ఆ విమానం సెర్చింగ్‌కు స్పెషల్ చాపర్లు
గువాహటి: కనిపించకుండా పోయిన భారత వైమానిక విభాగానికి చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం జాడ తెలుసుకునేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. సీ-130 యుద్ధ విమానంతోపాటు ఎలెక్ట్రో పెలోడ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్‌హెచ్) హెలికాప్టర్ సహాయంతో కనిపించకుండాపోయిన సుఖోయ్‌ను గాలించారు.
అయితే, సుఖోయ్ కనిపించకుండా పోయిన ప్రాంతం మొత్తం కూడా దట్టంగా పొగమంచు కప్పుకొని ఉన్నకారణంగా సరిగా కనిపించని పరిస్థితి ఉంది. ఆ వైపుగా వెళ్లేందుకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు కూడా ఆ విమానం గురించిగానీ, పైలట్ల గురించి ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో గాలింపు చర్యలు ఆపేశారు.