కేరళకు విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్‌ చరణ్‌ | Chiranjeevi And Ram Charan Donate Rs 1 Crore To Kerala CM Relief Fund For Wayanad Landslides, Tweet Inside | Sakshi
Sakshi News home page

Wayanad Landslides: కేరళకు విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్‌ చరణ్‌

Published Sun, Aug 4 2024 2:37 PM | Last Updated on Sun, Aug 4 2024 3:11 PM

Chiranjeevi And Ram Charan Help To Kerala CM Relief Fund

కేరళలోని వయనాడ్‌లో ప్రస్తుతం కురుస్తోన్న భారీ వర్షాలకు  కొండ చరియలు విరిగిపడి వందల మంది మరణించిన సంగతి తెలిసిందే! ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు తొలి రోజు నుంచే ఆర్మీ రంగంలోకి దిగింది. కానీ, చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కనీస అవసరాల కోసం అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందకు సౌత్‌ ఇండియా సినిమా హీరోలు ఒక్కోక్కరిగా ముందుకు వస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి అ‍ల్లు అర్జున్‌ మొదటగా రూ. 25 లక్షలు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ భారీ విరాళం అందించి తమ మంచి మనసు చాటుకున్నారు.

గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం వల్ల వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యానని చిరంజీవి పేర్కొన్నారు. వారికి అండగా నిలిచేందుకు తమ వంతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 1 కోటి విరాళం అందిస్తున్నట్లు చిరంజీవి, చరణ్‌ పేర్కొన్నారు. జల ప్రళయం వల్ల నష్టపోయి బాధలో ఉన్న వారందరూ త్వరగా కోలుకోవాలని, ఆ శక్తి దేవుడు వారికి అందించాలని  ప్రార్థస్తున్నట్లు తన ఎక్స్‌ పేజీలో మెగాస్టార్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేరళకు వచ్చిన విరాళాలలో మోహన్‌ లాల్‌ తర్వాత చిరంజీవి, రామ్‌ చరణ్‌ అందించిన మొత్తమే అత్యధికమని చెప్పవచ్చు. మోహన్‌ లాల్‌ రూ. 3 కోట్లు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement