
కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జులై 29 నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మఖ్యంగా వయనాడ్ ప్రాంత ప్రజలు భారీగ నష్టపోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలు చిత్ర పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్ సాయం చేసి అండగా నిలిచారు. అయితే, తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా భారీ విరాళం అందించారు.

మక్కల్ నీది మయ్యం అనే రాజకీయ పార్టీని స్థాపించిన కమల్ హాసన్ సినిమాలతో పాటు సామాజిక అంశాలపై తన నిబద్ధతను ప్రదర్శింస్తారు. భారీ వర్షాల వల్ల వయనాడ్ ప్రజలు తీరని కష్టాలను ఎదుర్కొంటుకున్నారు. వారిని ఆదుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు విరాళంగా అందించారు. చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తుగా ఈ ఘటన మిగిలిపోతుందని ఆయన కామెంట్ చేశారు.
చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో సుమారు 320 మందికి పైగా మరణించారు. 250 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రాణాలతో బయటపడినవారి కోసం వెతకడానికి డ్రోన్ ఆధారిత రాడార్ సాంకేతికతను అక్కడి ప్రభుత్వం అనుసరిస్తుంది.

కమల్ హాసన్‌కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో గతం నుంచే సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో కమల్ హాసన్ చేసిన విరాళం చాలా ముఖ్యమైనది. ఆయనతో బలమైన బంధాన్ని పంచుకున్నారు. వారిద్దరూ కూడా అనేక సందర్భాల్లో భేటీ అయిన విషయం తెలిసిందే.