వయనాడ్‌ విపత్తు: సహాయక చర్యల్లో వైమానిక హెలికాప్టర్లు | Massive landslide in Kerala's Wayanad, Air Force helicopters will join rescue operations | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ విపత్తు: సహాయక చర్యల్లో వైమానిక హెలికాప్టర్లు

Published Tue, Jul 30 2024 8:34 AM | Last Updated on Tue, Jul 30 2024 10:11 AM

Massive landslide in Kerala's Wayanad, Air Force helicopters will  join rescue operations

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌ జిల్లా మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మృతుల్లో  ఒక చిన్నారి, ఒక విదేశీయుడు ఉన్నారు. భారీ వర్షం మధ్యే సహయక చర్యలు కొనసాతున్నాయి. చీకటి, భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం యంత్రాంగం మొత్తం సహయాక చర్యల్లో పాల్గొనాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ ఆదేశాలు జారీ చేశారు. 

 

250 మంది ఫైర్ అండ్ రెస్క్యూ, సివిల్ డిఫెన్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, లోకల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సభ్యులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అదనపు బృందాలను వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు వైమానిక దళ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.

 

శిథిలాల కింద వందలాది మంది చిక్కకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. భారీ విరిగిన పడిన కొండచరియలు, భారీ వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వయనాడ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని నెటిజన్లు ప్రార్థనలు చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement