
భూగర్భంలోనే ఊపిరొదిలారు
► శాంతిఖని గనిలో కూలిన పైకప్పు
► జంక్షన్ వద్ద ఘటన
► ఒకరికి గాయూలు
► ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న 20 మంది
► బండరాయి కిందనే మృతదేహాలు
► కొనసాగుతున్న సహాయక చర్యలు
నిత్యం భూగర్భంలోనే పనిచేసే ముగ్గురు సింగరేణి కార్మికులే అక్కడే ఊపిరి వదిలారు. ప్రమాదవశాత్తు భూగర్భంలోని జంక్షన్ రూఫ్‌ఫాల్ (పై కప్పు కూలి) కావడంతో బండ కింద నలిగి అక్కడికక్కడే చనిపోయారు. మందమర్రి ఏరియా ఏరియా శాంతిఖని గనిలో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బెల్లంపల్లి(ఆదిలాబాద్) : బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా పరిధిలోని శాంతిఖని భూగర్భగనిలో బుధవా రం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు బలయ్యూరు. ఒకరు గాయూలతో బయటపడగా సుమారు 20 మంది కార్మికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తోటి కార్మికుల కథనం ప్రకారం.. కార్మికులు ఎప్పటిలాగే మొదటి షిఫ్టు డ్యూటీకి హాజరయ్యారు. పనులు ముగించుకొని మధ్యాహ్నం సుమారు 1.45 గం టల సమయంలో గనిలోని 52 లెవల్ వన్‌డీప్ జంక్షన్‌లో ఉన్న పంపు వద్దకు చేరుకుని ముఖం, కాళ్లు, చేతులు కడుక్కొని నీళ్లు తాగారు. గని రక్షణ అధికారి సంతోష్‌రావు అటు వైపు వచ్చి వెళ్లిపోయూడు.
ఈ క్రమంలో అకస్మాత్తుగా జంక్ష న్ ప్రాంతంలోని పైకప్పు(సుమారు ఐదు ఫీట్ల వెడల్పు, 14 ఫీట్ల మందం కలిగిన బండ) కూలింది. దీంతో అక్కడే ఉన్న ఆర్‌బీసీ(సపోర్టుమెన్)లు పోల్సాని హన్మంతరావు(58), రమావత్ కిష్టయ్య(52), మేషన్ మేస్త్రీ గాలిపల్లి పోశం(53) బండ కింద నలిగిపోయూరు. కొద్ది దూరంలో ఉన్న మరో 20 మంది కార్మికులు భయంతో పరుగులు తీశారు. వీరంతా కొద్ది గంటల తర్వాత ఉపరితలానికి చేరుకున్నారు. గాయపడిన జనరల్ మజ్దూర్ కార్మికుడు చీమల శంకర్ స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ముమ్మరంగా సహాయక చర్యలు
విషయం తెలిసిన వెంటనే మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల అధికారులు గని వద్దకు వచ్చి రామకృష్ణాపూర్ నుంచి రెస్క్యూ సిబ్బందిని రపించారు. వారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కప్పు కూలిన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాకీలు, ఇతర సపోర్టుల సహాయంతో బండరారుు శిథిలాలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యూరు. గురువా రం తెల్లవారుజాము లేదా మధ్యాహ్నం వరకు బండ కింద ఉన్న కార్మికుల మృతదేహాలను వెలికితీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తరలివచ్చిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే
ప్రమాద ఘటన విషయం తెలియగానే రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎంపీ జి.వివేకానంద, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, బెల్లంపల్లి ఏరియా జీఎం కె.రవిశంకర్, టీఆర్‌ఎస్, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టీయూసీ నాయకులు గని వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును తోటి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. గనిలోకి మందమర్రి ఏరియా జీఎం వెంకటేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారు లు, కార్మిక సంఘాల నాయకులు దిగి ప్రమాదస్థలిని పరిశీలించారు.
శోకసంద్రంలో మృతుల కుటుంబాలు
సింగరేణి అధికారులు సమాచారాన్ని వెంటనే చేరవేయకపోవడంతో కొన్ని గంటల పాటు మరణ వార్త సదరు కార్మిక కుటుంబాలకు తెలియలేదు. తర్వాత విషయం తెలియగానే మృతి చెందిన హన్మంతరావు, పోశం, కిష్టయ్య కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయా యి. గనిపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
15 రోజులుగా మొత్తుకున్నా..
శాంతిఖని గని ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ప్రధానంగా కనబడుతోంది. గనిలోని 52 లేవల్, ఒకటో డీప్ జంక్షన్ వద్ద పైకప్పు నుంచి శబ్దాలు వస్తున్నాయని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని కార్మికులు 15 రోజులుగా మొత్తుకున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ప్రమాదం జరిగిన స్థలంలో తాగునీటి పంపుతో పాటు మూడు కన్వేయర్ బెల్టులు, రెండు ఎస్‌డీఎల్ యంత్రా లు, రెండు గాలి సరఫరా చేసే ఫ్యాన్‌లు పనిచేస్తున్నాయి. వీటి శబ్దాల వలన గని పైకప్పు కూలే సమయంలో సంకేతం ఏమీ వినబడకపోవ డం వల్లే కార్మికులు ప్రమాదాన్ని పసిగట్టలేక పోయారనే అభిప్రాయా లు సైతం వ్యక్తమవుతున్నారుు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే..
గనిలో జరిగిన ప్రమాదం మృతుల కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా, ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినా గనుల్లో ప్రమాదాలు ఆగడం లేదు. గని అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాలను అన్ని రకాల ఆదుకోవాలి. - నల్లాల ఓదెలు, ప్రభుత్వ విప్
రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. జంక్షన్ వద్ద పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ముగ్గురు కార్మికులు బల య్యూరు. సింగరేణి అధికారులే బాధ్య త వహించాలి. మృతుల కుటుంబాల కు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
- వి.సీతారామయ్య, ఎస్‌సీడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి
బాధ్యులను సస్పెండ్ చేయాలి
ప్రమాదానికి కారకులైన సింగరేణి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఘటనకు గని మేనేజ ర్, రక్షణ అధికారి పూర్తి బాధ్యత వహించాలి. డీజీఎంఎస్ పర్యవేక్షణ లోపం వల్ల ప్రమాదం జరిగింది. గనిలో అధికారులు దిగకుండా కార్మికులను పంపి ప్రాణాలు బలితీసుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. - రియాజ్ అహ్మద్, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి
రక్షణపై శ్రద్ధ లేకనే..
గనిలో కంటీన్యూయస్ మైనర్ యంత్రాన్ని ప్రవేశపెట్టాలనే ఆతృత తప్ప గని అధికారులకు రక్షణపై శ్రద్ధ లేదు. కొద్ది రోజుల నుంచి జంక్షన్ వద్ద శబ్దం వస్తున్న ట్లు కార్మికులు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. - ఎస్.రాజమొగిళి, ఐఎన్‌టీయూసీ