వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 300 మందికి పైగా ఆచూకి లభించలేదు. ఈ ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వయనాడ్‌లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో మోహన్ లాల్ పర్యటించారు. నష్టపోయిన వారికి తన వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
మోహన్ లాల్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 9 జూలై 2008న, అతను అధికారికంగా లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో టెరిటోరియల్ ఆర్మీకి అప్పటి ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ చేత చేర్చబడ్డారు. ఈ గౌరవం అందుకున్న తొలి నటుడు ఆయనే. 2012లో, అతనికి దక్షిణ కొరియాలోని కుక్కివాన్ నుంచి టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ గౌరవ బిరుదు లభించింది. ఈ బిరుదుతో సత్కరించిన తొలి దక్షిణ భారత నటుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు.
వయనాడ్ బాధితులకు సాయం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ముందుకొస్తున్నారు. మోహన్ లాల్ కేరళ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళంగా కూడా అందించారు. ఆపై ఇప్పుడు తానే బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment