జైపూర్: రెండు వారాల వ్యవధిలో రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారి చేతన బోరు బావిలో పడింది. చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది 20 గంటలుగా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. 700 అడుగుల లోతులో ఉన్న పాప ఆచూకీ కోసం బోరు బావి లోపలకు రెస్క్యూ బృందాలు కెమెరాను లోపలికి పంపాయి. ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి.
పోలీసుల వివరాల మేరకు.. సోమవారం రాజస్థాన్ రాష్ట్రం కోట్‌పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో మూడేళ్ల చేతన తన తండ్రితో కలిసి పోలానికి వెళ్లింది. తండ్రి పొలం పనులు చేస్తుండగా.. చేతన పొలంలో ఆడుకుంటుంది. ఆ సమయంలో ప్రమాదవ శాత్తూ పొలంలో ఏర్పాటు చేసిన 700 అడుగుల బోరుబావిలో పడింది. దీంతో భయాందోళన గురైన బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు చేతనను రక్షించేందుకు రంగంలోకి దిగాయి. చేతన 150 అడుగుల లోతులోకి జారినట్లు గుర్తించారు. బోరుబావి లోపల పాప ఆచూకీ కోసం కెమెరాలను పంపించారు. 20 గంటలకు బోరుబావిలో ఉన్న చేతనను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. బోరుబావి లోపల ఉన్న చేతనను సురక్షితంగా రక్షించేందుకు శాయశక్తులా రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి.
700 फीट गहरे बोरवेल में फंसी बच्ची, गांव में चूल्हा नहीं जला। कैमरे में हाथ हिलाते हुए दिखी
"दुआ करें, जिंदगी की ये जंग जीत जाए। 💕" pic.twitter.com/XJg5BDBDeR— Dinesh Bohra (@dineshbohrabmr) December 23, 2024
విఫలమైన ప్రయత్నం.. చివరిగా
150 అడుగుల లోతులో ఉన్న చేతనకు ఆక్సిజన్ పైపును లోపలికి పంపారు. బోరుబావికి ఓ వైపు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ వ్యవసాయం క్షేత్రం కావడంతో మట్టి తేమగా ఉంది. దీంతో తవ్వకాలను నిలిపివేశారు. అనంతరం, పొడవైన రాడ్‌కు బిగించిన హుక్ సాయంతో ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతన సురక్షితంగా బోరుబావి నుంచి బయట పడుతుందని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం ఆర్యన్
కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ దౌస జిల్లాలోని కలిఖడ్ గ్రామాంలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలో పడ్డ ఐదేళ్ల ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్యన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడ్డాడు. బాలుడి కోసం రెస్క్యూ బృందాలు సుమారు 57 గంటల పాటు శ్రమించాయి. చివరికి 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు.
STORY | Race against time to save 5-year-old Aryan stuck in Rajasthan borewell
READ: https://t.co/LlJCz15soa
VIDEO:
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KqVqlNJmo7— Press Trust of India (@PTI_News) December 11, 2024
Comments
Please login to add a commentAdd a comment