గుజరాత్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా సురగపర గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో పడి , ఏడాదిన్నర వయసుగల బాలిక ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 17 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఈరోజు(శనివారం) తెల్లవారుజామున ఆ బాలికను బోరుబావిలో నుంచి బయటకు తీశారు. అయితే అధికారులు ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు.
రెస్క్యూ టీం ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బోరుబావిలో దాదాపు 50 అడుగుల లోతులో ఆ చిన్నారి చిక్కుకుపోయింది. తమ కుమార్తె మృతి చెందడంలో తల్లిదండ్రులు పెద్ద పెట్టున రోదిస్తున్నారు. ఆ ప్రాంతమంతా శోక సంద్రంగా మారిపోయింది. ప్రమాద స్థలంలో అంబులెన్స్ , అగ్నిమాపక దళం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయి. బాలికకు ఆక్సిజన్ అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
అగ్నిమాపక దళ అధికారి హెచ్‌సీ గాధ్వి మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు పొలంలో పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ఏడాది వయసుగల ఆ చిన్నారికి పాలు తాగించిన తరువాత తల్లిదండ్రులు పనులకు వెళ్లారన్నారు. ఇంతలో వారికి తమ కుమార్తె కేకలు వినపించాయి. వారి కుమార్తె బోరు బావిలో పడిపోయిందని అక్కడున్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులకు తెలిపారు.
వెంటనేవారు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక అధికారులను, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని అక్కడికి రప్పించారు. రెస్క్యూ బృందం ఆ చిన్నారి బోరుబావిలోని 50 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఆ చిన్నారి తలకిందులుగా ఉందని, ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు గుర్తించారు. దీంతో ఆ చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేశారు. తరువాత రోబోట్ మెషీన్‌ను కూడా పిలిపించారు. అది ఆ చిన్నారి తలను పట్టుకుని బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ చిన్నారి ఆక్సిజన్ అందక అపస్మారక స్థితికి చేరుకుంది. బయటకు తీసుకువచ్చిన వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.
#WATCH अमरेली, गुजरात: अग्निशमन अधिकारी एचसी गढ़वी ने कहा, "करीब 12:30 बजे सूचना मिली थी की एक बच्ची जो करीब डेढ़ साल की है वो बोरवेल में गिर गई है। तुरंत हमारी रेस्क्यू टीम यहां पहुंची। हमने कैमरे से देखा कि बोरवेल करीब 45 फीट गहरा है। बच्ची को सांस देने के लिए ऑक्सीजन दिया जा… https://t.co/4fF7YMHnzO pic.twitter.com/CjQ6J1jTdQ
— ANI_HindiNews (@AHindinews) June 14, 2024
Comments
Please login to add a commentAdd a comment