Farm 14
-
అరవై రోజుల అద్భుతం 'నవార'!
నవార.. కేరళకు చెందిన ఓ అపురూపమైన పాత పంట. 2 వేల ఏళ్ల క్రితం నుంచే సాగులో ఉన్న అద్భుతమైన ఔషధ విలువలున్న ధాన్యపు పంట. ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న విశిష్ట వంగడం నవార (Navara). ఆహారంగా, ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్లనే ఇది ఔషధ పంటగా అంతర్జాతీయంగానూ ప్రాచుర్యం పొందింది. 60 రోజుల పంటదక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా కేరళ, పురాతన వ్యవసాయ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది నవార. ఇది స్వల్పకాలిక పంట. విత్తిన 60 రోజుల్లోనే ధాన్యం చేతికొస్తుంది. అందుకే దీనికి ‘షస్తిక శాలి’ అనే పేరు వచ్చింది. నవార బియ్యం (Navara Rice) ఎరుపు + నలుపు రంగుల కలగలుపుతో విలక్షణంగా కనిపిస్తుంది. చర్మం, ఎముకలు, కండరాలు, జీర్ణకోశం ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుందని కేరళలోని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.జిఐ గుర్తింపు జన్యుపరంగా విశిష్ట గుణాలు కలిగి ఉన్నందున 2008లో నవార వంగడానికి కేంద్ర ప్రభుత్వం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపునిచ్చింది. ఈ గుర్తింపు పొందిన నవార వంగడాలు రెండు. నలుపు జీరతో ఉండే ఎర్ర బియ్యపు రకం ఒకటి. లేత బంగారు రంగు జీరతో ఉండే ఎర్ర బియ్యపు రకం రెండోది. కేరళలోని కరుకమనికళంలో గల నవార రైస్ ఫార్మర్స్ సొసైటీ ఈ రెండు వంగడాలకు జిఐ గుర్తింపును పొందింది. ఈ రెండు రకాల నవార బియ్యానికి సహజమైన తీపి రుచి ఉంటుంది. సులువుగా జీర్ణమవుతాయి. అందువల్ల అన్ని వయసుల వారూ తినటానికి అనువుగా ఉంటాయి. సాధారణంగా నవార బియ్యాన్ని పిండి పట్టించి పాలలో కలుపుకొని తాగుతారు. దీనికి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆథ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది. ఆలయ క్రతువుల్లోనూ వాడుతారు.9.5% మాంసకృత్తులు.. నవార బియ్యం పోషకాల గని. 73% పిండి పదార్థం, 9.5% మాంసకృత్తులు, 2.5% కొవ్వు, 389 కేలరీల శక్తి ఉంటాయి. అంతేకాదు, చక్కని పీచు పదార్థానికి, యాంటీఆక్సిడెంట్ల తోపాటు జింక్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలకు నిలయం. ఈ పోషకాలు కలిగి ఉన్నందునే ఆరోగ్యప్రదాయినిగా ప్రఖ్యాతి పొందింది.ఆయుర్వేదంలో నవారఆయుర్వేద పంచకర్మ చికిత్సల్లో నవార బియ్యానికి అత్యంత అధిక ప్రాధాన్యం ఉంది. రక్తప్రసరణ, శ్వాసకోశ, జీర్ణవ్యవస్థలను మెరుగుపరచటంలో నవార పాత్ర ఎంతో ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కీళ్లనొప్పులు, కండరాల క్షీణత, కొన్ని రకాల చర్మ సమస్యలకు చేసే ఆయుర్వేద చికిత్సల్లో ఈ బియ్యాన్ని వాడుతున్నారు. నవార బియ్యంతోపాటు తౌడు, నూక, ఊక, గడ్డిని కూడా ఔషధ విలువలతో కూడిన ఆహారోత్పత్తుల తయారీలో పరిశ్రమదారులు ఉపయోగిస్తున్నారు. నవార తౌడు, ఊకలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.నవార సాగులో సవాళ్లునవార వంటి పాత పంటల సాగులో సంప్రదాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే కేరళలో రైతులు అనుసరిస్తున్నారు. ప్రకృతి వనరులతో కూడిన ఎరువులు, కషాయాలు వాడుతూ వ్యవసాయం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా చూస్తున్నారు. పొలాల్లో పర్యావరణ సమతుల్యానికి మిత్ర పురుగుల పాత్ర కీలకం.వాటిని రక్షించుకోవటం కోసం కషాయాలను మాత్రమే వాడుతున్నారు. పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్టు, పశువుల పేడ, పంచగవ్యలను రసాయనిక ఎరువులకు బదులు వాడుతున్నారు. బలమైన గాలులు, భారీ వర్షాలను నవార వరి పంట అంతగా తట్టుకోలేదు, పడిపోయే గుణం ఉంది. తీవ్రమైన మంచుతో కూడా ఇబ్బంది పడే సున్నితమైన పంట ఇది. చలిని తట్టుకోలేదు. కాండం అడుగునే వంగి పడి΄ోతుంది. కాబట్టి శీతాకాలంలో దీన్ని సాగు చేయకూడదు. ఈ కారణాల వల్ల నవార పంటకాలం 60 రోజులే అయినప్పటికీ ఏడాదికి కేవలం ఒకే పంట సాగు అవుతోంది. నవార వరి పంటను మనుషులతోనే కోయించాలి. కూలీల కొరతతో ΄ాటు అధిక ఖర్చుతో కూడిన పని కావటం వల్ల రైతులకు ఇది కూడా పెద్ద సమస్యే అవుతోంది.నిజంగా బంగారమే!నవార ధాన్యం దిగుబడి కూడా ఎకరానికి 300 కిలోలు మాత్రమే. ఇతర వరి రకాలతో ΄ోల్చితే చాలా తక్కువ. అయినా, దీనికి ఉన్న ప్రత్యేక ఔషధ గుణాల కోసం ఎక్కువ ధర పెట్టి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ధర అధికంగా ఉన్నప్పటికీ నవార బియ్యానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. రైతులకూ మంచి ఆదాయాన్ని సమకూర్చుతోంది. నవారకున్న అరుదైన ఔషధగుణాల వల్ల ‘బంగారం’ అని కూడా పేరొచ్చింది. నవార బియ్యాన్ని మీ కుటుంబం ఆహారంగా తీసుకుంటే ఎన్నెన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయి. 2 వేల సంవత్సరాల ఘన చరిత్ర గల అద్భుత వంగడాన్ని పరిరక్షించుకున్నట్లు కూడా అవుతుంది. షుగర్ నియంత్రణ...నవార బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ తెల్ల బియ్యంతో పోల్చితే తక్కువగా ఉంటుంది. అంటే.. గ్లూకోజ్‌ను రక్తంలోకి తెల్ల బియ్యం మాదిరిగా ఒకేసారి కాకుండా నెమ్మది నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది అనువైన మూలాహారం అయ్యింది. ఇందులోని పీచు వల్ల ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తుంది. ఎముక పుష్టి... కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి సూక్ష్మ పోషకాలతో కూడి ఉంటుంది కాబట్టి నవార బియ్యం తిన్న వారికి ఎముక పుష్టి కలుగుతుంది. రెగ్యులర్‌గా తినే వారికి ఎముకలు గుల్లబారటం వంటి సమస్య రాదు. బ్లడ్ క్లాట్ కావటం, మజిల్ కంట్రాక్షన్ వంటి సమస్యలను అధిగమించడానికీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.చర్మ సౌందర్యం... యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నవార ఆహారం దోహదం చేస్తుంది. ముడతలను పోగొట్టడానికి, చర్మంలో మెరుపును పెంపొందించటానికి దోహదం చేస్తుంది. నవార బియ్యపు పిండిని పాలలో లేదా నీటిలో కలిపి ముఖవర్చస్సు మెరుగవడానికి, మచ్చలు పోవటానికి లేపనంగా వాడుతూ ఉంటారు. నవార బియ్యంలోని మెగ్నీషియం కండరాలను, నరాలను ఆరోగ్యవంతంగా ఉంచటానికి.. మొత్తంగా నాడీ వ్యవస్థను, కండరాల వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉండటానికి ఉపయోడపడుతుంది.గుండెకు మేలు... నవార బియ్యంలోని అధిక పీచు పదార్థం కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తనాళాల్లో పూడికను నివారించడానికి తద్వారా గుండెపోటు ముప్పును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సీ ఉండటం వల్ల కణజాలానికి మరమ్మతు చేస్తే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి దోహదపడటం ద్వారా నవార రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ... ఇందులోని అధిక పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొట్టలోని సూక్ష్మజీవరాశిని పెంపొందించడం ద్వారా జీర్ణశక్తిని పెంపొందించి, పోషకాల మెరుగైన శోషణకు, మొత్తంగా జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు దోహదం చేస్తుంది.శిశు ఆహారం... కేరళలో నవార బియ్యాన్ని శిశువులకు ఆహారంగా పెడుతుంటారు. నవార పిండి, అరటి పండు ఒరుగులతో కలిపి తయారు చేసే ‘అంగ్రి’ అనే వంటకాన్ని పిల్లలకు తినిపించటం కేరళవాసులకు అనాదిగా అలవాటు. డబ్బాల్లో అమ్మే ప్రాసెస్డ్ ఆహారం కన్నా ఇది పిల్లలకు చాలా సహజమైన, బలవర్ధకమైన ఆహారం. పిల్లలు తగినంత బరువు పెరగడానికి దోహదపడుతుంది.కేన్సర్ నిరోధకం... నవార బియ్యంలో ప్రోయాంథోశ్యానిడిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయ. డిఎన్ఎకి నష్టం కలగకుండా నివారించడటం, హానికారక ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యం చేయటం ద్వారా కేన్సర్ ముప్పును తగ్గించడానికి నవార బియ్యం ఉపకరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.చదవండి: ఈ ఆపిల్ ఎక్కడైనా కాస్తుంది!రక్తహీనతకు చెక్... నవార బియ్యంలో పుష్కలంగా ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతను నివారించగలదు. నిస్సత్తువ, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలను రూపుమాపగలదు. గర్భవతులకు ఈ బియ్యం ఉపయుక్తమైనవి. పీచు, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ వంటి సూక్ష్మపోషకాలు గర్భవతుల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. గర్భవతులు సాధారణంగా ఎదుర్కొనే మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరించటంతో పాటు గర్భస్థ శిశువు పెరుగుదలకు చాలా ఉపయోగకరం.నవార నారాయణన్!కేరళ సంప్రదాయ ఆహారంలోనే కాదు ఆయుర్వేద వైద్యంలోనూ కీలక ΄పాత్ర పోషిస్తున్న నవార సాగుకు పాల్ఘాట్ ప్రాంతంలో 2 వేల ఏళ్ల చరిత్ర ఉన్నా గత 50 ఏళ్లుగా దీనికి సాగు తగ్గిపోయి, అంతరించిపోయే దశకు చేరింది. అక్కడక్కడా రైతులు సాగు చేస్తున్నారు. అయితే, ఒకే ఒక్క కుటుంబం మాత్రం నవారను గత 115 ఏళ్లుగా విడవ కుండా తమ 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో నిరంతరాయంగా సాగు చేస్తూనే ఉంది. అద్భుత వ్యవసాయ, సాంస్కృతిక వారసత్వ సంపద అయిన నవారను ఈ కుటుంబం కాపాడుకుంటోంది. ఈ కుటుంబానికి చెందిన మూడో తరం రైతు పి. నారాయణన్ ఉన్ని ఇప్పుడు దీన్ని సాగు చేస్తున్నారు. నవార ఎకో ఫార్మ్ అని ఈయన క్షేత్రానికి పేరు పెట్టారు. ‘నవార నారాయణన్’గా ఆయన పేరుగాంచారు. ఆయన కృషి దేశ విదేశాల్లో మారుమోగుతూ ఉంటుంది. పరిరక్షించటంతో పాటు నవార ఫార్మర్స్ సొసైటీ పేరిట నవారకు జిఐ గుర్తింపు తేవటంలోనూ నారాయణన్ విశేష కృషి చేశారు. నవార ఉత్పత్తులను ఆయన సేంద్రియంగా పండిస్తూ దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. (చదవండి: చర్మతత్వానికి సరిపోయే ఫేస్ ప్యాక్‌లు..!)న్యూఢిల్లీలోని కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఆర్ఐ)కి చెందిన ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టాస్) నవారపై ప్రత్యేక గ్రంథాన్ని ప్రచురించింది. నారాయణన్ ఏర్పాటు చేసిన సొసైటీ ఆధ్వర్యంలో 2011లో నవార ఉత్సవ్‌ను నిర్వహించారు. నవార పునరుజ్జీవనానికి కృషి చేసిన నారాయణన్‌కు ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్అథారిటీ (పిపివి అండ్ ఎఫ్ఆర్ఎ) ప్రతిష్టాత్మకమైన ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ రికగ్నిషన్ పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించింది. ఎకరానికి 3 క్వింటాళ్ల నవార ధాన్యాన్ని ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండిస్తున్నారు. మిల్లు పట్టిస్తే 180 కిలోల బియ్యం వస్తున్నాయి. బియ్యంతో పాటు అటుకులు, పిండిని తయారు చేసి విక్రయిస్తున్నారు. గత ఏడాది ‘టాస్’ ప్రచురించిన వివరాల ప్రకారం నారాయణన్ ఎకరానికి రూ. 1 లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్‌చేస్తే..
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు అతడిని నగర జీవితం నుంచి గ్రామం బాట పట్టేలా చేశాయి. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ బతకాలనుకున్నాడు. చివరికి అదే అతడికి కనివిని ఎరుగని రీతిలో లక్షలు ఆర్జించేలా చేసి..మంచి జీవనాధారంగా మారింది. ఒకరకంగా ఆ ఆరోగ్య సమస్యలే ఆర్థిక పరంగా స్ట్రాంగ్‌గా ఉండేలా చేయడమే గాక మంచి ఆరోగ్యంతో జీవించేందుకు దోహదపడ్డాయి. ఇంతకీ అతడెవరంటే..అతడే హర్యానాకి చెందిన జితేందర్ మాన్(Jitender Mann). ఆయన చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో 20 ఏళ్లు టీసీఎస్ ఉద్యోగిగా పనిచేశారు. అయితే ఆ నగరాల్లో కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో నలభైకే రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి రోగాల బారినపడ్డారు. జస్ట్ 40 ఏళ్లకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాను రాను ఎలా ఉంటుందన్న భయం ఆయన్ని నగర జీవితం నుంచి దూరంగా వచ్చేయాలనే నిర్ణయానికి పురిగొలిపింది. అలా ఆయన హర్యానాలోని సొంత గ్రామానికి వచ్చేశారు. అక్కడే తన భార్య సరళతో కలిసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా రెండు ఎకరాల్లో సేంద్రియ మోరింగ ఫామ్(organic moringa farm)ని ప్రారంభించారు. అలాగే ఆకుల్లో పోషకవిలువలు ఉన్నాయని నిర్థారించుకునేలా సాంకేతికత(technology)ని కూడా సమకూర్చుకున్నారు. అలా అధిక నాణ్యత కలిగిన మోరింగ పౌడర్ని ఉత్పత్తి చేయగలిగారు ఈ జంట(Couple). వారి ఉత్పత్తులకు త్వరితగతిన ప్రజాదరణ పొంది..ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు,ముంబై వంటి నగరాలకు వ్యాపించింది. ఈ పౌడర్‌కి ఉన్న డిమాండ్ కారణంగా నెలకు రూ. 3.5 లక్షల ఆదాయం తెచ్చిపెట్టింది ఆ దంపతులకు. అలా ఇప్పుడు నాలుగు ఎకరాలకు వరకు దాన్ని విస్తరించారు. అత్యున్నత నాణ్యతను కాపాడుకోవడమే ధ్యేయంగా ఫోకస్ పెట్టారిద్దరు. అందుకోసం ఆకులను కాండాలతో సహా కోసి రెండుసార్లు కడిగి ఏడు నుంచి తొమ్మిది కాండాలను కలిపి కడతామని అన్నారు. తద్వారా ఆకుని సులభంగా ఎండబెట్టడం సాధ్యమవుతుందని జితేందర్ చెబుతున్నారు. ఆకులను పెద్ద ఫ్యాన్ల కింద నియంత్రిత గ్రీన్హౌస్ సెటప్‌లో ఎండబెట్టడం జరుగుతుంది. అందువల్ల 12 గంటలలోనే ఆకులను కాండాల నుంచి తీసివేసి ముతక పొడిగాచేసి జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు. అంతేగాదు ఈ దంపతులు తాము నేలను దున్నమని చెబుతున్నారు. తాము కలుపు మొక్కలు, ఇతర ఆకులనే రక్షణ కవచంగా చేసుకుంటారట. అలాగే హానికరమైన రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులను ఉపయోగించమని చెబుతున్నారు. ఇలా జితేందర్ వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడంతోనే ఆయన లైఫ్ మారిపోయింది. ఇదివరకటిలా ఆరోగ్య సమస్యలు లేవు. మంచి ఆరోగ్యంతో ఉన్నాని ఆనందంగా చెబుతున్నాడు. అలాగే ప్యాకేజింగ్ కోసం పొడిని పంపే ముందే తాము కొన్ని జాడీలను తమ కోసం పక్కన పెట్టుకుంటామని చెప్పారు. ఈ మొరింగ పౌడర్ వినియోగం తమకు మందుల అవసరాన్ని భర్తీ చేసేస్తుందని అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ధీమాగా చెబుతున్నారు. అలాగే జితేంద్ర దంపతులు తాము గ్రామానికి వెళ్లాలనుకోవడం చాలామంచిదైందని అంటున్నారు. "ఎందుకంటే మేము ఇక్కడ కష్టపడి పనిచేయడం తోపాటు ఆరోగ్యంగా ఉంటున్నాం. పైగా కాలుష్యానికి దూరంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాం అని సంతోషంగా చెబుతోంది ఈ జంట. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: లెడ్‌లైట్ థెరపీ: అన్ని రోగాలకు దివ్యౌషధం..!) -
700 అడుగుల లోతు బోరు బావిలో చిన్నారి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
జైపూర్: రెండు వారాల వ్యవధిలో రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారి చేతన బోరు బావిలో పడింది. చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది 20 గంటలుగా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. 700 అడుగుల లోతులో ఉన్న పాప ఆచూకీ కోసం బోరు బావి లోపలకు రెస్క్యూ బృందాలు కెమెరాను లోపలికి పంపాయి. ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. సోమవారం రాజస్థాన్ రాష్ట్రం కోట్‌పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో మూడేళ్ల చేతన తన తండ్రితో కలిసి పోలానికి వెళ్లింది. తండ్రి పొలం పనులు చేస్తుండగా.. చేతన పొలంలో ఆడుకుంటుంది. ఆ సమయంలో ప్రమాదవ శాత్తూ పొలంలో ఏర్పాటు చేసిన 700 అడుగుల బోరుబావిలో పడింది. దీంతో భయాందోళన గురైన బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు చేతనను రక్షించేందుకు రంగంలోకి దిగాయి. చేతన 150 అడుగుల లోతులోకి జారినట్లు గుర్తించారు. బోరుబావి లోపల పాప ఆచూకీ కోసం కెమెరాలను పంపించారు. 20 గంటలకు బోరుబావిలో ఉన్న చేతనను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. బోరుబావి లోపల ఉన్న చేతనను సురక్షితంగా రక్షించేందుకు శాయశక్తులా రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. 700 फीट गहरे बोरवेल में फंसी बच्ची, गांव में चूल्हा नहीं जला। कैमरे में हाथ हिलाते हुए दिखी"दुआ करें, जिंदगी की ये जंग जीत जाए। 💕" pic.twitter.com/XJg5BDBDeR— Dinesh Bohra (@dineshbohrabmr) December 23, 2024 విఫలమైన ప్రయత్నం.. చివరిగా 150 అడుగుల లోతులో ఉన్న చేతనకు ఆక్సిజన్ పైపును లోపలికి పంపారు. బోరుబావికి ఓ వైపు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ వ్యవసాయం క్షేత్రం కావడంతో మట్టి తేమగా ఉంది. దీంతో తవ్వకాలను నిలిపివేశారు. అనంతరం, పొడవైన రాడ్‌కు బిగించిన హుక్ సాయంతో ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతన సురక్షితంగా బోరుబావి నుంచి బయట పడుతుందని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం ఆర్యన్ కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ దౌస జిల్లాలోని కలిఖడ్ గ్రామాంలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలో పడ్డ ఐదేళ్ల ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్యన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడ్డాడు. బాలుడి కోసం రెస్క్యూ బృందాలు సుమారు 57 గంటల పాటు శ్రమించాయి. చివరికి 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు.STORY | Race against time to save 5-year-old Aryan stuck in Rajasthan borewellREAD: https://t.co/LlJCz15soaVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KqVqlNJmo7— Press Trust of India (@PTI_News) December 11, 2024 -
ఈపీఎఫ్ నుంచి పాలసీ కట్టొచ్చు!
► కావాలంటే పీఎఫ్ సంస్థే కడుతుంది ► కానీ మీ ఖాతాలో డబ్బులుంటేనే సుమా! ► లేకపోతే పాలసీ రద్దయ్యే ప్రమాదమూ ఉంది ఎల్ఐసీ పాలసీలు మనలో చాలా మంది తీసుకుంటారు. ఉద్యోగులైతే ప్రత్యేకంగా వారి వేతనం నుంచి ప్రీమియం కట్టాల్సిన ఇబ్బంది లేకుండా భవిష్య నిధి (ఈపీ ఎఫ్)ని అందుకు ఉపయోగించుకోవచ్చు. చాలా మందికి ఈ విష యమై అవగాహన లేదు. ఈ సదుపాయం ఎలాగో ఓసారి చూద్దాం... కొత్తగా ఎల్ఐసీ పాలసీ తీసుకుంటున్నా, ఇప్పటికే పాలసీ తీసుకుని ఉన్నా... సంబంధిత పాలసీ వివరాలను ఈపీఎఫ్‌వోకు తెలియజేసి ప్రీమియాన్ని తమ భవిష్య నిధి నుంచి చెల్లించాలని కోరవచ్చు. అయితే, ఈపీఎఫ్‌వోకు చెప్పాం కదా అని దాని గురించి పట్టించుకోవటం మానొద్దు. ఎందుకంటే బీమా పాలసీ ప్రీమియాన్ని పీఎఫ్ నుంచి చెల్లించాలని కోరిన తర్వాత మీ భవిష్యనిధి ఖాతాలో నగదు నిల్వలు తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే ఈపీఎఫ్‌వో ఎలా చెల్లిస్తుంది చెప్పండి? పైపెచ్చు ఈ విషయంలో మిమ్మల్ని ఈపీఎఫ్‌వో అప్రమత్తం చేయదు కూడా. ఆ బాధ్యత పాలసీదారుడిపైనే ఉంటుంది. ఈపీఎఫ్‌వో గనక ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అయిపోతుందని గుర్తుంచుకోవాలి. భవిష్య నిధిలో డబ్బులున్నంత కాలం ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు సదుపాయం యాక్టివ్గానే ఉంటుంది. నిధిని ఖాళీ చేసేస్తే పాలసీదారు స్వయంగా బీమా పాలసీ ప్రీమియాన్ని గుర్తుంచుకుని మరీ చెల్లించుకోవాలి. ఈపీఎఫ్‌కు హక్కులివ్వాలి... భవిష్య నిధి నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియాన్ని చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని అనుకుంటే... ఆ పాలసీపై హక్కుల్ని ఈపీఎఫ్‌వో సంస్థకు దఖలు పరచాలనే నిబంధన ఉంది. భవిష్య నిధి నుంచి పాలసీ ప్రీమియాన్ని చెల్లించడం ద్వారా దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా ఈ నిబంధన విధించినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ఎల్ఐసీ ఎండోమెంట్ పాలసీని సరెండ్ చేయడం ద్వారా కట్టిన మొత్తంలో కొంత వెనక్కి అందుకునే అవకాశం ఉందన్న విషయం తెలుసు. అలాగే, పాలసీపై రుణం పొందే సదుపాయం కూడా ఉంది. భవిష్య నిధిని బీమా పాలసీకి మళ్లించి అక్కడి నుంచి నిధిని తరలించుకుపోకుండా ఈ నిబంధన విధించి ఉండవచ్చు. రెండేళ్లు నిండాలి... ఈ సదుపాయం కోసం ఈపీఎఫ్ చందాదారుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న వారే అర్హులు. ఉద్యోగం చేస్తున్న సంస్థలోనే ఇందుకు సంబంధించి ఫామ్ 14ను ఇస్తే సరిపోతుంది. ఈ ఫామ్‌ను ఈపీఎఫ్‌వో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్య నిధి నుంచి చెల్లించడం సరైనదేనా? ఎల్ఐసీ పాలసీ ప్రీమియాన్ని భవిష్య నిధి నుంచి చెల్లించడం కరెక్టేనా? అన్న సందేహం సహజం. జీవితానికి బీమా పాలసీ ఎంతో కీలకమైనది. ప్రీమియం సకాలంలో చెల్లిస్తేనే పాలసీ మనుగడలో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈపీఎఫ్‌వో ప్రీమియాన్ని చెల్లించిందా? లేదా? అన్నది గడువు తేదీ తర్వాత బీమా కార్యాలయంలో తెలుసుకోవాలి. లేదంటే వెంటనే చెల్లించాలి. ఈ మాత్రం సమయం కేటాయించే తీరిక ఉంటే భవిష్య నిధి నుంచి ప్రీమియాన్ని నిశ్చింతగా చెల్లించుకోవచ్చు. ఎందుకంటే భవిష్యనిధిలో నగదు నిల్వలు లేక ఈపీఎఫ్‌వో చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. దాంతో పాలసీదారుడు రిస్క్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక, భవిష్యనిధి అనేది ఉద్యోగ విరమణ తర్వాత అక్కరకు వచ్చే చక్కని సాధనం. దాని నిల్వల నుంచి పాలసీ ప్రీమియం చెల్లించడం కంటే వీలుంటే సొంత బడ్జెట్ నుంచి చెల్లించటమే మంచిది. బడ్జెట్ కష్టంగా ఉంటే, వేతనం నుంచి కట్టే అవకాశం లేకపోతేనే ఈపీఎఫ్ నుంచి చెల్లించడం ఎంచుకోవాలి. –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం