రవి తీరును ఖండించారు.
మేజర్ రవి, నటుడు మోహన్‌లాల్‌తో కలిసి వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సందర్శించారు. విపత్తులో తీవ్రంగా దెబ్బతిన్న స్థానిక పాఠశాలను పునర్నిర్మించడానికి సహాయం చేస్తానని చెప్పి ఆ పని చేసినందుకు ఆయన్ను అందరూ అభినందించారు. కానీ, ఒక విషాదం-బాధిత ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఈ విమర్శలకు దారితీసింది. మేజర్ రవి సినిమా రంగంలో కూడా పనిచేశారు. దర్శకుడగా మాత్రమే కాకుండా నటుడిగా పలు సినిమాల్లో మెప్పించారు. అలా ఆయనకు ఆర్మీ, సినిమా రంగాల్లో సత్తా చాటారు.
Comments
Please login to add a commentAdd a comment