Nehru Mountaineering Institute Trainees Trapped In Uttarakhand - Sakshi
Sakshi News home page

మంచు కొండచరియల బీభత్సం.. పర్వతారోహకులు మృతి!

Published Tue, Oct 4 2022 2:40 PM

Nehru Mountaineering Institute  Trainees Trapped In Uttarakhand - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో మంచు కొండచరియలు విరిగిపడి బీభత్సం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 28 మంది పర్వతారోహకులు మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస​్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. 

ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి స్పందించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ద్రౌపది దండ-2 పర్వతంలో హిమపాతం కారణంగా నెహ్రూ పర్వతారోహణ సంస్థకు చెందిన 28 మంది ట్రైనీలు మంచులో చిక్కుకుని మృతిచెందినట్టు సమాచారం అందింది. జిల్లా యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించింది అని వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement