Snow mountain
-
మంచు‘మాయం’
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతోంది. మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి. హిమానీనదాలు క్రమంగా మాయమైపోతున్నాయి. ఆసియాలోని హిందూ కుష్‌తో పాటు పెరూ మంచు పర్వతాల్లోని హిమానీనదాల తగ్గుదల పర్యావరణవేత్తలను, శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలోని హిమానీనదాల్లో దశాబ్ద కాలంలో 332 గిగాటన్నుల మంచు అదృశ్యమైందని అంచనా. ఇక ఆసియాలోని హిందూ కుష్ హిమాలయాలు అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, భారత్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్ మీదుగా 3,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఇవి వేగంగా కరిగిపోతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి వాటి పరిమాణంలో 75 శాతం వరకు కోల్పోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే.. ఈ హిమానీనదాల దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయని, తీవ్ర నీటి ఎద్దడి తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాదాపు 200 కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. హిమాలయ పర్వతాల దిగువున ఉన్న 12 హిమానీనదాల్లోని నీటి లభ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరెస్ట్ శ్రేణుల్లో గత 30 ఏళ్లలోనే 2 వేల సంవత్సరాలకు సంబంధించిన మంచు కరిగిపోయిందని పరిశోధకులు తేల్చారు. భూతాపంతో భారీ నష్టం.. భూతాపాన్ని 1.5 డిగ్రీల వద్ద కట్టడి చేయడంలో ప్రపంచ దేశాలన్నీ విఫలమయ్యాయి. ఫలితంగా సెప్టెంబర్ 17న భూతాపం 2 డిగ్రీల మార్కును చేరుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే హిందూకుష్ హిమానీ నదాలు 2100వ సంవత్సరం నాటికి 30 నుంచి 50 శాతం మేర కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భూతాపం 3 డిగ్రీల మార్కుకు చేరితే నేపాల్, భూటాన్లలో 75 శాతం మేర మంచు కరిగిపోయే ప్రమాదముంది. అదే 4 డిగ్రీలకు పెరిగితే నష్టం 80 శాతానికి చేరుకుంటుంది. పెరూలో దారుణ పరిస్థితి.. ప్రపంచంలోని ఉష్ణమండల హిమానీనదాల్లో 68 శాతం పెరూలో ఉన్నాయి. గత ఆరు దశాబ్దాల్లో తలెత్తిన వాతావరణ మార్పుల వల్ల పెరూలోని హిమానీనదాల వైశాల్యం సగానికి పైగా తగ్గిపోయింది. 2016– 2020 మధ్య తలెత్తిన వాతావరణ మార్పులతో 175 హిమానీనదాలు అంతరించిపోయినట్టు పెరూవియన్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి తాజా పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పెరూలోని కొన్ని పర్వత శ్రేణుల్లో ప్రస్తుతం 1,050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే మంచు ఉంది. 1962వ సంవత్సరంలో 2,399 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం ఇలాగే కొనసాగితే పెను వినాశనం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. -
సిక్కింలో భారీ హిమపాతం.. ఏడుగురు పర్యాటకులు సజీవ సమాధి..
గ్యాంగ్టాక్: మంచుసోయగాలు, ప్రకృతి రమణీయతను చూసేందుకు వచ్చిన పర్యాటకులను ప్రకృతి హిమపాతం రూపంలో కబళించింది. సిక్కింలోని హిమాలయ పర్వతసానువుల్లోని లోయ మార్గం నాథూలా ప్రాంతంలో మంగళవారం సంభవించిన భారీ హిమపాతం ధాటికి ఏడుగురు పర్యాటకులు మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నారు. 11 మంది గాయపడ్డారు. ఐదారు వాహనాలతోసహా దాదాపు 30 మంది మంచు దిబ్బల కింద చిక్కుకున్నారన్న అనుమానాలతో అక్కడ అన్వేషణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్యాంగ్టాక్, నాథూ లాను కలిపే జవహర్లాల్ నెహ్రూ మార్గంలోని 14వ నంబర్ మైలురాయి వద్ద ఉదయం 11.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వద్దన్నా వినకుండా.. ప్రమాదం విషయం తెలియగానే సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) సిబ్బంది, రాష్ట్ర విపత్తు స్పందన దళం, స్థానికులు అక్కడికి చేరుకుని 23 మందిని కాపాడారు. నెహ్రూ మార్గ్‌లో ఆగిపోయిన 80 వాహనాల్లోని 350 మందికిపైగా పర్యాటకులను సురక్షితంగా వెనక్కి పంపించారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా 13వ నంబర్ మైలురాయి దాటాక సాధారణంగా పర్యాటకులకు అనుమతి ఉండదు. కానీ, పర్యాటకులు ఘటనాస్థలి దాకా తీసుకెళ్లాలని టూర్ ఆపరేటర్లు, డ్రైవర్లను బలవంతపెట్టారని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు. చైనా సరిహద్దు సమీపంలో నాథూ లా మార్గముంది. వాణిజ్య సంబంధ రాకపోకలకు భారత్, చైనాలు వినియోగిస్తున్న మూడు సరిహద్దు పోస్ట్‌లలో నాథూ లా ఒకటి. సముద్రమట్టానికి 14,450 అడుగుల ఎత్తులోని మంచుమయమైన ఈ ప్రాంతాలను చూసేందుకు ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలిరావడం తెల్సిందే. గ్యాంగ్టాక్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతముంది. ప్రమాదం జరిగాక క్షతగాత్రులను గ్యాంగ్‌టాక్‌కు పంపించి చికిత్సనందిస్తున్నారు. చదవండి: విషాదం.. సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఊపిరాడట్లేదని అరిచిన పారిశుద్ధ్య కార్మికులు.. కాసేపటికే.. -
మంచు కొండచరియల బీభత్సం.. పర్వతారోహకులు మృతి!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మంచు కొండచరియలు విరిగిపడి బీభత్సం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 28 మంది పర్వతారోహకులు మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ద్రౌపది దండ-2 పర్వతంలో హిమపాతం కారణంగా నెహ్రూ పర్వతారోహణ సంస్థకు చెందిన 28 మంది ట్రైనీలు మంచులో చిక్కుకుని మృతిచెందినట్టు సమాచారం అందింది. జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది అని వెల్లడించారు. #Update | Rapid, relief and rescue operations are underway to rescue 28 trainee mountaineers trapped after an avalanche in Uttarakhand. pic.twitter.com/LOuU8iGaOR — NDTV (@ndtv) October 4, 2022 -
మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే!
వాతావరణ మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. పాకిస్తాన్లో వరద బీభత్సం, చైనాలో కరువు కాటకాలు, భారత్‌లో కనీవినీ ఎరుగని వాతావరణ మార్పులు... వీటన్నింటికీ అదే కారణమని భారతీయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చోటా షిగ్రి హిమానీ నదాన్ని వారు కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఈ ఏడాది రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు వెల్లడైంది. గత జూన్‌లో ఏర్పాటు చేసిన డిశ్చార్జ్ మెజరింగ్ వ్యవస్థ ఆగస్టుకల్లా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఇండోర్ ఐఐటీ గ్లేసియాలజిస్ట్ మహమ్మద్ ఫరూక్ ఆజం చెప్పారు. ‘‘గత మార్చి, ఏప్రిల్‌లో మన దేశంలో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టాయి. హిమానీ నదాలు కరిగిపోవడమే అందుకు కారణం. గత వారం మా బృందమంతా షిగ్రి దగ్గరే ఉండి పరీక్షించాం. మంచు భారీగా కరిగిపోతోంది’’ అంటూ ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అరేబియా సముద్రంలో అత్యధిక వేడిమి కారణంగా నీరంతా ఆవిరి మేఘాలుగా మారి ఎడతెరిపి లేకుండా వానలు కురిసి లానినో ప్రభావం ఏర్పడింది. దాంతో వాతావరణమే విపత్తుగా మారి పాక్‌ను అతలాకుతలం చేస్తోంది’’ అన్నది శాస్త్రవేత్తల వివరణ. హిమాలయాలు కరిగిపోతే...? గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు హిమాలయాల్లో మంచు గత నాలుగు దశాబ్దాల్లో కరిగిన దాని కంటే 2000–2016 మధ్య ఏకంగా 10 రెట్లు ఎక్కువగా కరిగిపోయింది! దక్షిణాసియా దేశాలకు ఇది పెను ప్రమాద హెచ్చరికేనంటున్నారు. కారకోరం, హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 55 వేల హిమానీ నదాలున్నాయి. హిమాలయ నదులైన గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర 8 దేశాల్లో 130 కోట్ల మంది మంచినీటి అవసరాలు తీరుస్తున్నాయి. 5,77,000 చదరపు కిలోమీటర్లలో వ్యవసాయ భూములకు నీరందిస్తున్నాయి. 26,432 మెగావాట్ల సామర్థ్యం ఉన్న హైడ్రోపవర్ స్టేషన్లున్నాయి. హిమాలయాల్లో మంచు కరిగిపోతే వీటన్నింటిపైనా ప్రభావం పడటమే గాక 2050 నాటికి దక్షిణాసియా దేశాల్లో 170 కోట్ల మందికి నీటికి కటకట తప్పదని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దేశాల మధ్య నీటి కోసం యుద్ధాలూ జరగవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో పాకిస్తాన్ వాటా కేవలం 1 శాతమే. కానీ వాతావరణ మార్పులు ఇప్పుడు ఆ దేశాన్ని బలి తీసుకుంటున్నాయి. చైనాలో కరువు సంక్షోభం ► 17 ప్రావిన్స్‌లలో వరసగా 70 రోజుల పాటు ఎండలు దంచిగొట్టాయి. వడగాడ్పులకి 90 కోట్ల మంది అవస్థలు పడ్డారు ► చైనాలో ఏకంగా సగ భాగంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి ► చైనాలో అతి పెద్ద నది యాంగ్జె ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. 1865 తర్వాత ఈ నది నీటిమట్టం బాగా తగ్గిపోవడం మళ్లీ ఇప్పుడే. ► చైనాలోని దక్షిణ ప్రావిన్స్‌లైన హుబై, జియాంగ్జీ, అన్‌హుయాయ్, సిచుయాన్‌లలో నీళ్లు లేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడుతున్నాయి ► చైనాలో జల విద్యుత్‌లో 30శాతం సిచుయాన్ ప్రావిన్స్ నుంచే వస్తుంది. ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయింది ► చైనాలో కరువు పరిస్థితులు 25 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపిస్తే, 22 లక్షలకు పైగా హెక్టార్లలో వ్యవసాయ భూమి ఎండిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆశ్చర్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు!
వాషింగ్టన్: అద్బుతమైన దృశ్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికిన సంఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మంచు కొండ పర్యటనకు వెళ్లిన వ్యక్తి.. అక్కడి మంచులో కూరుకుపోవడంతో అతడిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. కానీ 45 నిమిషాల తర్వాత అతడి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించడంతో అతడు మృత్యుంజయుడు అయ్యాడు. ఇంతకి ఆ అదృష్టవంతుడు ఎవరంటే అమెరికాకు చెందిన మైఖేల్ నాపిన్క్సి. 45 ఏళ్ల వయసున్న అతడు కాలినడకన దేశ పర్యటన చేస్తుంటాడు. ఈ క్రమంలో గతవారం తన స్నేహితుడితో కలిసి అమెరికాలోని మౌంట్ రైనర్ నేషనల్ పార్క్‌లోని మంచుకొండకు కాలినడకన పర్యటనకు వెళ్లాడు. నాపిన్క్సి, అతడి స్నేహితుడు చెరో దిక్కున పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నాపిన్క్సి ఓ చోట మంచులో కూరుకుపోయాడు. అయితే వీరిద్దరూ తిరిగి కలుసుకునే చోటును ముందే నిర్ణయించుకున్నారు. (చదవండి: వైరల్: మరీ ఇంత పిరికి పులిని చూడలేదు) సాయంత్రమైనా నాపిన్క్సి తాము అనుకున్న చోటికి తిరిగి రాకపోవడం అతడి స్నేహితుడు సహాయక బృందానికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం హెలికాప్టర్‌తో గాలింపు చర్యల చేపట్టింది. ఈ క్రమంలో కొద్ది సమయానికి నాపిన్క్సిని గుర్తించి రక్షించిన టీం హుటాహుటిన స్థానిక హాస్పిటల్‌కు తరలించింది. అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పటికి పల్స్ మాత్రం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడిని రక్షించేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించారు. సీపీఆర్ చేసి అతడిలోని అధిక కార్బోరియల్ మెమ్బేన్ ఆక్సిజనేషన్(ఇసీఎంఓ) యంత్రంతో చికిత్స అందించామని ఆస్పత్రి వైద్యులు జెనెల్లా బదులక్ స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ఈ ఇసీఎంఓ శరీరం నుంచి రక్తాన్ని గుండెకు పంప్ చేసి కార్భన్ డై ఆక్సైడ్‌ను తొలిగిస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో దాదాపు 45 నిమిషాల తర్వాత నాపిన్స్కి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించిందని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. (చదవండి: రామాయణ, భారతాలపై ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు) -
‘ఎవరెస్టు’ను అధిరోహించిన గిరిజన తేజం
యాచారం(ఇబ్రహీంపట్నం): గిరిపుత్రుడి సాహసయాత్ర విజయవంతమైంది. ప్రపంచంలోనే ఎల్తైన శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పాడు. అతడే అంగోత్ తుకారాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాకు చెందిన తుకారాం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. ఏప్రిల్ 5న నేపాల్ నుంచి తుకారాం తన సాహసయాత్రను ప్రారంభించాడు. దాదాపు 50 రోజులపాటు ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించి తన జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకున్నాడు. ఈ నెల 22న 8,845 మీటర్ల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి అక్కడ జాతీయజెండాను ఎగురవేశాడు. 3 రోజుల క్రితమే ఎవరెస్టును అధిరోహించినప్పటికీ అక్కడ ప్రతికూల వాతావరణం ఉండటంతో బేస్‌క్యాంపు వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎవరెస్టును అధిరోహించినట్లు నేపాల్ ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు తుకారాం ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపాడు. ఈ సాహసయాత్రలో తాను ప్రాణాలతో వస్తానని అనుకోలేదని తెలియజేశాడు. శిఖరాన్ని అధిరోహించడానికి అన్నివిధాలుగా సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాంచంద్రునాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లచ్చిరాం, రైల్వే చీఫ్ ఇంజనీర్ తౌర్యానాయక్, పారిశ్రామిక వేత్త సుధాకర్‌రావుల సహకారంతో ఎవరెస్టు యాత్రకు బయలుదేరాడు. తుకారాం.. పర్వతారోహణలో దిట్ట అంగోత్ రాందాసు, జంకుల దంపతుల నాలుగో సంతానమైన తుకారాం పర్వతారోహణలో దిట్ట. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్‌లో శిక్షణ పొందాడు. 2016 జూన్ 2న మొదటిసారి హిమాచల్‌ప్రదేశ్‌లోని 17,145 అడుగుల నార్భో పర్వతా న్ని ఎక్కి తెలంగాణ జెండాను ఎగురేసి, బతుకమ్మ ఆడి రాష్ట్ర ఖ్యాతిని చాటాడు. 2017 జూన్ 2న ఉత్తరాఖండ్‌లో 19,091 అడుగుల రుదుగైరా పర్వతాన్ని అధిరోహించాడు. హిమాలయాల్లోని 20,187 అడుగుల స్టాక్‌కాంగ్రీ పర్వతాన్ని 2017 జూలై 15న అధిరోహించాడు. ఇలా పలు మంచు పర్వతాలు అలవోకగా అధిరోహించినందుకుగాను హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తుకారాం తన పేరు నమోదు చేసుకున్నాడు. 2018 జూలైలో సౌతాఫ్రికాలో 5,895 మీటర్ల కిలిమంజారో మంచు పర్వతాన్ని అధిరోహించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ల ప్రశంసలు పొందాడు. -
‘రీనాక్’ను అధిరోహించిన నల్లమల విద్యార్థి
సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాన్ని ఎక్కిన చరణ్‌రాజ్ అచ్చంపేట: నల్లమలకి చెందిన ఓ విద్యార్థి మంచు పర్వతం అధిరోహించి సత్తా చాటాడు. 20 రోజుల సాహస యాత్రలో భాగంగా సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో హిమాలయంలోని డార్జి లింగ్లో ఉన్న రీనాక్ పర్వతాన్ని ఆధిరోహించాడు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పు నుంతల మండలం పిరట్వానిపల్లి గ్రామానికి చెందిన పెబ్బేటి విజయ నిరంజన్ దంపతుల కుమారుడు చరణ్‌రాజ్ హైదరాబాద్ బీసీ హాస్టల్లో ఉంటూ కేశవ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. చరణ్‌కు మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ మంత్రి పి.రాములు ప్రోత్సాహంతో పర్వతారోహణ చేసే అవకాశం దక్కింది. నవంబర్ 13 నుంచి ఈనెల 10 వరకు దేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 35 మందితో ఈ సాహస యాత్ర సాగింది. బృందంలో తెలంగాణ నుంచి చరణ్‌రాజ్‌కు మాత్రమే అవకాశం లభించింది. అక్కడ బీసీ వెల్ఫేర్ ఫ్లెక్సీ, భారతదేశ త్రివర్ణపతాకం, అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎగరవేశారు. అక్కడి పరిస్థితులను తట్టుకోలేక 20 మంది మధ్యలోనే వెనుదిరిగారని, మిగతా 15 మందితో కూడిన బృందం రీనాక్ పర్వతాన్ని అధిరోహించిందని చరణ్‌రాజ్ చెప్పాడు. ఈ సందర్భంగా చరణ్‌రాజ్‌ను సోమవారం హైదరాబాద్ చైతన్యపురిలోని తెలంగాణ బీసీ మహాసభ ప్రధాన కార్యాలయంలో సన్మానించారు. -
విహారం: స్పితి లోయ.. హిమ పర్వతపాదం
స్పితి లోయ... మనదేశానికి ఉత్తర సరిహద్దులో చైనా, టిబెట్ పొలిమేరల్లో ఉంది. స్పితి అంటే మధ్యనున్న నేల అని అర్థం. హిమాలయ సానువుల్లో విస్తరించిన ప్రదేశం ఇది. ఈ లోయతోపాటు ఇక్కడ ప్రవహిస్తున్న నది కూడా అదే పేరుతో స్పితి నదిగా వాడుకలోకి వచ్చేసింది. బౌద్ధం కొలువుదీరిన ప్రదేశం ఇది. ఇక్కడ బౌద్ధలామాలు తిరుగాడుతుంటారు. పర్వతసానువుల్లో క్లిష్టమైన మలుపులు దాటుకుంటూ ముందుకు పోతుంటే ఇక్కడ మనుషులు నివసించడం సాధ్యమేనా అనే సందేహం కలుగుతుంది. ఇంతలో కాషాయధారులైన బౌద్ధసన్యానులు కనిపిస్తారు. కొండదారుల్లో నడవడం దినచర్య కావడంతో వాళ్లు ఏ మాత్రం తొట్రుపడకుండా ఒకరి వెనుక ఒకరుగా క్రమశిక్షణతో సాగిపోతుంటారు. ఆల్టిట్యూడ్ సిక్నెస్(భూమి వాతావరణం నుంచి పైకి వెళ్లేకొద్దీ ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు... తల తిరిగినట్లు ఉండడం, ఊపిరి తీసుకోవడంలో కొద్దిపాటి ఇబ్బందుల వంటివి) ఎంతో ఎత్తుకి వెళ్తున్నామని తెలియజేస్తుంటుంది, కానీ ఎంత ఎత్తులో ఉన్నదీ అర్థం కాదు. ఎందుకంటే కిందకు చూస్తే అనేక శిఖరాలు తప్ప చదునైన నేల కనిపించదు. ఎక్కడో ఒకచోట మైలురాళ్లలాగ ఎత్తును తెలిపే రాళ్లుంటాయి. 15 వేల అడుగుల ఎత్తులో ఉన్నారనే విషయాన్ని నిర్ధారిస్తూన్న బోర్డులను దాటి ముందుకెళ్లి కొండ మలుపు తిరిగితే దూరంగా బౌద్ధారామాలు, చైత్యాలు కనిపిస్తుంటాయి. ప్రైమరీ స్కూల్లో సోషల్ పాఠాల్లో చదివినప్పుడు అర్థం అయినట్లూ కానట్లూ మస్తిష్కంలో ఏదో ఒక మూలన ప్రశ్నార్థకాల్లా మిగిలిపోయిన ‘కీ’ మోనాస్టెరీ, టాబో మోనాస్టెరీలు స్పితి లోయ పర్యటనలో కనిపిస్తాయి. ఇవి రెండూ బౌద్ధం పురుడుపోసుకున్న తొలినాళ్లలో కట్టిన బౌద్ధచైత్యాలు. అందుకేనేమో ఇది దలైలామాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అయింది. హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటన అంటే మొదటగా గుర్తొచ్చేవి సిమ్లా, కులు, మనాలి. కులు లోయ నుంచి స్పితిలోయకు దారి ఉంటుంది. స్పితిలోయకు వెళ్లే దారిలో రొహటాంగ్ పాస్ దాటిన తర్వాత ఒక పక్కగా కనిపిస్తుంది కుంజుమ్ కనుమ. శీతాకాలంలో హిమపర్వతాలను కప్పేసిన మంచు కరిగి కుంజుమ్ కనుమ మీదుగా పల్లానికి ప్రవహిస్తుంది. అదే స్పితి నది. ఇక్కడ ఇంకా అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీస్ ఏది? అది ఎక్కడ ఉంది?... ఇది నాలుగవ తరగతి విద్యార్థులకు భౌగోళిక శాస్త్రం పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలా ఉంటుంది కదూ! దీనికి సమాధానం స్పితి ట్రిప్‌లో దొరుకుతుంది. ఆ సమాధానమే హిక్కిమ్ పోస్టాఫీస్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని స్పితి జిల్లాలో ఉంది. దీని పిన్‌కోడ్ 172 114. ఇంకా ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే... ఆరువందల జనాభా ఉన్న ఈ చిన్న పట్టణంలో 50 మందికి పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే ప్రతి పన్నెండు మందిలో ఒకరు పోస్టాఫీస్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పోస్టాఫీస్ రోజుకి 15-20 ఉత్తరాలను బట్వాడా చేస్తుంటుంది. ఈ పట్టణానికి మోటార్ వాహనం నడిచే రోడ్డు ఉంది. హిక్కిమ్ పట్టణం కజాకు పాతిక కిలోమీటర్ల దూరాన 15 వేల అడుగులకంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అలాగే మరో ప్రశ్న కూడా! ప్రపంచంలో ఎత్తై నివాస ప్రాంతం ఎక్కడ అంటే దానికి బదులు కూడా ఇక్కడే దొరుకుతుంది. అది గెట్టె గ్రామం. కాజా పట్టణానికి కొద్దిదూరాన సముద్రమట్టానికి 4270 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పర్యటనలో ఆకర్షించే మరో ప్రదేశం బారా సిగ్రి గ్లేసియర్. రొహటాంగ్ పాస్ దాటి 20 కి.మీ.లు ప్రయాణిస్తే గ్రంఫూ గ్రామం వస్తుంది. ఇక్కడి కుడి వైపున బారా సిగ్రి గ్లేసియర్ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే పొడవైన హిమనదాల్లో రెండవది. కుంజుంమ్ కనుమ శిఖరం మీద దుర్గామాత ఆలయం ఉంటుంది. ఈ శిఖరం నుంచి ఎటు చూసినా ప్రకృతి కనువిందు చేస్తుంటుంది. ఈ కనుమకు ఆరు కిలోమీటర్ల దూరాన చందర్తాల్ ఉంది. ఇది చంద్ర నది పరివాహక ప్రదేశంలో ఉంది. నది ఇక్కడ చిన్న పాయగా చీలి మడుగు కట్టింది. ఇది చంద్ర నది పేరుతోనే చందర్తాల్గా వాడుకలోకి వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం... పాండవ అగ్రజుడు యుధిష్టిరుడిని స్వర్గానికి తీసుకెళ్లడానికి ఇంద్రుడు రథాన్ని పంపించాడని, ఆ రథంలో ధర్మరాజు స్వర్గానికి చేరాడని చెబుతారు. ధర్మరాజు రథాన్ని అధిరోహించింది చందర్తాల్ తీరాన అని ఒక విశ్వాసం. ఇక్కడి నుంచి కుంజుంమ్ పాస్‌కి ముఖద్వారంగా ఉన్న రొహటాంగ్ పాస్ని చూసేసి, లోసార్‌లో సరదాగా జడల బర్రెలు, గుర్రాల మీద సవారీ చేసి డల్హౌసీ చేరుకుంటే మరో ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. ఇది బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ హయాంలో కాత్లాగ్, పోట్రేయస్, తెహ్రా, బక్రోటా, బలున్ అనే ఐదు కొండల మీద నిర్మితమైన నివాస ప్రదేశం. మధ్యయుగం నాటి నిర్మాణశైలిలో ఉన్న చర్చిలు, దేవదారు, పైన్ వృక్షాలు, రంగుల పూలతో అందమైన ఉద్యానవనాన్ని తలపిస్తుంది. భారత్‌లోనే పర్యటిస్తున్నామా లేక పొరపాటున సరిహద్దు దాటేసి టిబెట్‌లోకి అడుగు పెట్టామా అన్నంత అయోమయం కలిగిస్తాయి ఈ పరిసరాలు. కనిపించే మనుషుల్లో కొందరు బౌద్ధలామాలు, మిగిలిన వాళ్లు భోతియాలు. వీరి ముఖకవళికలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు అన్నీ భిన్నంగా ఉంటాయి. ఈ జాతి వాళ్లు భారత్‌లోకంటే టిబెట్‌లోనే ఎక్కువ. ఇక్కడ ఏ పంటలు పండించాలన్నా వాతావరణం అనుకూలించేది ఏడాదిలో నాలుగైదు నెలలే. ఆ నాలుగు నెలల్లో పండించుకుని ఏడాదంతా నిల్వ చేసుకుని జీవనం సాగిస్తారు. వీరి జీవనశైలిలో బౌద్ధం ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. మృదుస్వభావులైన స్థానికులలో పర్యాటకులకు సహాయం చేయాలనే ఉత్సాహం కనిపిస్తుంటుంది. కానీ భాష తెలియకపోవడంతో సహకారం అందడం కష్టమే. ఇక్కడి వాళ్లు మాట్లాడే ‘భోతి’ భాషను వింటుంటే మనకు హిందీలాగ ధ్వనిస్తుంది, కానీ ఒక్క పదం కూడా హిందీతో సరిపోలదు. వీరిలో ఇంగ్లిష్ వచ్చిన వాళ్లు చాలా తక్కువ. ఒక మోస్తరుగా ఇంగ్లిష్ నేర్చుకున్నారంటే గైడ్లుగా స్థిరపడడానికే. గైడ్ల ఇంగ్లిష్ పరిజ్ఞానం కూడా పర్యాటకులకు వివరించడానికి తగినంత మాత్రమే. ఇతర వివరాలను పెద్దగా రాబట్టడం సాధ్యం కాదు. కాబట్టి స్పితి వ్యాలీకి టూర్ ఆపరేటర్లు నిర్వహించే ప్యాకేజ్‌లో వెళ్లడమే సౌకర్యం. స్పితిలోయలో పర్యటన చక్కటి విహారయాత్ర... అంతకంటే పెద్ద సాహసయాత్ర కూడ. ఎక్కడ ఉంది? స్పితి లోయ... హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాకు 400 కి.మీ.ల దూరంలో ఉంది. సిమ్లా నుంచి ఎనిమిది గంటల ప్రయాణం. ఎలా వెళ్లాలి? సమీప విమానాశ్రయం: కులూలోని భుంటార్ ఎయిర్‌పోర్టు. కులు, మనాలి నుంచి రొహటాంగ్ పాస్ మీదుగా ‘కజా’ చేరి అక్కడి నుంచి స్పితికి చేరవచ్చు. మనాలి నుంచి స్పితికి జూలై నుంచి అక్టోబర్ వరకు బస్సులు నడుస్తాయి. సమీప రైల్వేస్టేషన్: మనాలి రైల్వేస్టేషన్. సిమ్లా స్టేషన్లో దిగితే కిన్నూర్ మీదుగా ‘కజా’కి చేరి అక్కడి నుంచి స్పితికి వెళ్లవచ్చు. సిమ్లాలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ఉన్నాయి. సిమ్లా మీదుగా మే నెల నుంచి అక్టోబరు వరకు బస్సులు నడుస్తాయి. ఎక్కడ ఉండాలి? స్పితిలోయకు సమీపంలో ఉన్న పట్టణం కాజా. ఇది మనాలికి రెండువందల కిలోమీటర్ల దూరాన స్పితివ్యాలీ తీరాన ఉంటుంది. కాజాలో పిడబ్ల్యుడి గెస్ట్ హౌస్‌తోపాటు ప్రైవేట్ హోటళ్లు కూడా ఉంటాయి. ధన్కార్ గొంపాలో మనిషికి 150 రూపాయలతో కనీస బస సౌకర్యం ఉంటుంది. సాధారణ భోజనం పెడతారు. భోజనం ఎలా? స్థానికులు జొన్న, మొక్కజొన్న రొట్టెలు తింటారు. రెస్టారెంట్లలో ఇవి దొరకడం కష్టమే. దాబాలు, రెస్టారెంట్లలో పరాఠా, నూడుల్స్ వంటివి దొరుకుతాయి. కొన్ని రెస్టారెంట్లలో అన్నం దొరుకుతుంది. కానీ ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే వండుతారు. నూడుల్స్ పాకెట్స్ తీసుకెళ్లి హోటల్ వాళ్ల సహకారంతో వేడినీటితో ఉడికించుకోవడం సౌకర్యంగా ఉంటుంది.