57 గంటల తర్వాత బోరు బావి నుంచి బయటకు.. ప్రాణాలు కోల్పోయిన ఆర్యన్‌ | 5 Year Old Aryan Dies After Being Taken Out Of Borewell In Rajasthan After 57 Hours, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Rajasthan Borewell News: 57 గంటల తర్వాత బోరు బావి నుంచి బయటకు.. ప్రాణాలు కోల్పోయిన ఆర్యన్‌

Published Thu, Dec 12 2024 6:54 AM | Last Updated on Thu, Dec 12 2024 10:34 AM

5 Year Old Aryan Dies After Being Taken Out Of Borewell In Rajasthan After 57 Hours

జైపూర్‌: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల  బాలుడు ఆర్యన్‌ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల పాటు శ్రమించారు. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషాదం సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్‌ మధ్యాహ్నం 3గంటల సమయంలో బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిలో పడ్డ గంట తర్వాత ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు కదిలి వచ్చాయి.  

బోరుబావిలో పడ్డ బాలుడి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందాలు, జేసీబీలు,డ్రిల్లింగ్‌ మెషిన్లతో ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్‌ పంపాయి.    

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆపరేషన్‌లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నీటి మట్టం దాదాపు 160 అడుగుల వరకు ఉంటుందని అంచనా వేశారు. భూగర్భంలో ఆవిరి కారణంగా బాలుడి కదలికలను కెమెరాలో బంధించడంలో ఇబ్బంది మారింది. అదే సమయంలో భద్రతా సమస్యలు కూడా తలెత్తుతాయని అంచనా వేశారు.  

అయినప్పటికీ, 57 గంటల పాటు శ్రమించి బోరుబావి నుంచి ఆపస్మారక స్థితిలో ఉన్న ఆర్యన్‌ సురక్షితంగా బయటకు తీశారు. గ్రీన్ కారిడార్ ద్వారా అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌తో కూడిన అంబులెన్స్‌లో ఆర్యన్‌ను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్ష చేసినా డాక్టర్లు ఆర్యన్‌ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement